వికీపీడియా:దిద్దుబాటు యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'ఏదైనా పేజీలోని పాఠ్యంపై విభేదించిన రచయితలు, ఒకరి మార్పులను...'
ట్యాగు: 2017 source edit
(తేడా లేదు)

07:10, 10 జూలై 2018 నాటి కూర్పు

ఏదైనా పేజీలోని పాఠ్యంపై విభేదించిన రచయితలు, ఒకరి మార్పులను మరొకరు పదేపదే రద్దు చేసుకుంటూ పోతూంటే దాన్ని దిద్దుబాటు యుద్ధం అంటారు. వివాదంలో పాలుపంచుకున్న ఎడిటర్లు యుద్ధాలకు దిగకుండా ఒక ఏకాభిప్రాయానికి రావాలి, లేదా వివాద పరిష్కార మార్గాలను అనుసరించాలి. దిద్దుబాటు యుద్ధం విచ్ఛిన్నకారకం. ఎడిటర్ల మధ్య శతృత్వానికి దారితీసి, ఏకాభిప్రాయానికి మార్గం కష్టతరం చేస్తుంది. యుద్ధాలకు దిగిన వాడుకరులు నిరోధానికి, నిషేధానికీ కూడా గురయ్యే ప్రమాదం ఉంది. తనకు నచ్చిన కూర్పును పదేపదే పునరుద్ధరించే ఎడిటరు దిద్దుబాటు యుద్ధానికి దిగినట్లే; వారి మార్పులు సరైనవి అయినా, కాకపోయినా! "నా మార్పుచేర్పులు సరైనవి. కాబట్టి నాది దిద్దుబాటు యుద్ధం కాదు" అనేది వారి ప్రవర్తనకు సమర్ధన కాబోదు.