నిర్మలానంద: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
==సాహిత్య కృషి==
ఇతడు 18 ఏళ్లు ప్రజాసాహితి పత్రికకు వర్కింగ్‌ ఎడిటర్‌గా కొనసాగాడు. హిందీ సాహిత్య పరిచయంతో నిర్మలానంద వాత్సాయన్‌గా కలంపేరు పెట్టుకున్నాడు. "తెలుగుదాసు", "విపుల్‌" అనే కలంపేర్లతో కూడా రచనలు చేసినా నిర్మలానంద పేరుతోనే లబ్ధప్రతిష్ఠుడయ్యాడు. ఎక్కడ సాహితీ సభలు జరిగినా హాజరయ్యేవాడు. [[పోతుకూచి సాంబశివరావు]] నిర్వహించిన తెలుగు రచయితల మహాసభలకు తప్పనిసరిగా హాజరయ్యేవాడు<ref name="జ్యోతి"/>. 1979లో విజయనగరంలో జనసాహితి రెండవ మహాసభలకు ఆహ్వానసంఘ సభ్యునిగా కృషి చేశాడు. ఆ సభల్లోనే ఇతడు జనసాహితి సభ్యునిగా చేరాడు. 1981లో గుడివాడలో జరిగిన జనసాహితి 3వ మహాసభలో ఇతడు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా చేరాడు. 1981 సెప్టెంబర్‌లో చైనా ప్రజారచయిత లూషన్‌ శతజయంతి సందర్భంగా ప్రజాసాహితి ప్రత్యేక సంచికను రూపుదిద్దటంలో ఇతడి కృషి వుంది<ref name="దివికుమార్">[https://www.sakshi.com/news/guest-columns/article-writer-jana-sahithi-nirmalananda-sakshi-1100498 నిర్మల సాహితీమూర్తి నిర్మలానంద - దివికుమార్]</ref>. నిర్మలానందకు ప్రముఖ బెంగాలీ రచయిత [[మహా శ్వేతాదేవి]]తో మంచి సాన్నిహిత్యం ఉండేది. ఆమెపై 1997 మార్చిలో ప్రత్యేక సంచికను తెచ్చాడు. అల్లూరి సీతారామరాజు శతజయంతి సందర్భంగా ఆయనపై ‘మన్యం వీరుని పోరుదారి’ అనే వ్యాససంకలనాన్ని ప్రచురించాడు. దీన్ని మహా శ్వేతాదేవి చేతులమీదుగా ఆవిష్కరింపచేశాడు<ref name="జ్యోతి"/>.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/నిర్మలానంద" నుండి వెలికితీశారు