సిద్ధవటం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 57:
==మూలాలు==
== చరిత్ర ==
విజయనగర సామ్రాజ్య చక్రవర్తియైన వీర నరసింహదేవరాయలు క్రీ.శ.1506 నుంచి 1509 వరకూ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఆయన పరిపాలన కాలంలో ఈ ప్రాంతాన్ని సంబెట గురవరాజు అనే సామంతుడు పరిపాలిస్తూండేవాడు. సంబెట గురవరాజు ఘోరమైన శిక్షలు విధించేవారు. ప్రజల వద్ద డబ్బు స్వీకరించేప్పుడు సొమ్ము ఇవ్వనివారి స్త్రీల సంఖ్యను పట్టి అసభ్యంగా వారి స్తనాలకు చిరతలు పట్టించేవాడు. కూచిపూడి భాగవతులు ఈ గ్రామానికి వచ్చి ప్రదర్శనలు చేస్తూన్నప్పుడు గురవరాజు ఘోరకృత్యాలను చూసి తట్టుకోలేక విద్యానగరం (విజయనగరం) వెళ్ళిపోయారు. వీర నరసింహరాయల సమక్షంలో కూచిపూడి భాగవతులు ప్రదర్శన ఇచ్చేప్పుడు అవకాశం వినియోగించుకుని గురవరాజు వేషం, ఆయన ధనం సంపాదించే ప్రయత్నాలు చేయడం, చివరకు యువతి వేషం వేసుకున్న నటుడిని అసభ్యంగా స్తనాలకు చిరుతలు పట్టించడం వంటివి ప్రదర్శించారు. ఈ అసాధారణ ప్రదర్శన చూసి, ఇది ఇలా ఎందుకు ఉందని మంత్రులను, కొందరు సన్నిహితులైన సామంతులను ప్రశ్నించారు. వారిలో కొందరు సంబెట గురవరాజు చేస్తూన్న ఘోరకార్యకలాపాలను గురించి వివరించారు. దీనిపై ఆగ్రహోదగ్రుడైన రాయలు తర్వాత రోజు ఉదయాన్నే గురవరాజుపైకి సైన్యాన్ని పంపి, బందీని చేసి తీసుకువచ్చి, మరణశిక్ష విధించి వధించారు.<ref name="కథలు గాథలు">{{cite book|last1=వెంకట శివరావు|first1=దిగవల్లి|title=కథలు-గాథలు|date=1944|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|pages=127 - 140|edition=1|url=https://archive.org/details/in.ernet.dli.2015.371485|accessdate=1 December 2014}}</ref>
 
==సిద్ధవటం కోట==
పవిత్ర పెన్నానది ఒడ్డున క్రీ.పూ. 40-30 సంవత్సరాల మధ్యకాలంలో సిద్దవటం కోట రూపుదిద్దుకుంది. సుమారు 36 ఎకరాలపైబడి విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కోటను 18 రాజవంశీయులు పాలించారు. మౌర్యుల నుంచి [[తూర్పు ఇండియా]] వర్తకసంఘం వరకూ ఈ కోటను పాలించారు. 1543 నుంచి 1579 వరకూ సాగిన పాలనను స్వర్ణయుగంగా పరిగణిస్తారు. 1605 వరకూ ఉన్న మట్టి కోట కాస్తా రాతికట్టడంగా మారింది. క్రీ.శ. 1792లో [[టిప్పుసుల్తాన్‌]] చేతి నుంచి [[నైజాము]] నవాబుల పాలనలోకి, వారి నుంచి 1880లో తూర్పు ఇండియా వర్తకసంఘం ఆధీనంలోకి ఈ కోట చేరింది. [[బ్రిటిష్‌]]పాలనలో 1808 నుంచి 1812 వరకూ ఇది తొలి జిల్లా కేంద్రంగా ఉండి, పరిపాలన కేంద్రంగా భాసిల్లింది.
"https://te.wikipedia.org/wiki/సిద్ధవటం" నుండి వెలికితీశారు