యల్లా వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
యల్లా వెంకటేశ్వరరావు ప్రసిద్దిచెందిన మృదంగ విద్వాంశులు, మృదంగంపై జలపాతాల హోరును సృష్టించగల ప్రతిభాశాలి. వెంకటేశ్వరరావు భీమవరం పట్టణానికి ఆరుకిలోమీటర్ల దూరంలో కల పాలకోడేరు లో జన్మించాడు. వెంకటేశ్వరరావు కుటుంబం తాత ముత్తాతల నుండీ సంగీతంతో సహజీవనం సాగిస్తున్నది. ఇతడి తండ్రి రామ్మూర్తి ప్రసిద్ద వయొలిన్ విద్వాంసుడు. తాత వెంకటలింగం కూడా మృదంగ, సంగీత విద్వాంశుడు. వెంకటేశ్వరరావు చిన్నతనంలో కుటుంబం విజయవాడకు వలస వెళ్ళింది. అక్కడ భజన కార్యక్రమాలలో పాల్గొంటూ తన ప్రతిభకు మెరుగులు దిద్దుతూ పద్నాలుగేళ్ళ వయసులో ఆలిండియా రేడియో జాతెయ స్థాయిలో నిర్వహించిన పోటీలో పాల్గొన్నాడు. ఆ పోటీలలో అప్పటి రాష్ట్రపతి డా,సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా బంగారుపతకం అందుకొన్నాడు.