"వీరశైవ మతం" కూర్పుల మధ్య తేడాలు

(లింగనామాత్యుడు)
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
== లింగనామాత్యుడు ==
 
పర్వతరాజు లింగనామత్యుడు శ్రీవత్స గోత్రజుడు. పండితారాధ్య శ్రీపాదాబ్జభృంగ అని చెప్పుటచే పండితారాధ్యుడు ఈతని గురువు అని తెల్యుచున్నది. పండితారాధ్యుని కాలము క్రీ.శ.1170-72 అని పెక్కుమంది అభిప్రాయము. లింగనామాత్యుడు వ్రాసిన వీరశైవ గ్రంధము '''వీరమహేశ్వరాచారవీరమాహేశ్వరాచార సంగ్రహం'''.ఇది ద్విపదలో వ్రాయబడినది.ఇందులో తాళ పత్రములు 4 ఆశ్వాసముల వరకే లభించినవి. మొత్తంగా 8 ఆశ్వాసములు ఉండవచ్చునని పండితుల అభిప్రాయము. వీర శైవము నందలి సంప్రదాయములలో మొదటిది జంగమ సంప్రదాయము. రెండవది ఆరాధ్య సంప్రదాయము. ఆరాధ్య సంప్రదాయమునకు మూల పురుషుడు పండితారాధ్యుడు. శివాగమములయందు స్థూల దృష్టితో సామాన్య, మిశ్ర, శుద్ధ, వీరశైవ అను నాలుగు విభాగములను, మరికొన్నింటిలో శైవ, పూర్వశైవ, మిశ్రశైవ, శుద్దశైవ, శ్రౌతశైవ, మార్గశైవ, నిరాభార వీరశైవ అనెడి 10 బేధములు కలవు. భస్మ, రుద్రాక్ష ధారణాది చిహ్నములు శివభక్తులకు విహితమైనవి. గురుదత్తమైన భస్మమును ధరించుట, శివలింగ మెచత కనబదినను ప్రదక్షిణ ప్రణామము ఆచరించుట శైవ లక్షణము. ఆణవ, కార్మిక, మాయామలము లను, దీక్షలచే మొనర్చి భౌతిక శరీరమును లింగ శరీరముగ చేసి ప్రాసాదించిన లింగమును కంఠమున గాని, భుజమునగాని, వక్షమునగాని ధరించుట, అర్చించుట పంచాక్షరీ మంత్రమునే మననము చేయుట, వర్ణాశ్రమ ధర్మముము ఆవ్యవస్థను లేదనుట వీరశైవ భక్తులు పాటించుదురు. లింగనామాత్యుడు కూడ తన కృతియందు లింగమహాత్మ్యమును పంచాక్షరీ మంత్ర మహాత్మ్యమును వివరించుచు తామస ప్రవృత్తిని ప్రదర్సించి ఉండుటచే వీరశైవుడని అందురు. పండితారాధ్యుడు శిష్యుడు కావుట వలన ఇది ఇంకను రూఢి అయినది.
 
లోకములు, వార్ధులు, శైలములు, వృక్షములు, దేవతలు, దానవులు, యోగీంద్రులు, గరుధ, ఖేచర, యక్ష, గంధర్వ సిద్ధవరులు, విద్యాధరులు, కిన్నరలు పశుపక్షి మృగ దైత్య పన్నగులు రుద్ర స్వరూపమునే రూపింతురు. దేహమే చంద్రధరుని మందిరము. ప్రాణమే-శివుడు- అని చెప్పి లింగన తన వీరశైవత్వమును చాటెను.
761

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2426207" నుండి వెలికితీశారు