W/O రామ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
== కథ ==
దీక్ష ([[మంచు లక్ష్మి]]), ఆమె భ‌ర్త రామ్ (సామ్రాట్‌) రోడ్డు మీద ప‌డి ఉంటారు. దీక్ష‌కు స్పృహ వ‌చ్చేసరికి ఆసుప‌త్రిలో ఉంటారు. అప్ప‌టికే ఆమె భ‌ర్త‌, క‌డుపులో బిడ్డ చ‌నిపోయారని తెలుస్తుంది. అయితే త‌న భ‌ర్త‌ది ప్రమాదం కాద‌ని ఎవ‌రో కావాల‌నే చంపార‌ని పోలీసుల‌తో చెబుతుంది దీక్ష‌. వాళ్లు మిగిలిన చాలా కేసుల్లాగే ఈ కేసును కూడా ప‌ట్టించుకోరు. ఎలాంటి ఆధారాలు లేవ‌ని కేసు మూసి వేస్తారు. వాళ్ల వ్య‌వ‌హారాన్ని గ‌మ‌నించిన దీక్ష స్వ‌యంగా రంగంలోకి దిగుతుంది. త‌న భ‌ర్త హ‌త్య జ‌రిగిన ప్ర‌దేశాల్లో సొంతంగా పరిశోధన చేసి కొన్ని ఆధారాలు కనుక్కుంటుంది. ఇందులో ఆమెకు ర‌మ‌ణా చారి (ప్రియద‌ర్శి) సాయం చేస్తాడు. ఇంత‌కీ ముసుగు వేసుకున్న హంతకుడిని దీక్ష ప‌ట్టుకోగ‌లిగిందా? లేదా? ఆమె భ‌ర్త‌ను ఎవ‌రు చంపారు? మ‌ధ్య‌లో రాఖీ (ఆద‌ర్శ్ ) ఎవ‌రు? అత‌నికి, స్నేహ‌కి ఏంటి సంబంధం? దీక్ష‌కి, స్నేహకి ఉన్న అనుబంధం ఏంటి? వ‌ంటివ‌న్నీ కథలో భాగం.<ref name="W/O Ram Review">https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-reviews/w/o-ram/movie-review/65061420.cms</ref>
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/W/O_రామ్" నుండి వెలికితీశారు