చంద్ర గ్రహణం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 19:
== కొన్ని విశేషాలు ==
చంద్రగ్రహణమేర్పడే పరిస్థితిలో భూమిపైనున్నవారికి చంద్రగ్రహణం కనబడితే, అదే సమయంలో చంద్రుడిపైనుండి వీక్షిస్తే? [[సూర్యగ్రహణం]] కనబడుతుంది.సూర్యగ్రహణానికి చంద్ర గ్రహణానికి ఉన్న తేడా ఏమిటంటే, చంద్ర గ్రహణం నాడు చంద్రుడు కనపడనట్లే సూర్య గ్రహణం నాడు, [[సూర్యుడు]] కనపడడు. ఇది చంద్రుడు, సూర్యుడు మరియు భూమి మధ్యలోనుంచి ప్రయాణిస్తున్నపుడు ఏర్పడుతుంది.సూర్యగ్రహణం వలే కాకుండా చంద్ర గ్రహణాన్ని వీక్షించడం వలన కళ్ళకు ఎటువంటి హానీ జరగదు.రక్షణ కోసం ఎటువంటి [[కళ్ళజోడు]] అవసరం లేదు. [[టెలిస్కోప్]] కూడా అవసరం లేదు. కేవలం రెండు కళ్ళతో కూడా వీక్షించవచ్చు. కాకపోతే దూరదృశ్యాలను చూడడానికి ఉపయోగించే [[బైనాక్యులర్స్]]ను వాడితే చంద్ర గ్రహణాన్ని మరింత స్పష్టంగా వీక్షించవచ్చు. చంద్ర గ్రహణం సమయంలో గర్భవతులు బయట తిరిగితే కడుపులో శిశువుకు హాని జరుగుతుందని, ఏమీ తినకూడదని, గోళ్ళు గిల్లుకోకూడదని, ఏమీ తినకూడదని పూర్వం నుండి భారతదేశంలో నమ్మకం ఉంది.
== సూపర్ మూన్ ==
భూమి చంద్రుల మద్య సరాసరి దూరం 384440 కి మీ. చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్య లో తిరుగుతుండటం వలన కొన్ని సందర్భాలలో దగ్గరగా రావడం జరుగుతుంది , ఆ పరిస్థితి ని "పెరిగి" అంటారు. ఆ సమయంలో దూరం 356509 కిమీ ఉంటుంది. భూమి చంద్రుల మద్య దూరం పెరిగినప్పుడు దూరం 406662 కిమీ ఉంటుంది. ఆ స్తితి ని "అపోగి" అంటారు. అలా చంద్రుడు, భూమికి దగ్గరగా వచ్చినప్పుడు, ఏర్పడే పౌర్ణమి నాటి చంద్రున్ని "సూపర్ మూన్" అంటారు..
 
'సూపర్ మూన్' సందర్భంగా చంద్రుడు, మామూలు కంటే 14 రెట్లు పెద్దగా, 30 రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా, కొత్త, కొత్త రంగుల్లో కనిపిస్తాడు..
== బ్లూ మూన్ ==
 
అలాగే ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి వస్తే., అలా నెల చివర్లో వచ్చే రెండవ పౌర్ణమి నాటి చంద్రున్ని "బ్లూ మూన్" అంటారు. ఇది రెండున్నర సంవత్సరాలకోసారి వస్తుంది..
== బ్లడ్ మూన్ ==
 
ఇక 'సూపర్ మూన్' సందర్భంగా చంద్ర గ్రహణం ఏర్పడితే., అపుడు (ఎర్రగా) కనపడే పౌర్ణమి నాటి చంద్రున్ని "బ్లడ్ మూన్" అని పిలుస్తారు..
 
"https://te.wikipedia.org/wiki/చంద్ర_గ్రహణం" నుండి వెలికితీశారు