వికీపీడియా:నమ్మదగ్గ మూలాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
== జాగ్రత్త వహించాల్సిన సందర్భాలు ==
* '''సంపాదకీయాలు, అభిప్రాయాలు, ఓప్-ఎడ్‌లు''': నమ్మదగ్గ మూలాలైన పత్రికల్లోనే ప్రచురితమైనా అభిప్రాయాలు, ఓపీనియన్ పీస్‌లు, ఓప్-ఎడ్‌లు, ఎడిటోరిల్స్ వంటివాటిని మూలాలుగా తీసుకున్నప్పుడు వాటిలోని గణాంకాలు, వాస్తవాలు తీసుకోవాలి. అభిప్రాయాలను, విశ్లేషణను తీసుకోవాల్సివస్తే ఆ అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తున్న వ్యక్తి పేరు ప్రస్తావిస్తూ రాయాలి, ఒకవేళ బైలైన్ లేని సందర్భంలో ఫలానా పత్రిక సంపాదకీయం ప్రకారం అని రాయాలి. సంపాదకీయాలు, ఒపీనీయన్ పీస్‌లు, కాలమ్స్ వంటివి ఆయా వ్యక్తుల అభిప్రాయాలకు విశ్వసించదగ్గ మూలాలు, కానీ వాస్తవాలను రాయడానికి నమ్మదగ్గ మూలాలు కావు.
* '''శాస్త్ర సాంకేతిక అంశాలకు వార్తల కన్నా పరిశోధనలు సరైనవి''': శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన విషయాల్లో ఫలానా పరిశోధన ప్రకారం కాఫీ మంచిదనో, ఫలానా పరిశోధన ప్రకారం నడక సరైనది కాదనో పత్రికల్లో వార్తలు వస్తూంటాయి. ఈ వార్తలు సాధారణంగా ఆసక్తిని లక్ష్యంగా చేసుకుంటాయి తప్ప వాస్తవాలు, పరిశోధన వెల్లడించవు. కాబట్టి పరిశోధనల గురించి వార్తలకు బదులు పరిశోధన పత్రాలను (ద్వితీయ స్థాయి మూలాలు) ఆధారంగా తీసుకోవడం మేలు.