వికీపీడియా:నమ్మదగ్గ మూలాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
==మూలాలు==
వ్యాసంలో ఒక సమాచారాన్ని నిర్ధారించడానికి ఆధారంగా పనికివచ్చే పుస్తకాలు, వెబ్‌సైట్లు, జర్నల్స్, పత్రికలు, వీడియోలు వంటివాటన్నిటినీ మూలాలుగానే ఈ మార్గదర్శక పేజీ పేర్కొంటుంది. వీటిని ప్రధానంగా మూడుగా విభజించవచ్చు:
;=== ప్రాథమిక మూలాలు ===
ఒక అంశానికి నేరుగా సంబంధించిన మూలాలను ప్రాథమిక మూలాలు అనవచ్చు, ఇవి ఆ అంశానికి ప్రత్యక్ష సంబంధం ఉన్నవారు రాసేవి. ఉదాహరణకు ఒక సంఘటనకు ప్రత్యక్ష సాక్షుల కథనం, ఒక వ్యక్తి ఆత్మకథ, ఒక సందర్భంలో స్థానిక పత్రికా విలేకరి ప్రత్యక్ష కథనం వంటివి ప్రాథమిక మూలాలు. '''ప్రాథమిక మూలాల ఆధారంగా వ్యాసంలో పెద్ద భాగాలను కానీ, విశ్లేషణాత్మకమైన అంశాలను కానీ రాయకూడదు, అలానే మొత్తం వ్యాసాన్ని ప్రాథమిక మూలం ఆధారంగా రాయడమూ తగదు'''. ప్రాథమిక మూలాల నమ్మదగ్గవిగానూ, ఉపయోగకరంగానూ ఉండే సందర్బాలు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో [[వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం|మౌలిక పరిశోధన కాకుండా]] జాగ్రత్త వహించాలి. ఈ విషయంలో చేసే సూచనలు రెండు.
* ప్రాథమిక మూలాల్లో కనిపించే వర్ణనలు ఒక ఆ అంశంపై లోతైన అవగాహన లేని సామాన్యమైన విద్యావంతుడు స్వయంగా పరిశీలించి నిర్ణయించుకోగలిగిన సందర్భంలో మాత్రమే చేర్చాలి. అలా చేర్చిన సందర్భంలో కూడా ఫలానా వ్యక్తి లేక ఫలానా దస్త్రం ప్రకారం అన్న విషయం స్పష్టంగా రాయాలి.
* ప్రాథమిక మూలాలలోని వర్ణనలు, విశేషాలను ఆధారం చేసుకుని విశ్లేషణలు, అభిప్రాయాలు, వివరణలు చేర్చకూడదు.
* ఒక వివాదాస్పదమైన అంశంపై పరస్పరం వ్యతిరేకమైన రెండు ప్రాథమిక మూలాలు లభ్యమవుతూ, ఏ కథనాన్ని నిర్థారించగల ద్వితీయ స్థాయి మూలం లభ్యం కాని సందర్భాల్లో రెండు అంశాల్లో ఒక దాన్ని సమర్థించకుండా రెండిటినీ రాయాలి.
;=== ద్వితీయ స్థాయి మూలాలు ===
ద్వితీయ స్థాయి మూలాలు ప్రాథమిక మూలాలు, ద్వితీయ స్థాయి మూలాలు వంటివి ఆధారం చేసుకుని తయారుచేసే విశ్లేషణాత్మక, పరిశోధనాత్మక మూలాలు. ఉదాహరణకు ప్రత్యక్ష సాక్షుల కథనాలకు తోడు, గణాంకాలను స్వీకరించి పరిశోధించి నిర్ధారణకు వస్తూ వ్యాసాన్ని రాస్తే అది ద్వితీయ స్థాయి మూలం అవుతుంది. అలానే ఆత్మకథను, ఆ వ్యక్తి గురించిన పలు ద్వితీయ స్థాయి మూలాలను మథించి రాసే జీవిత చరిత్ర ద్వితీయ స్థాయి మూలం అవుతుంది. '''ప్రాథమిక, తృతీయ స్థాయి మూలాలతో పాటు అదే సమాచారాన్ని నిర్ధారించగల ద్వితీయ స్థాయి మూలాలు దొరుకుతూంటే ద్వితీయ స్థాయి మూలాలనే ఎంచుకోవాలి, వికీపీడియా వ్యాసాలు మౌలికంగా ద్వితీయ స్థాయి మూలాల ఆధారంగా నిర్మించాలి.'''
;=== తృతీయ స్థాయి మూలాలు ===
తృతీయ స్థాయి మూలాలు