కె.విశ్వనాథ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
 
==సినీ ప్రస్థానం ==
[[చెన్నై]] లోని ఒక స్టూడియోలో సాంకేతిక నిపుణుడి (సౌండ్ రికార్డిస్టు) గా సినిమా జీవితాన్ని మొదలుపెట్టాడు. అన్నపూర్ణ సంస్థ నిర్మించిన [[తోడికోడళ్ళు]] అనే సినిమాకు పనిచేస్తున్నపుడు ప్రముఖ దర్శకుడు [[ఆదుర్తి సుబ్బారావు]] తో పరిచయం ఏర్పడి ఆయన వద్ద సహాయకుడిగా చేరాడు. ఆయనతో కలిసి అన్నపూర్ణ వారి ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అప్పటికే ఆయన ప్రతిభను గుర్తించిన [[అక్కినేని నాగేశ్వరరావు]] తర్వాత సినిమాకు దర్శకుడిగా అవకాశం ఇస్తానని వాగ్దానం చేశాడు. అలా డాక్టర్ చక్రవర్తి తర్వాత అక్కినేని నాయకుడిగా నిర్మించిన [[ఆత్మ గౌరవం]] సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు. అప్పట్లో [[ఆకాశవాణి]] హైదరాబాదులో[[హైదరాబాదు]]లో నిర్మాతగా ఉన్న గొల్లపూడి మారుతీరావు, ప్రముఖ రచయిత్రి యుద్ధనపూడి సులోచనారాణి ఈ సినిమాకు కథను సమకూర్చగా, భమిడిపాటి రాధాకృష్ణ, గొల్లపూడి కలిసి మాటలు రాశారు. [[దుక్కిపాటి మధుసూదనరావు]] స్క్రీన్ ప్లే రాశాడు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి లభించింది.<ref>{{Cite book|title=సితార: పాటల పల్లకి శీర్షిక పరువము పొంగే వేళలో షెహనాయి అందుకే|last=షణ్ముఖ|first=|publisher=ఈనాడు|year=2017|isbn=|location=హైదరాబాదు|pages=16}}</ref> [[సిరిసిరిమువ్వ]] సినిమాతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది.
 
విశ్వనాథ్ చలనచిత్ర జీవితంలో కలికితురాయి వంటిది [[శంకరాభరణం]]. జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా, తెలుగు సినిమా [[చరిత్ర]]<nowiki/>లో కూడా ఒక మైలురాయి వంటిది. పాశ్చాత్య సంగీతపు హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సాంప్రదాయం సంగీతానికి పూర్వవైభవాన్ని పునస్థాపించాలనే ఉద్దేశ్యాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించారు. భారతీయ సాంప్రదాయ కళలకు పట్టం కడుతూ ఆయన మరిన్ని సినిమాలు తీసారు. వాటిలో కొన్ని ''[[సాగరసంగమం]]'', ''[[శృతిలయలు]]'', ''[[సిరివెన్నెల]]'', ''[[స్వర్ణకమలం]]'', ''[[స్వాతికిరణం]]'' మొదలైనవి.
"https://te.wikipedia.org/wiki/కె.విశ్వనాథ్" నుండి వెలికితీశారు