వికీపీడియా:నమ్మదగ్గ మూలాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
ద్వితీయ స్థాయి మూలాలు ప్రాథమిక మూలాలు, ద్వితీయ స్థాయి మూలాలు వంటివి ఆధారం చేసుకుని తయారుచేసే విశ్లేషణాత్మక, పరిశోధనాత్మక మూలాలు. ఉదాహరణకు ప్రత్యక్ష సాక్షుల కథనాలకు తోడు, గణాంకాలను స్వీకరించి పరిశోధించి నిర్ధారణకు వస్తూ వ్యాసాన్ని రాస్తే అది ద్వితీయ స్థాయి మూలం అవుతుంది. అలానే ఆత్మకథను, ఆ వ్యక్తి గురించిన పలు ద్వితీయ స్థాయి మూలాలను మథించి రాసే జీవిత చరిత్ర ద్వితీయ స్థాయి మూలం అవుతుంది. '''ప్రాథమిక, తృతీయ స్థాయి మూలాలతో పాటు అదే సమాచారాన్ని నిర్ధారించగల ద్వితీయ స్థాయి మూలాలు దొరుకుతూంటే ద్వితీయ స్థాయి మూలాలనే ఎంచుకోవాలి, వికీపీడియా వ్యాసాలు మౌలికంగా ద్వితీయ స్థాయి మూలాల ఆధారంగా నిర్మించాలి.'''
=== తృతీయ స్థాయి మూలాలు ===
ప్రాథమిక, ద్వితీయ స్థాయి మూలాల నుంచి సమాచారాన్ని విషయపరంగా కానీ, సూచికగా కానీ క్రోడీకరిస్తూ రూపొందించేవి తృతీయ స్థాయి మూలాలు. [[విజ్ఞాన సర్వస్వము|విజ్ఞాన సర్వస్వాలు]], పాఠ్యపుస్తకాలు, పెద్ద బాలశిక్ష వంటివి తృతీయ స్థాయి మూలాలు. విజ్ఞాన సర్వస్వాలు, పరిచయ స్థాయిలోని పాఠ్యపుస్తకాలు వంటివి మూలాలుగా ఉపయోగపడతాయి. అయితే '''వికీపీడియా తృతీయ స్థాయి మూలం అయినా, వికీపీడియా వ్యాసాలను మూలాలుగా వినియోగించకూడదు'''.
ఒక అంశంలో ద్వితీయ స్థాయి మూలాలు, ప్రాథమిక మూలాలపై ఆధారపడుతూ విజ్ఞానం క్రోడీకరించడానికి, విజ్ఞాన బోధనకు మరేదైనా లక్ష్యాన్ని ఉద్దేశిస్తూ రూపొందించినది తృతీయ స్థాయి మూలం.
 
== స్వీకరించరాని మూలాలు ==