"వికీపీడియా:దిద్దుబాటు యుద్ధం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
ఏదైనా పేజీలోని పాఠ్యంపై విభేదించిన రచయితలు, ఒకరి మార్పులను మరొకరు పదేపదే రద్దు చేసుకుంటూ పోతూంటే దాన్ని '''దిద్దుబాటు యుద్ధం''' అంటారు. వివాదంలో పాలుపంచుకున్న ఎడిటర్లు యుద్ధాలకు దిగకుండా [[వికీపీడియా:ఏకాభిప్రాయం|ఒక ఏకాభిప్రాయానికి]] రావాలి, లేదా [[వికీపీడియా:వివాద పరిష్కారం|వివాద పరిష్కార మార్గాలను]] అనుసరించాలి. దిద్దుబాటు యుద్ధం విచ్ఛిన్నకారకం. ఎడిటర్ల మధ్య శతృత్వానికి దారితీసి, ఏకాభిప్రాయానికి మార్గం కష్టతరం చేస్తుంది. యుద్ధాలకు దిగిన వాడుకరులు [[వికీపీడియా:నిరోధ విధానం|నిరోధానికి]], నిషేధానికీ కూడా గురయ్యే ప్రమాదం ఉంది. తనకు నచ్చిన కూర్పును పదేపదే పునరుద్ధరించే ఎడిటరు దిద్దుబాటు యుద్ధానికి దిగినట్లే; వారి మార్పులు సరైనవి అయినా, కాకపోయినా! "నా మార్పుచేర్పులు సరైనవి. కాబట్టి నాది దిద్దుబాటు యుద్ధం కాదు" అనేది వారి ప్రవర్తనకు సమర్ధన కాబోదు.
 
[[వికీపీడియా:3RR_నియమం]] అనే స్పష్టమైన విధానముంది. తిరగకొట్టడమంటే (రివర్టు) ఒక వాడుకరి చేసిన మార్పులను రద్దు చెయడమే. 3RR ప్రకారం, 24 గంటల వ్యవధిలో, ఒకే పేజీలో మూడు కంటే ఎక్కువ సార్లు తిరగకొట్టడం చెయ్యకూడదు -ఒకే పాఠ్యాన్ని గాని, భిన్నమైన పాఠ్యాన్ని గానీ; పూర్తిగా గాని, పాక్షికంగా గానీ. 24 గంటల వ్యవధి దాటటం కోసం ఎదురు చూసి, అది పూర్తి కాగానే చేసే నాలుగో రివర్టును కూడా దిద్దుబాటు యుద్ధంగానే పరిగణించవచ్చు. 3RR కు కొన్ని మినహాయింపులున్నాయి. దుశ్చర్యను తొలగించడం, జీవించి ఉన్న వ్యక్తుల జీవిత చరిత్రల విషయంలో విధానాన్ని అతిక్రమించడాన్ని నిరోధించడం వంటివి ఈ మినహాయింపులు.
 
==దిద్దుబాటు యుద్ధమంటే==
 
దిద్దుబాటు చేసేందుకు [[WP:be bold|వెనకాడవద్దని]] వికీపీడియా ప్రోత్సహిస్తుంది. కానీ ఏదైనా వివాదాస్పద మార్పు చేసినపుడు వేరే వాడుకరి దాన్ని తిరగ్గొట్టవచ్చు. ఇది చర్చకు ప్రారంభం కావచ్చు. ఇది వరసబెట్టి తిరగ్గొట్టడం, తిరిగి రాయడం, మళ్ళీ తిరగ్గొట్టడం వంటి చర్యలకు దారితీస్తే దిద్దుబాటు యుద్ధం మొదలైనట్లే. ఏదేమైనప్పటికీ, ప్రతీ రివర్టు, లేదా ప్రతీ వివాదాస్పద మార్పూ దిద్దుబాటు యుద్ధం కావు:
* దుశ్చర్యను తిరగ్గొట్టడం దిద్దుబాటు యుద్ధం కాదు. అయితే, [[వికీపీడియా:తటస్థ దృక్కోణం|ఒక దృక్కోణంతో]] చేసిన మార్పుచేర్పులు, మామూలుగా చేసే చేర్పులు తొలగింపులూ, సదుద్దేశంతో చేసే ఇతర మార్పులనూ దుశ్చర్యగా పరిగణించరు. {{section link|వికీపీడియా:దుశ్చర్య|దుశ్చర్యల్లో రకాలు}}, {{section link|వికీపీడియా:దుశ్చర్య|దుశ్చర్యలు కానివి}} చూడండి.
* వికీపీడియా విధానాలను అమలు చేసేందుకు చేసే రివర్టులు దిద్దుబాటు యుద్ధం కిందకి రావు.ఉదాహరణకు, జీవించి ఉన్న వ్యక్తుల వ్యాసంలో మూలాల్లేని ప్రతికూల పాఠ్యం చేరిస్తే చెరుపు జరుగుతుంది కాబట్టి, రివర్టు అవసరం.
* నిరోధిత, నిషేధిత వాడుకరుల మార్పుచేర్పులను తిరగ్గొట్టడం దిద్దుబాటు యుద్ధం కాదు.
* తన స్వంత వాడుకరి పేజీలోని మార్పులను తిరగ్గొట్టడాన్ని దిద్దుబాటు యుద్ధంగా సాధారణంగా పరిగణించరు. వాడుకరులు తమ స్వంత వాడుకరి పేజీని నిర్వహించుకోవడం పట్ల వికీపీడియా కొంత ఎక్కువ సంయమనం పాటిస్తుంది.
 
తిరగ్గొట్టేటపుడు కారణాలను చూపించండి. దీన్ని [[సహాయం:దిద్దుబాటు సారాంశం|దిద్దుబాటు సారాంశం]]లో గానీ [వికీపీడియా:చర్చ పేజీలను ఉపయోగించడం ఎలా|చర్చా పేజీ]]లో గానీ పెట్టవచ్చు. వివాదాస్పద పేజీల్లో [[WP:Twinkle|ట్వింకిల్]], [[WP:Huggle|హగుల్]], [[WP:Rollback|రోల్‌బ్యాక్]] వంటి పరికరాలను సరైన దిద్దుబాటు సారాంశం లేకుండా వాడరాదు.
 
[[వర్గం:వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2410335" నుండి వెలికితీశారు