"వీరశైవ మతం" కూర్పుల మధ్య తేడాలు

5,598 bytes added ,  3 సంవత్సరాల క్రితం
లింగనామాత్యుడు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, added deadend tag, typos fixed: నందు → లో , లొ → లో (2), లో → లో (2), గ్రంధ → గ్రం using AWB)
(లింగనామాత్యుడు)
ట్యాగు: 2017 source edit
కులభేదాలను నిర్మూలించ పూనుకున్న వీరశైవ మతం ఆంధ్ర దేశంలో అదుగుపెట్టే సమయానికి ఏ దేశమ్లో మరొక రూపంలో శైవమతం అప్పుడే ప్రారంభం ఐంది. శ్రీపతి, శివలెంక మంచన, మల్లికార్జున పందడితారాధ్యుడు అను ముగ్గురు పండితులు బయలుదేరి, ఆంధ్రలో వీరశైవమత పునరుద్ధరణకు పూనుకున్నారు. వీరిలో మల్లికార్జున పందితారాధ్యుడు అతి ప్రసిద్ధుడు. ఈ ముగ్గురిని పండిత త్రయం అని వివరిస్తారు.
 
== మల్లికార్జున పందడితారాధ్యుడుపండితారాధ్యుడు ==
 
 
== లింగనామాత్యుడు ==
 
పర్వతరాజు లింగనామత్యుడు శ్రీవత్స గోత్రజుడు. పండితారాధ్య శ్రీపాదాబ్జభృంగ అని చెప్పుటచే పండితారాధ్యుడు ఈతని గురువు అని తెల్యుచున్నది. పండితారాధ్యుని కాలము క్రీ.శ.1170-72 అని పెక్కుమంది అభిప్రాయము. లింగనామాత్యుడు వ్రాసిన వీరశైవ గ్రంధము '''వీరమహేశ్వరాచార సంగ్రహం'''.ఇది ద్విపదలో వ్రాయబడినది.ఇందులో తాళ పత్రములు 4 ఆశ్వాసముల వరకే లభించినవి. మొత్తంగా 8 ఆశ్వాసములు ఉండవచ్చునని పండితుల అభిప్రాయము. వీర శైవము నందలి సంప్రదాయములలో మొదటిది జంగమ సంప్రదాయము. రెండవది ఆరాధ్య సంప్రదాయము. ఆరాధ్య సంప్రదాయమునకు మూల పురుషుడు పండితారాధ్యుడు. శివాగమములయందు స్థూల దృష్టితో సామాన్య, మిశ్ర, శుద్ధ, వీరశైవ అను నాలుగు విభాగములను, మరికొన్నింటిలో శైవ, పూర్వశైవ, మిశ్రశైవ, శుద్దశైవ, శ్రౌతశైవ, మార్గశైవ, నిరాభార వీరశైవ అనెడి 10 బేధములు కలవు. భస్మ, రుద్రాక్ష ధారణాది చిహ్నములు శివభక్తులకు విహితమైనవి. గురుదత్తమైన భస్మమును ధరించుట, శివలింగ మెచత కనబదినను ప్రదక్షిణ ప్రణామము ఆచరించుట శైవ లక్షణము. ఆణవ, కార్మిక, మాయామలము లను, దీక్షలచే మొనర్చి భౌతిక శరీరమును లింగ శరీరముగ చేసి ప్రాసాదించిన లింగమును కంఠమున గాని, భుజమునగాని, వక్షమునగాని ధరించుట, అర్చించుట పంచాక్షరీ మంత్రమునే మననము చేయుట, వర్ణాశ్రమ ధర్మముము ఆవ్యవస్థను లేదనుట వీరశైవ భక్తులు పాటించుదురు. లింగనామాత్యుడు కూడ తన కృతియందు లింగమహాత్మ్యమును పంచాక్షరీ మంత్ర మహాత్మ్యమును వివరించుచు తామస ప్రవృత్తిని ప్రదర్సించి ఉండుటచే వీరశైవుడని అందురు. పండితారాధ్యుడు శిష్యుడు కావుట వలన ఇది ఇంకను రూఢి అయినది.
 
లోకములు, వార్ధులు, శైలములు, వృక్షములు, దేవతలు, దానవులు, యోగీంద్రులు, గరుధ, ఖేచర, యక్ష, గంధర్వ సిద్ధవరులు, విద్యాధరులు, కిన్నరలు పశుపక్షి మృగ దైత్య పన్నగులు రుద్ర స్వరూపమునే రూపింతురు. దేహమే చంద్రధరుని మందిరము. ప్రాణమే-శివుడు- అని చెప్పి లింగన తన వీరశైవత్వమును చాటెను.
 
పంచాక్షరితో సమానమైన మంత్రము లేదు. శివునిబోలు దైవము, గౌరిని బోలు వైదువలు, గంగతో సమానమైన నదులు, సాగరను బోలు సరసులు, మేరునగమునుబోలు పర్వతములు, వారణాసికి సరివచ్చు తీర్ధములు, శంకరుని భక్తికి సమానమైన భక్తి ఇంక లేవట. సకలవేదశాస్త్రాగమ పురాణముల సారంశమే పంచాక్షరీ మంత్రము. పంచమహాఘోర మహాపాపములాచరించినను జగత్రయమునే సంహరించినను పంచాక్షరీ మంత్ర దివ్య ప్రభావముచే విముక్తి కలుగునని వీరశైవుల నమ్మకము. దానినె లింగన వక్కాణించినాడు.
 
 
 
[[వర్గం:హిందూ మతం చరిత్ర]]
[[వర్గం:హిందూ మతము]]
 
==మూలములు==
*1969 భారతి మాస పత్రిక- వ్యాసము :వీరమాహేశ్వరాచారము.
761

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2426206" నుండి వెలికితీశారు