చెన్నై: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 67:
 
=== ఉన్నత విద్య ===
1857 సంవత్సరములో ఏర్పాటు చేయబడిన [[మద్రాసు విశ్వవిద్యాలయం|మద్రాసు విశ్వవిద్యాలయానికి]] మూడు క్యాంపసులు ఉన్నాయి. ఈ విశ్వవిద్యాలయములో అనేక విభాగాలలో (విజ్ఞాన శాస్త్రము, వాణిజ్య శాస్త్రము, వివిధ కళలు, [[వైద్య శాస్త్రము]], [[న్యాయ శాస్త్రము]] మొదలైనవి) ఉన్నత విద్యలు అభ్యసించే అవకాశము ఉంది. నగరములో ఉన్న అనేక కళాశాలలు ఈ విశ్వవిద్యాలయముతో అనుసంధానము చేయబడి ఉన్నాయి. మద్రాసు విశ్వవిద్యాలయము కంటే పురాతనమైన విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. 1835లో స్థాపించబడిన [[మద్రాస్ వైద్య కళాశాల|మద్రాసు మెడికల్ కాలేజి]], 1837లో స్థాపించబడిన [[మద్రాసు క్రిస్టియన్ కళాశల]], 1840లో స్థాపించబడిన [[ప్రెసిడెన్సీ కళాశాల]], 1842 స్థాపించబడిన పచ్చయప్ప కళాశాల మెదలైనవి కొన్ని ఉదాహరణలు. 1938లో స్థాపించబడిన [[స్టాన్లీ మెడికల్ కాలేజి]], 1946లో ప్రారంభించబడిన [[వివేకానంద కాలేజి]] 1951లో మెదలు పెట్టిన న్యూ కాలేజి, చెన్నై, [[శకుంతల అమ్మాళ్ కళాశాల]] మరికొన్ని ప్రముఖ విద్యాసంస్థలకు ఉదాహరణలు. ఈ విద్యాసంస్థలు మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుసంధానించబడి పనిచేస్తాయి. ఇవి కాకుండా స్వతంత్ర ప్రతిపత్తిని కలిగిన విద్యాసంస్థలలో ముఖ్యమైనవి[[క్వీన్ మేరి కాలేజి]] (1914), [[ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజి]] (1915), [[లయోలా కాలేజి (చెన్నై)]] (1925), [[స్టెల్లా మేరీస్ కాలేజి]], (1947) [[నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజి]] (1995), [[ఏషియన్ కాలేజి ఆఫ్ జర్నలిజం]] (2000) మరియు [[మద్రాసు స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్]] (1952).
భారతదేశములో సాంకేతిక విద్యకు ప్రసిద్ధి చెందిన [[ఐ.ఐ.టి.]] మద్రాసు నగరానికి దక్షిణ భాగంలో అంతర్జాతీయా ఖ్యాతి గాంచిన ఈ ఐ.ఐ.టి. 1959లో స్థాపించబడింది. ఈ ఐ.ఐ.టి. ప్రక్కగా [[అన్నా విశ్వవిద్యాలయం]] (1978) ప్రధాన ప్రాసాదం ఉంది. [[గుండి కాలేజి ఆఫ్ ఇంజినీరింగ్]] (1794), మద్రాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి (1949) [[అలగప్ప కాలేజి అఫ్ టెక్నాలజి]] (1944) స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ (1957) విలీనం చేయగా ఏర్పడింది అన్న విశ్వవిద్యాలయం. [[తమిళనాడు]]లోని ఇంజనీరింగ్ కళాశాలలన్నీ అన్నా విశ్వవిద్యాలయానికి అనుసంధించబడి ఉంటాయి. మిగిలిన ఇంజనీరింగ్ కళాశాలల పట్టాలు స్వతంత్ర ప్రతిపత్తి కలవై ఉంటాయి.
1891 సంవత్సరములో స్థాపించబడిన [[డా. అంబేద్కర్ ప్రభుత్వ న్యాయ కళాశాల]] చెన్నైలోని ప్రాచీన న్యాయశాస్త్ర కళాశాల. 1835వ సంవత్సరంలో స్థాపించిన మద్రాసు కళాశాల భారత ఉపఖండంలోనే పురాతన కాళాశాల<ref>{{cite web | title=The Hindu: Madras Miscellany | url=http://www.hinduonnet.com/2000/10/30/stories/1330128m.htm | accessmonthday=November 19 |accessyear=2005 }}</ref>. నగరములో ఉన్న మరికొన్ని వైద్యకళాశాలల్లో స్టాన్లీ వైద్య కళాశాల, కిల్‌పాక్ వైద్యకళాశాల, శ్రీ రామచంద్రా వైద్యకళాశాల ప్రముఖ మెడికల్ కాలేజిలు. 1903లో స్థాపించిన [[మద్రాసు వెటరినరీ కాలేజి]] దేశంలోనే మొదటి పశువైద్యకళాశాల.
"https://te.wikipedia.org/wiki/చెన్నై" నుండి వెలికితీశారు