సిద్ధవటం: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు ఆరు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి. ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉంది.ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల కడపలో ఉంది. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ [[కడప]]లో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కడపలో ఉన్నాయి.
 
== వైద్య సౌకర్యం ==
=== ప్రభుత్వ వైద్య సౌకర్యం ===
Line 44 ⟶ 43:
* బంజరు భూమి: 29 హెక్టార్లు
* నికరంగా విత్తిన భూమి: 169 హెక్టార్లు
 
* వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 213 హెక్టార్లు
==నీటిపారుదల సౌకర్యాలు==
 
సిద్ధవటంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
 
 
* బావులు/బోరు బావులు: 213 హెక్టార్లు
 
 
 
 
== ఉత్పత్తి==
సిద్ధవటంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
===ప్రధాన పంటలు===
[[వరి]], [[పసుపు]], [[ఉల్లి]]
 
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 37,452 - పురుషులు 18,937 - స్త్రీలు 18,515
;
 
==మూలాలు==
 
== చరిత్ర ==
విజయనగర సామ్రాజ్య చక్రవర్తియైన వీర నరసింహదేవరాయలు క్రీ.శ.1506 నుంచి 1509 వరకూ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఆయన పరిపాలన కాలంలో ఈ ప్రాంతాన్ని సంబెట గురవరాజు అనే సామంతుడు పరిపాలిస్తూండేవాడు. సంబెట గురవరాజు ఘోరమైన శిక్షలు విధించేవారు. ప్రజల వద్ద డబ్బు స్వీకరించేప్పుడు సొమ్ము ఇవ్వనివారి స్త్రీల సంఖ్యను పట్టి అసభ్యంగా వారి స్తనాలకు చిరతలు పట్టించేవాడు. కూచిపూడి భాగవతులు ఈ గ్రామానికి వచ్చి ప్రదర్శనలు చేస్తూన్నప్పుడు గురవరాజు ఘోరకృత్యాలను చూసి తట్టుకోలేక విద్యానగరం(విజయనగరం) వెళ్ళిపోయారు. వీర నరసింహరాయల సమక్షంలో కూచిపూడి భాగవతులు ప్రదర్శన ఇచ్చేప్పుడు అవకాశం వినియోగించుకుని గురవరాజు వేషం, ఆయన ధనం సంపాదించే ప్రయత్నాలు చేయడం, చివరకు యువతి వేషం వేసుకున్న నటుడిని అసభ్యంగా స్తనాలకు చిరుతలు పట్టించడం వంటివి ప్రదర్శించారు. ఈ అసాధారణ ప్రదర్శన చూసి, ఇది ఇలా ఎందుకు ఉందని మంత్రులను, కొందరు సన్నిహితులైన సామంతులను ప్రశ్నించారు. వారిలో కొందరు సంబెట గురవరాజు చేస్తూన్న ఘోరకార్యకలాపాలను గురించి వివరించారు. దీనిపై ఆగ్రహోదగ్రుడైన రాయలు తర్వాత రోజు ఉదయాన్నే గురవరాజుపైకి సైన్యాన్ని పంపి, బందీని చేసి తీసుకువచ్చి, మరణశిక్ష విధించి వధించారు.<ref name="కథలు గాథలు">{{cite book|last1=వెంకట శివరావు|first1=దిగవల్లి|title=కథలు-గాథలు|date=1944|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|pages=127 - 140|edition=1|url=https://archive.org/details/in.ernet.dli.2015.371485|accessdate=1 December 2014}}</ref>
 
==సిద్ధవటం కోట==
 
పవిత్ర పెన్నానది ఒడ్డున క్రీ.పూ. 40-30 సంవత్సరాల మధ్యకాలంలో సిద్దవటం కోట రూపుదిద్దుకుంది. సుమారు 36 ఎకరాలపైబడి విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కోటను 18 రాజవంశీయులు పాలించారు. మౌర్యుల నుంచి [[తూర్పు ఇండియా]] వర్తకసంఘం వరకూ ఈ కోటను పాలించారు. 1543 నుంచి 1579 వరకూ సాగిన పాలనను స్వర్ణయుగంగా పరిగణిస్తారు. 1605 వరకూ ఉన్న మట్టి కోట కాస్తా రాతికట్టడంగా మారింది. క్రీ.శ. 1792లో [[టిప్పుసుల్తాన్‌]] చేతి నుంచి [[నైజాము]] నవాబుల పాలనలోకి, వారి నుంచి 1880లో తూర్పు ఇండియా వర్తకసంఘం ఆధీనంలోకి ఈ కోట చేరింది. [[బ్రిటిష్‌]]పాలనలో 1808 నుంచి 1812 వరకూ ఇది తొలి జిల్లా కేంద్రంగా ఉండి, పరిపాలన కేంద్రంగా భాసిల్లింది.
 
ఇక్కడ మధ్యయుగం నాటి కోట ఒకటి ఉంది. దక్షిణం వైపు పెన్నా నది, మిగిలిన మూడు వైపుల లోతైన అగడ్తతో శతృవులు ప్రవేశించేందుకు వీలు కాని రీతిలో ఈ కోట నిర్మించబడింది.
 
