నారా చంద్రబాబునాయుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 96:
1992లో హెరిటేజ్ గ్రూపును చంద్రబాబునాయుడు స్థాపించాడు. ప్రస్తుతం ఈ సంస్థను నారా బ్రాహ్మణి నిర్వహిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హెరిటేజ్‌ ఫుడ్స్‌. తాజాగా ఉత్తర భారతదేశంలోనూ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించింది. హెరిటేజ్‌ ఫుడ్స్‌కు సంబంధించిన పాలు, పాల పదార్థాలను సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి ఢిల్లీలో ఆవిష్కరించింది. <ref>{{Cite web|url=http://telugutimes.net/home/article/72/1581/heritage-foods-enters-north-india|title=ఉత్తర భారతానికి హెరిటేజ్‌ ఫుడ్స్‌ విస్తరణ}}</ref>
== సూర్యోదయ రాష్ట్రం ==
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి [[తెలంగాణ]] రాష్ట్రం విభజన చెందిన తరువాత, ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా [[అమరావతి (రాష్ట్ర రాజధాని)|అమరావతి]]<nowiki/>ని ప్రకటించాడు. హైదరాబాదు వలె కాకుండా <ref>https://economictimes.indiatimes.com/news/politics-and-nation/how-andhra-pradesh-plans-to-make-its-new-capital-amaravati-a-world-class-city/articleshow/58767503.cms</ref> <ref>http://www.thehindu.com/opinion/op-ed/telangana-rising-amaravathi/article7271810.ece</ref> అమరావతి నగరాన్ని రాజధానిగాను, విశాఖపట్నం నగరాన్ని ఐ.టి.సెజ్ - ప్రత్యేక ఆర్థిక జోన్ తో ఐ.టి.హబ్ <ref>https://timesofindia.indiatimes.com/city/visakhapatnam/Vizag-set-to-become-IT-hub-of-new-state/articleshow/36405634.cms</ref> గా విస్తరించి అభివృద్ధిని వికేంద్రీకరించాడు. అభివృద్ధిలో భాగంగా అతను "ఏ.పి క్లౌడ్ ఇనిషియేటివ్" అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. డిజిటల్ సమ్మిట్ ను ఏర్పాటు చేసాడు.<ref>http://www.thehindubusinessline.com/news/national/ap-cloud-initiative-launched/article8948616.ece</ref> <ref>http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/Naidu-to-launch-Cloud-Initiative-on-Aug.-5/article14518284.ece</ref>
== అమరావతి శంకుస్థాపన ==
2015 అక్టోబరు 22న అత్యంత వైభవోపేతంగా, శాస్త్రోక్తంగా వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహా క్రతువు జరిగింది. మోదీతోపాటు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుర్తి చంద్రశేఖరరావు కూడా ఒక్కొక్క రత్నం చొప్పున శంకుస్థాపన ప్రదేశంలో ఉంచారు.<ref>{{Cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=164884|title=శాస్త్రోక్తంగా.. అమరావతి శంకుస్థాపన -|website=www.andhrajyothy.com|access-date=2018-06-01}}</ref> ఈ శంకుస్థాపన కార్యక్రమంలో భారత ప్రధానితో పాటు జపాన్, సింగపూర్ పరిశ్రమల మంత్రులిద్దరూ పాల్గొన్నారు.