వికీపీడియా:దిద్దుబాటు యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వికీపీడియా వివాద పరిష్కారం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
ఏదైనా పేజీలోని పాఠ్యంపై విభేదించిన రచయితలు, ఒకరి మార్పులను మరొకరు పదేపదే రద్దు చేసుకుంటూ పోతూంటే దాన్ని '''దిద్దుబాటు యుద్ధం''' అంటారు. వివాదంలో పాలుపంచుకున్న ఎడిటర్లు యుద్ధాలకు దిగకుండా [[వికీపీడియా:ఏకాభిప్రాయం|ఒక ఏకాభిప్రాయానికి]] రావాలి, లేదా [[వికీపీడియా:వివాద పరిష్కారం|వివాద పరిష్కార మార్గాలను]] అనుసరించాలి. దిద్దుబాటు యుద్ధం విచ్ఛిన్నకారకం. ఎడిటర్ల మధ్య శతృత్వానికి దారితీసి, ఏకాభిప్రాయానికి మార్గం కష్టతరం చేస్తుంది. యుద్ధాలకు దిగిన వాడుకరులు [[వికీపీడియా:నిరోధ విధానం|నిరోధానికి]], నిషేధానికీ కూడా గురయ్యే ప్రమాదం ఉంది. తనకు నచ్చిన కూర్పును పదేపదే పునరుద్ధరించే ఎడిటరు దిద్దుబాటు యుద్ధానికి దిగినట్లే; వారి మార్పులు సరైనవి అయినా, కాకపోయినా! "నా మార్పుచేర్పులు సరైనవి. కాబట్టి నాది దిద్దుబాటు యుద్ధం కాదు" అనేది వారి ప్రవర్తనకు సమర్ధన కాబోదు.
 
[[వికీపీడియా:3RR_నియమం]] అనే స్పష్టమైన విధానముంది. తిరగకొట్టడమంటే (రివర్టు) ఒక వాడుకరి చేసిన మార్పులను రద్దు చెయడమే. 3RR ప్రకారం, 24 గంటల వ్యవధిలో, ఒకే పేజీలో మూడు కంటే ఎక్కువ సార్లు తిరగకొట్టడం చెయ్యకూడదు -ఒకే పాఠ్యాన్ని గాని, భిన్నమైన పాఠ్యాన్ని గానీ; పూర్తిగా గాని, పాక్షికంగా గానీ. 24 గంటల వ్యవధి దాటటం కోసం ఎదురు చూసి, అది పూర్తి కాగానే చేసే నాలుగో రివర్టును కూడా దిద్దుబాటు యుద్ధంగానే పరిగణించవచ్చు. 3RR కు కొన్ని మినహాయింపులున్నాయి. దుశ్చర్యను తొలగించడం, జీవించి ఉన్న వ్యక్తుల జీవిత చరిత్రల విషయంలో విధానాన్ని అతిక్రమించడాన్ని నిరోధించడం వంటివి ఈ మినహాయింపులు.
 
[[వర్గం:వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలు]]