మట్లి రాజులు [[నాయంకరం]]గా ఈ కోటను పాలించే నాటికి ఇది మట్టి కోట. [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీ కృష్ణదేవరాయల]] అల్లుడు [[వరదరాజు]] మొదట ఈ కోటను పాలించాడు. అంతకు ముందు ఈ కోట [[ఉదయగిరి]] రాజ్యంలో ఉండేది. [[రెండవ వెంకటపతిరాయలు|రెండవ వెంకటపతిరాయల]]కు మట్లి ఎల్లమరాజు యుద్ధాల్లో బాగా సహకరించాడు. అందుకు గుర్తుగా ఎల్లమరాజుకు అమరనాయంకరంగా సిద్ధవటాన్ని ఇచ్చాడు. మరికొన్ని ప్రాంతాలను సిద్ధవటానికి చేర్చాడు. మట్లి అనంతరాజు మట్టికోటను శతృదుర్భేద్యమైన రాతికోటగా నిర్మించాడు. ఈయన తన తండ్రి పేర ఎల్లమరాజు చెరువును, తన పేర అనంతరాజు చెరువును త్రవ్వించాడు. అనంతరాజు 'కకుత్‌స్థ విజయము ' అనే కావ్యాన్ని రచించాడు. ఈయన ఆస్థానంలో ఉప్పుగుండూరు వెంకటకవి, కవి చౌడప్ప ఉండేవారు.
 
మట్లి రాజుల పతనం తర్వాత [[ఔరంగజేబు]] సేనాని [[మీర్ జుమ్లా]] సిద్ధవటాన్ని ఆక్రమించి పాలించాడు. ఆ తర్వాత [[ఆర్కాటు నవాబులు]] సిద్ధవటాన్ని స్వాధీనం చేసుకున్నారు. కడపను పాలిస్తున్న అబ్దుల్ నబీఖాన్ 1714లో సిద్ధవటాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొన్నాడు. మయానా నవాబులు సిద్ధవటాన్ని పాలించారు. 1799లో సిద్ధవటం ఈస్టిండియా కంపెనీ వశమయింది.<ref name="సూర్య">{{cite news|title=శిల్పకళా తోరణం.. సిద్ధవటం|url=http://www.suryaa.com/features/article.asp?subCategory=5&ContentId=89051|accessdate=29 December 2014|agency=సూర్య|publisher=సూర్య|date=జూలై 10, 2012}}</ref>
 
'''కోట:''' కోటకు పడమట, తూర్పున రెండు ద్వారాలున్నాయి.ముఖద్వారం ఇరువైపులా [[ఆంజనేయుడు]], [[గరుత్మంతుడు]] శిల్పాలు ఉన్నాయి. పశ్చిమ ద్వారం ఇరువైపులా నాట్య భంగిమలో అందమైన శిల్పాలు ఉన్నాయి. పశ్చిమ ద్వారం లోపలి పైభాగాన రాహు గ్రహణం పట్టువిడుపులు ఉన్నాయి. కోట మధ్య భాగంలోని అంతఃపురం శిథిలమై ఉంది. రాణి దర్బారు, [[ఈద్గా]] మసీదు, సమీపంలో నగారాఖానా ఉన్నాయి. నగారాఖానా వెనుక కోట గోడకు మధ్య తాగునీటి కోనేరు ఉంది. కోటలో సిద్ధవటేశ్వరస్వామి ఆలయం, ఎదురుగా నంది విగ్రహం ఉన్నాయి. శిథిలమవుతూ ఉన్న [[కామాక్షి]] ఆలయాన్ని మరమ్మత్తులు చేసి ఉంచారు. తూర్పు ద్వారానికి సమీపంలో బిస్మిల్లా షావలి దర్గా ఉంది. [[టిప్పు సుల్తాన్]] కాలంలో దీన్ని నిర్మించారు. ప్రక్కనే మసీదు ఉంది. మసీదుకు తూర్పుగా కోటగోడలో సొరంగ మార్గాన్ని ఏట్లోకి నిర్మించారు. చక్రయంత్రం ద్వారా ఏట్లో నీటిని మసీదు తొట్టిలోకి తోడేవారు.
* లంకమల లోని నిత్యపూజకోనలొ [[మహాశివరాత్రి]] ఉత్సవాలు ప్రతి సంవత్సరం మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. జిల్లాలో పెద్దయెత్తున శివరాత్రి ఉత్సవాలు జరిగే ప్రాంతాలలో పొలతల తరువాతి స్థానం నిత్యపూజకోనదే. [1]
 
==ప్రముఖులు==
*శశిశ్రీ [[షేక్ బేపారి రహంతుల్లా]] . ఆశుకవి, రచయిత, సీనియర్ జర్నలిస్టు,వక్త.
* [[బాషా ఎస్‌.ఎం]] - అనంతపురం జిల్లా ప్ర జ లు, ప్ర దానంగా రైతాంగ సమస్యలను విశ్లేషిస్తూ పరిశోధానాత్మక వ్యాసాలు వివిధా పత్రికలలో ప్రచురించారు.
*[[నెమిలి పట్టాభి రామారావు]]
 
==గ్రామాలు==
{{colbegin}}
Line 112 ⟶ 91:
{{colend}}
{{వైఎస్ఆర్ జిల్లా మండలాలు}}
 
[1] ఈనాడు కడప; 2014,ఫిబ్రవరి-25; 3వ పేజీ.
{{సిద్ధవటం మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ కోటలు]]
[[వర్గం:రాయలసీమ కోటలు]]
"https://te.wikipedia.org/wiki/సిద్ధవటం" నుండి వెలికితీశారు