మధుసూదన సరస్వతి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), లను గురించి → ల గురించి , ఉన్నవి. → ఉన్నాయి. using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 2:
 
== బాల్యం ==
 
ప్రస్తుతం [[బంగ్లాదేశ్]]లో ఉన్న ఫరిద్పూర్ జిల్లా లోని కోటలిపాడా అనే ఊరిలో ప్రమోద పురందర ఆచార్యునికి సంతానంగా మధుసూదన సరస్వతి జన్మించారు. వారికి తల్లిదండ్రులు పెట్టిన పేరు కమలనయనుడు<ref name="SuresBenarji"/>.
 
== సన్న్యాసం ==
 
మధుసూదన సరస్వతి తొలుత [[పశ్చిమ బెంగాల్]] లోని నవద్వీపంలో నవ్యన్యాయ దర్శనాన్ని చదువుకున్నారు. నవ్యన్యాయ పద్ధతి అద్వైతాన్ని ఖండిస్తుంది. అందుచేత అద్వైతులతో వాదించడానికని అద్వైతంలో లోటు పాట్లని అర్థం చేసుకోవడం కోసం [[వారణాసి]]కి వెళ్ళి అభ్యాసం మొదలుపెట్టారు. చివరకు అద్వైతంలోని లోతులు తెలుసుకుని అద్వైతిగా సన్న్యసించారు. వీరి గురువు పేరు విశ్వేశ్వర సరస్వతి<ref name="SuresBenarji"/>.
 
== ద్వైత-అద్వైత వాదాలు ==
 
[[మధ్వాచార్యులు]] "న్యాయామృత" అనే గ్రంథంలో అద్వైతాన్ని ఖండిస్తూ వేసిన ప్రశ్నలకు మధుసూదన సరస్వతి [[అద్వైత సిద్ధి]] అనే రచనలో లోతైన సమాధానాలను ఇచ్చారు<ref name="advaitasiddhi">ఆనంద్ హుడ్లీ, అంతర్జాలంలో ''అద్వైత సిద్ధి'' ఆంగ్లానువాదం, 2009, "http://www.advaitasiddhi.org/"</ref>. ఇది చాలా ప్రాచుర్యం ఉన్న గ్రంథం<ref name="Surendranath">Surendranath Dasgupta, ''A History of Indian Philosophy - Volume 2 of 5'', 225వ పుట, "http://books.google.com/books?id=dU2E6Ns1u28C"</ref>. అంతే కాక ఇతర రచనలలో [[సాంఖ్య దర్శనము|సాంఖ్యం]], నవ్యన్యాయం మొదలైన దర్శనాలను కూడా తర్కబద్ధంగా ఖండించారు.
 
== రచనలు ==
 
మధుసూదన సరస్వతి వేదాంతం, భక్తి, శాస్త్రం మొదలైన అంశాల గురించి చాలా రచనలు చేసారు. వీరు శంకరాచార్యుల వలే, అద్వైతంలోని లోతులను చూసినప్పటికీ, నిత్యజీవితంలో భక్తికి చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు. అందుబాటులో ఉన్న ఈయన రచనలు: వేదాంత కల్ప లతికా, అద్వైత సిద్ధి, అద్వైత మంజరి, అద్వైత రత్న రక్షణ, ఆత్మ బోధ టీకా, ఆనంద మందాకిని, కృష్ణ కుతూహల నాటక, ప్రస్థాన భేద, భక్తి సామాన్య నిరూపణ, [[భగవద్గీత]] గూఢార్థ దీపిక, భగవద్ భక్తి రసాయన, భాగవత పురాణ ప్రథమ శ్లోక వాక్య, వేద స్తుతి టీకా, శాండిల్య సూత్ర టీకా, శాస్త్ర సిద్ధాంత లేశ టీకా, సంక్షేప శారీరక సార సంగ్రహ, సిద్ధాంత తత్త్వబిందు, హరిలీలా వ్యాఖ్య <ref name="Surendranath"/>.
 
వీటిలో అద్వైతసిద్ధి, [[భగవద్గీత]] గుఢార్థ దీపిక, ప్రస్థానభేద చాలా ప్రాచుర్యం ఉన్నాయి.
 
== ఆధారాలు ==
"https://te.wikipedia.org/wiki/మధుసూదన_సరస్వతి" నుండి వెలికితీశారు