గోల్కొండ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 28:
==చరిత్ర==
[[బొమ్మ:Golkonda.jpg|thumb|right|300px|గోల్కొండ కోట దృశ్యము.]]
"గొల్ల కొండ" నుండి గోల్కొండ కోటగా రూపాంతరం చెందిన ఈ ప్రాకారం వెనుక ఒక ఆసక్తికరమయిన కథనం ఉంది. అదేమిటంటే [[1143]]లో మంగళవరం అనే రాళ్ళ గుట్ట పైన ఒక గొడ్లకాపరికి ఒక దేవతా విగ్రహము కనిపించింది. ఈ వార్త అప్పటి ఆ ప్రాంతమును పాలించే [[కాకతీయులు
[[1507]] నుండి మొదలుకొని ఒక 62 సంవత్సరముల కాలములో గోల్కొండ కోటను [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్ షాహీ వంశస్తులు]] నల్లరాతి కోటగా తయారు చేశారు. కోట బురుజులతో సహా ఇది 5 కి.మీ. చుట్టుకొలత కలిగి ఉంది. గోల్కొండలో కుతుబ్ షాహీ వంశస్తుల పాలన [[1687]]లో [[ఔరంగజేబు]] [[విజయము]]<nowiki/>తో అంతమయినది. ఆసమయములో [[ఔరంగజేబు]] కోటను నాశనంచేశాడు. గోల్కొండ కోట [[వజ్రాలు|వజ్రాల]] వ్యాపారానికి ఎంతో ఖ్యాతి సంపాదించింది. ప్రపంచప్రసిద్దమైన [[కోహినూరు వజ్రము]], పిట్ వజ్రము, హోప్ వజ్రము, ఓర్లాఫ్ వజ్రము ఈ రాజ్యములోని [[పరిటాల]]-[[కొల్లూరు]] గనుల నుండి వచ్చాయి. గోల్కొండ గనుల నుండి వచ్చిన [[ధనము]], [[వజ్రాలు]] [[నిజాం|నిజాము]] చక్రవర్తులను సుసంపన్నం చేశాయి. నిజాములు మొగలు చక్రవర్తులనుండి స్వాతంత్ర్యము పొందిన తరువాత [[హైదరాబాదు]]<nowiki/>ను [[1724]] నుండి [[1948]]లో భారత్లో విలీనమయ్యేంతవరకు పరిపాలించారు. నిజాం నవాబుల పరిపాలన కాలంలో 1830 సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రాచరిత్రకారుడు [[ఏనుగుల వీరాస్వామయ్య]] అప్పటి గోల్కొండ స్థితిగతుల గురించి వ్రాసుకున్నారు. వాటి ప్రకారం 1830 నాటికి గోల్కొండలో నిజాం అంత:పుర స్త్రీలు, నైజాం మూలధనం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండేవారు. కోటలో విస్తరించి ప్రజలు ఇళ్ళు కట్టుకుని జీవించేవారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref> ఐతే రాజధాని తరలిపోయివుండడంతో అక్కడ రాజ్యతంత్రానికి సంబంధించిన, వర్తకవాణిజ్యాలకు సంబంధించిన వ్యవహారాలు జరిగేవి కాదు.
|