వికీపీడియా:శైలి/భాష: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ, టోన్ సవరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 27:
==కొత్త పదాలను సృష్టించవద్దు==
అనువాదాలు చేసేటపుడు మూల భాషలోని పదానికి తెలుగు అర్థం తెలియకపోతే నిఘంటువులను సంప్రదించండి. నిఘంటువుల్లో మీ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం చాలా ఉంది. అయితే ఇంగ్లీషులో కొత్తగా వెలుగు చూసే సాంకేతిక పదాలకు తెలుగు సమానార్థకాలు నిఘంటువుల్లో దొరక్క పోవచ్చు. ఆ సందర్భాల్లో తెలుగు వార్తా పత్రికలు మంచి వనరు కాగలవు. ఎక్కడా సరైన తెలుగు సమానార్థకం దొరక్కపోతే, ఇంగ్లీషు పదాన్ని అలాగే, తెలుగు లిపిలో వాడండి. కానీ మీరే స్వయంగా కొత్త తెలుగు పదాన్ని సృష్టించ ''వద్దు''. వికీపీడియా కొత్త పదాలను సృష్టించే ప్రదేశం కాదు.
 
వికీపీడియా ఏ వాదాలకు వేదిక కాకూడదు. అది భాషా వాదాలకు కూడా వర్తిస్తుంది. పూర్వపు భాషా వాదాలు కావచ్చు (గ్రాంథిక, సరళ గ్రాంథిక ఉద్యమాలు), ప్రత్యామ్నాయంగా ప్రతిపాదిస్తున్న భాషా వాదాలు కానీ (మహాప్రాణాలు తొలగించాలనీ, ఆంగ్ల, సంస్కృత మూలాలు ఉన్న పదాలను వదిలి ద్రావిడ మూలాలున్న పదాలనే వాడాలనీ) - ఇలా ఇంకా ప్రామాణిక భాషా వ్యవహారంలోకి రాని ఏ వాదాన్నైనా వికీపీడియా ద్వారా తలకెత్తుకోలేం.