"రాం చరణ్ తేజ" కూర్పుల మధ్య తేడాలు

చి (2409:4070:810:D268:2E96:2F90:232F:343 (చర్చ) చేసిన మార్పులను V.raj.5 యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.)
ట్యాగు: రోల్‌బ్యాక్
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చరణ్ [[పూరి జగన్నాధ్]] దర్శకత్వంలో 2007లో విడుదలైన [[చిరుత (సినిమా)]] చిత్రంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యాడు. ఈ చిత్రం విజయవంతం అవ్వడంతో పాటు తనకు ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. ఆ తర్వాత [[ఎస్.ఎస్.రాజమౌళి]] గారు దర్శకత్వం వహించిన [[మగధీర]] చిత్రం సంచలన విజయం సాధించడంతో పాటు ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. మగధీర విజయంతో చరణ్ తెలుగు సినిమాలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించాడు.
 
ఆపై 2010లో "బొమ్మరిల్లు" భాస్కర్ దర్శకత్వంలో [[ఆరెంజ్]] చిత్రంలో నటించాడు. ఈ చిత్రం పరాజయం పాలైనప్పటికీ తన పూర్వ చిత్రాల్లాగే ఈ చిత్రంలో కూడా చరణ్ నటనకు విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది. ఒక సంవత్సరం తర్వాత 2011లో సంపత్ నంది దర్శకత్వంలో [[రచ్చ]] చిత్రంలో నటించాడు. భారీ ఓపెనింగ్లను సాధించిన ఈ చిత్రం విజయాన్ని సాధించింది. 2013లో [[వి. వి. వినాయక్]] దర్శకత్వంలో [[నాయక్ (సినిమా)]] చిత్రంలో నటించాడు. పైడిపల్లి వంశీ దర్శకత్వంలో [[అల్లు అర్జున్]] తో కలిసి [[ఎవడు (సినిమా)]] చిత్రంలో నటించాడు. తరువాత అపూర్వ లాఖియా దర్శకత్వంలో [[తుఫాన్ (సినిమా)]] చిత్రంలో నటించాడు. ఇది పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. ఇది అమితాబ్ బచ్చన్ జంజీర్ కు రీమేక్. 2014లో కృష్ణవంశీ దర్శకత్వంలో [[గోవిందుడు అందరివాడేలే]] నటించాడు.2015 లో శ్రీనువైట్ల దర్శకత్వంలో [[బ్రూస్ లీ]] లో నటించాడు అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.2016 లో వచ్చిన [[ధృవ]] చిత్రం తో మళ్ళీ విజయాన్ని అందుకున్నాడు.2018 లో వచ్చిన [[రంగస్థలం]] చిత్రం లో చెవిటి వాడిగా నటించి తన నట విశ్వరూపం ప్రదర్శించాడు ఆ చిత్రం విజయం తో పాటు ఎన్నో రికార్డులు తిరగరాసింది.
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2421060" నుండి వెలికితీశారు