కద్రువ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
తెలివితక్కువ లింకులను తీసేసాను.
పంక్తి 1:
'''[[కద్రువ]]''' [[కశ్యపుడు|కశ్యపుని]] భార్య. ఈమె [[తండ్రి]] [[దక్షుడు]] . [[దితి]], [[అదితి]] ఈమె సవతులు. వేయి [[సర్పాలు]] ఈమె సంతానం. శాప కారణంగా ఈమెకు [[వినత]] దాసి అవుతుంది. కశ్యవుని భార్యలలో ఒకతె. దక్షుని కూఁతురు. ఈమెయందు నాగకులము పుట్టెను. అందు [[ఆదిశేషుడు|ఆదిశేషువు]] జ్యేష్ఠుఁడు. [[వాసుకి]], కర్కోటకుఁడు, తక్షకుఁడు ఐరావతుఁడు, ఏలాపుత్రుఁడు మొదలయిన వారు ఇతరులు.
కశ్యవుని భార్యలలో ఒకతె. దక్షుని కూఁతురు. ఈమెయందు నాగకులము పుట్టెను. అందు [[ఆదిశేషువు]] జ్యేష్ఠుఁడు. [[వాసుకి]], కర్కోటకుఁడు, తక్షకుఁడు ఐరావతుఁడు, ఏలాపుత్రుఁడు మొదలయిన వారు ఇతరులు.
 
ఒకదినము సాయంకాలమున కద్రువయు, ఆమెసవతి వినతయు పాలసముద్రము గట్టున విహరించుచు ఉండి అచ్చట మేయుచు ఉండిన ఉచ్చైశ్రవమును చూచి కద్రువ 'అక్కా ఈగుఱ్ఱము దేహము అంతయు తెల్లఁగా ఉండియు తోఁకమాత్రము నల్లగా ఉన్నది చూచితివా' అని చెప్పెను. వాస్తవముగా తోఁకయు తెల్లగానే ఉన్నందున వినత 'అట్లులేదు నీవు చక్కగా చూడుము' అని చెప్పెను. అది విని కద్రువ 'అది దూరముగా ఉన్నది కనుక నీకు చక్కగా తెలియలేదు దగ్గఱపోయిచూచి నల్లగా ఉండినయెడ నీవునాకు దాసివి అగుము, లేనియెడ నేను నీకు దాసిని అయ్యెదను' అని, పందెమువేసికొని అది అస్తమయసమయముగా ఉన్నందున మఱునాఁడు తెల్లవాఱి వచ్చి చూచునట్లు నిష్కర్ష చేసికొనిరి. అనంతరము కద్రువ తన కొడుకులవద్దకు పోయి వారికి, తనకును వినతకును జరిగిన వాగ్వాదమును పందెమువేసికొనుటను తెలియపఱిచి మఱుసటినాటి ఉదయమున తాను సముద్రతీరమునకు వచ్చువేళకు ఆగుఱ్ఱము తోఁక నల్లగా ఉండునట్లు చేయవలయును అని వేఁడుకొనెను. అందుకు శేషుఁడు మొదలయిన కొందఱు అది అధర్మము అని ఆపనికి సమ్మతింపక పోఁగా సర్పములు అన్నియు జనమేజయుని సర్పయాగమునందు పడి నశించునట్లు కద్రువ శపించెను. శపింపఁగానే ఆశాపమునకు వెఱచి [[కర్కోటకుఁడు]] అనువాఁడు [[అమ్మ|తల్లి]] ఇష్టప్రకారము చేసెను కనుక వినత కద్రువకు దాసి అయ్యెను. ఈదాసీత్వమును గరుడుఁడు మాన్పెను. (చూ|| గరుడుఁడు.) [[ఆదిశేషుఁడు]] మహాతపము ఆచరించి విష్ణుప్రసాదము పడసి అతనికి పాన్పై [[వేయిపడగలు|వేయిపడగల]]<nowiki/>తో [[భూమి]]<nowiki/>ని మోయుచు ఉండును. వాసుకి రుద్రునికి [[భూషణము]] అయ్యెను.
==మూలాలు==
*డా.[[బూదరాజు రాధాకృష్ణ]] సంకలనం చేసిన [[పురాతన నామకోశం]]. ([[విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌]] వారి ప్రచురణ).
"https://te.wikipedia.org/wiki/కద్రువ" నుండి వెలికితీశారు