చాకొలెట్: కూర్పుల మధ్య తేడాలు

Fixed typo
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు iOS app edit
చి 2601:87:0:AE7D:A0F6:5892:C263:2FA7 (చర్చ) చేసిన మార్పులను Bhaskaranaidu యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 17:
'''చాకొలెట్ ''' చెట్ల నుండి వచ్చే, కాఫీని పోలిన, పదార్థం. దీనిని రకరకాల పానీయాలలోను, తినుభండారాలలోను, [[మిఠాయి]] లలోను కలుపుతారు. చాకొలెట్ కలిసిన వంటకాలు, పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. స్నేహితులైనా, ప్రేమికులైనా, ఆత్మీయులైనా, అధికారులైనా, శుభాకాంక్షలు చెప్పాలన్నా, అభినందనలు తెలపాలన్నా, స్వాగతిస్తున్నా, వీడిపోతున్నా, ఇచ్చిపుచ్చుకునే కానుక చాకొలెట్. ఒకప్పుడు ఎవరినైనా కలవాలన్నా, శుభాకాంక్షలు చెప్పాలన్నా, పూలూ పండ్లే తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు వీటి స్థానంలోకి చాకొలెట్ వచ్చేసింది. ముఖ్యంగా చిన్నపిల్లలకయితే చాకొలెట్ ని మించిన కానుక లేనే లేదు. అందుకే అందమైన పెట్టెలలో అలంకరించి మరీ అందిస్తున్నారు. పెళ్ళి, పుట్టినరోజు, కొత్త సంవత్సరం, వంటి వేడుకల్లోనూ ఫ్యాషన్ వేదికలమీదా అద్భుతమైన చాకొలెట్ కళాకృతులతో ఆహూతుల్ని అలరిస్తూ తీసి రుచుల్ని అందిస్తున్నారు.
==చరిత్ర==
[[దక్షిణ అమెరికా]]లో ఒకానొకప్పుడు నివసించిన మాయ, ఆజ్టెక్ జాతులు చాకొలెట్ తో చేసిన పానీయాలు విరివిగా తాగేవారు. పురావస్తు పరిశోధకుల మాటలని బట్టి చూస్తే చాకొలెట్‌ సుమారు 3,000 సంవత్సరాల కిందటే ఉపయోగంలో ఉండేదిట. చాకొలెట్‌ని మనకి పరిచయం చేసిన ఘనత హాంస్‌ స్లోన్‌ (Hans Sloan) అనే ఐర్లండు దేశపు వైద్యుడికి దక్కుతుంది. (ఈయన లండన్‌లో ఉన్న [[బ్రిటిష్ మ్యూజియం]] సంస్థాపకులలో ఒకడు.) ఈయన జమైకాలో బ్రిటిష్‌ గవర్నర్‌ దగ్గర పనిచేస్తూన్న రోజులలో చేదుగా ఉండే కోకో తాగలేక దాంట్లో కాసిన్ని పాలు కలిపేడు. (టీలో పాలు కలిపి తాగడం కూడా బ్రిటిష్‌ వాళ్ల అలవాటే!) చేదుగా ఉన్న కొకోలో పాలు కలిపేసరికి దాని రుచే మారిపోయింది. అప్పటివరకు వేడి నీళ్లల్లో కలుపుకు తాగే కోకో పాలల్లో కలిపేసరికి ఎంతో రుచిగా తయారయింది. అప్పటినుండి ఘనరూపంలో ఉన్న చాకొలెట్‌కి కూడా పాలు కలిపేసరికి తినడానికి వీలుగా తయారయింది. <ref>Davide Castelvecci, Chocalate: Mixing the bitter treat with milk was the popular breakthrough, Scientific American, p 96, September 2009</ref> hi!
 
==చాకొలెట్ - రకాలు - తయారీ ==
"https://te.wikipedia.org/wiki/చాకొలెట్" నుండి వెలికితీశారు