సాక్ష్యం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2018 తెలుగు సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 4:
 
== కథ ==
స్వ‌స్తిక్ పురం గ్రామ నివాసి రాజుగారు(శ‌ర‌త్‌కుమార్‌) పేద ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండే వ్య‌క్తి. అదే ప్రాంతంలో ఉండే మున‌స్వామి అత‌ని త‌మ్ముళ్లు అక్ర‌మాల‌కు పాల్ప‌డుతుంటారు. వారికి ఎదురు తిరిగిన రాజుగారిని, అత‌ని కుటుంబాన్ని దారుణంగా చంపేస్తారు. రాజుగారికి పుట్టిన కొడుకుని ఎద్దు కాపాడ‌టంతో ఆ పిల్లవాడు త‌ప్పించుకుంటాడు. కాశీ చేరిన ఆ శిశువుని శివ ప్ర‌కాశ్‌(జ‌య‌ప్ర‌కాశ్‌) చెంత‌కు చేరుతాడు. పిల్ల‌లు లేని శివ ప్ర‌కాశ్ ఆ పిల్లాడికి విశ్వ‌జ్ఞ( బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌) అనే పేరు పెట్టి పెంచి పెద్ద చేస్తాడు.
 
పెరిగి పెద్ద‌యిన విశ్వ వీడియో ఆటలను రూపొందిస్తుంటాడు.సౌంద‌ర్య‌ల‌హ‌రి(పూజా హెగ్డే)ని చూసి ప్రేమిస్తాడు విశ్వ‌. ఆమెకు ఓ సంద‌ర్భంలో స‌హాయం చేస్తాడు. కానీ అది అర్థం చేసుకోని సౌంద‌ర్య.. విశ్వ‌పై కోపంతో భారతదేశానికి వ‌చ్చేస్తుంది. విశ్వ కూడా సౌంద‌ర్య కోసం భారతదేశానికి వ‌చ్చేస్తాడు. అదే స‌మ‌యంలో హైద‌రాబాద్‌లోని సౌంద‌ర్య తండ్రి మున‌స్వామి ఆక్ర‌మాల‌కు అడ్డుప‌డుతుంటాడు. మున‌స్వామికి వ్య‌తిరేకంగా కొన్ని సాక్ష్యాల‌ను సేక‌రిస్తుంటాడు. మున‌స్వామి త‌మ్ముడు వీరాస్వామి(ర‌వికిష‌న్‌) సౌంద‌ర్య‌ను చంపేయాల‌నుకుంటాడు. కానీ ప్ర‌కృతి కార‌ణంగా చ‌నిపోతాడు. దానికి ప‌రోక్షంగా విశ్వ కార‌ణ‌మ‌వుతాడు. అలాగే మున‌స్వామి ఇద్ద‌రు త‌మ్ముళ్లు కూడా విశ్వ చేతిలోనే చ‌స్తారు. అస‌లు మున‌స్వామి సోదరుపలై ప్ర‌కృతి ఎందుకు కోపం తెచ్చుకుంటుంది? చివ‌ర‌కు మున‌స్వామి ప‌రిస్థితేంటి? అనేది మిగిలిన కథ
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/సాక్ష్యం" నుండి వెలికితీశారు