నిర్మలానంద: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 55:
 
==సాహిత్య కృషి==
ఆయన 18 ఏళ్లు ప్రజాసాహితి పత్రికకు వర్కింగ్‌ ఎడిటర్‌గా కొనసాగాడు. హిందీ సాహిత్య పరిచయంతో నిర్మలానంద వాత్సాయన్‌గా కలంపేరు పెట్టుకున్నారు.తన 84 ఏళ్ల జీవితంలో 66 ఏళ్లపాటు సాహిత్య సేవలోనే నిమగ్నమయ్యారు.1952లో భారతి పత్రిక ఆయన స్వీయ రచన మార్పు కథ ప్రచురితమైంది. తర్వాత చిన్న కథలు, కవితలు ప్రచురించబడినా 54 నుంచి ఆయన అప్త మిత్రుడు జీవరక్షణ రావు(జీవన్) సూచన మేరకు స్వీయ రచనలకు స్వస్తి పలికారు. పూర్తిస్థాయిలో అనువాద రంగానికే పరిమితమయ్యారు. "తెలుగుదాసు", "విపుల్‌" విపుల్ చక్రవర్తి, రాజ్ కలంపేర్లతో కూడా రచనలు చేసినా నిర్మలానంద పేరుతోనే లబ్ధప్రతిష్ఠుడయ్యారు. 1957లో ఉద్యోగ రీత్యా ఒడిషాలోని ఝార్సుగూడలో దాదాపు 18 ఏళ్లు ప్రవాస జీవితం గడపారు. తెలుగు సాహిత్యాన్ని తెలుగేతర ప్రాంతాలకు చేరవేయాలని సంకల్పంతో 1958లో తెలుగు సాహిత్య ప్రచార సమితి అనే సంస్థ స్థాపించారు. చలం మొదలుకుని ఇనాటి ఖదీర్ బాబు వరకు వందలాది అలనాటి, ఈనాటి యువరచయితలు రాసిన కథలు, కవితలు, నాటికలను హిందీలోకి అనువాదం చేశారు.. దేశంలో ఎక్కడ సాహితీ సభలు, బుక్ ఎగ్జిబిషన్ జరిగినా హాజరయ్యేవారు. [[పోతుకూచి సాంబశివరావు]] నిర్వహించిన తెలుగు రచయితల మహాసభలకు తప్పనిసరిగా హాజరయ్యేవారు <ref name="జ్యోతి"/>. 1970లో విశాఖలో జరిగిన శ్రీశ్రీ షష్టిపూర్తి ఆహ్వన కమిటీలో సభ్యుడు. 1979లో విజయనగరంలో జనసాహితి రెండో మహాసభలకు ఆహ్వానసంఘ సభ్యునిగా కృషి చేశారు. ఆ సభల్లోనే ఆయన జనసాహితి సభ్యునిగా చేరారు. 1981లో గుడివాడలో జరిగిన జనసాహితి 3వ మహాసభలో రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా చేరారు. 1981 సెప్టెంబర్‌లో చైనా ప్రజారచయిత లూషన్‌ శతజయంతి సందర్భంగా ప్రజాసాహితి ప్రత్యేక సంచికను రూపుదిద్దటంలో ఆయన కృషి వుంది<ref name="దివికుమార్">[https://www.sakshi.com/news/guest-columns/article-writer-jana-sahithi-nirmalananda-sakshi-1100498 నిర్మల సాహితీమూర్తి నిర్మలానంద - దివికుమార్]</ref>. నిర్మలానందకు ప్రముఖ బెంగాలీ రచయిత [[మహా శ్వేతాదేవి]]తో మంచి సాన్నిహిత్యం ఉండేది. ఆమెపై 1997 మార్చిలో ప్రత్యేక సంచికను తెచ్చారు. అల్లూరి సీతారామరాజు శతజయంతి సందర్భంగా ఆయనపై ‘మన్యం వీరుని పోరుదారి’ అనే వ్యాససంకలనాన్ని ప్రచురించారు. దీన్ని మహా శ్వేతాదేవి చేతులమీదుగా ఆవిష్కరింపచేశారు <ref name="జ్యోతి"/>.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/నిర్మలానంద" నుండి వెలికితీశారు