వికీపీడియా:నమ్మదగ్గ మూలాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
== స్వీకరించరాని మూలాలు ==
* '''బ్లాగులు''': బ్లాగులు స్వంత అభిప్రాయ ప్రకటనకు వేదికలు. బ్లాగుని వ్యక్తులు స్వంతంగా ప్రచురిస్తారు. వీటిలో సమాచారానికి, అభిప్రాయాలకు ఆధారాలు, మూలాలు ఖచ్చితంగా ఉండాలని నియమం లేదు. అందుకే బ్లాగులను వికీపీడియా వ్యాసాలకు మూలాలుగా ఉపయోగించడం తగదు. కొన్ని బ్లాగులు ఇందుకు భిన్నంగా చక్కని విశ్లేషణతో, మూలాల సహితంగా, ప్రామాణికంగా ఉండే వీలున్నా వాటిని నిర్ధారించడం కష్టం. కనుక ఏ బ్లాగునీ మూలంగా తీసుకోరాదు.
* '''స్వీకరించరాని వెబ్‌సైట్లు''': [[వికీపీడియా:నమ్మదగ్గ మూలాలు/మూలాలుగా స్వీకరించరాని వెబ్‌సైట్లు|స్వీకరించరాని వెబ్‌సైట్లు]] పేజీలో, దాని చర్చా పేజీలో జరిగిన చర్చల ఆధారంగా వికీపీడియన్లు నిర్ధారించే కొన్ని గాసిపింగ్, అప్రామాణిక వెబ్‌సైట్లను మూలాలుగా ఇవ్వరాదు. పుకార్లు, ప్రచారం వంటివి ప్రధానంగా ఉండే వెబ్‌సైట్లు ఇందలో జాబితా వేయాలి.
== జాగ్రత్త వహించాల్సిన సందర్భాలు ==
* '''అభిప్రాయాలు, ఓప్-ఎడ్‌లు''': నమ్మదగ్గ మూలాలైన పత్రికల్లోనే ప్రచురితమైనా అభిప్రాయాలు, ఓపీనియన్ పీస్‌లు, ఓప్-ఎడ్‌లు, ఎడిటోరిల్స్ వంటివాటిని మూలాలుగా తీసుకున్నప్పుడు వాటిలోని గణాంకాలు, వాస్తవాలు తీసుకోవాలి. అభిప్రాయాలను, విశ్లేషణను తీసుకోవాల్సివస్తే ఆ అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తున్న వ్యక్తి పేరు ప్రస్తావిస్తూ రాయాలి, ఒకవేళ బైలైన్ లేని సందర్భంలో ఫలానా పత్రిక సంపాదకీయం ప్రకారం అని రాయాలి.