ఆస్కార్ షిండ్లర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎నివాళి: a link to an authorized source
పంక్తి 26:
 
==నివాళి==
కొన్నేళ్ళ తర్వాత జర్మనీ వచ్చి చిన్నా చితకా వ్యాపారాలెన్నో చేశాడు.. కానీ ఏదీ కలిసి రాలేదు. ఒకప్పుడు లక్షాధికారిగా విలాసజీవితం గడిపిన షిండ్లర్ చివరి రోజుల్లో దారిద్య్రంలో బతుకు వెళ్ళదీశాడు. అతని దగ్గర ప్రాణాలు నిలుపుకున్న యూదులంతా అనేక దేశాల్లో స్థిరపడ్డారు. [[ఇజ్రాయెల్]] ఉన్నవారు ఏటా అతడి పుట్టిన రోజు నాటికి తమ దేశానికి పిలిచి సత్కరించి పంపేవాళ్ళు. ఆయన చనిపోయాక [[జెరూసలేం|జెరూసలెం]] పురవీధుల్లో ఘనంగా ఊరేగించి ఆ గడ్డపైనే [[సమాధి]] చేసి తమ కృతజ్ఞతా భావాన్ని చాటుకున్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం షిండ్లర్ ను ''రైటియస్ అమాంగ్ ది నేషన్స్'' పురస్కారంతో గౌరవించింది.<ref>[https://www.yadvashem.org/righteous/stories/schindler.html Oscar Schindler] - [https://www.yadvashem.org/ Yad Vashem] official site</ref>
 
 
షిండ్లర్‌ చనిపోయాక ఆయన సూట్‌కేస్‌లో లభ్యమైన యూదుల జాబితా (షిండ్లర్స్‌ లిస్ట్‌) ను ఇజ్రాయెల్‌లోని ఒక మ్యూజియంలో భద్రపరిచారు. అప్పట్లో స్టెర్న్‌ సాయంతో దాదాపు పది జాబితాలను రూపొందించాడు షిండ్లర్‌. వాటిలో నాలుగు మాత్రమే లభ్యమవుతున్నాయి. [[ఇజ్రాయిల్|ఇజ్రాయెల్‌]], [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]], [[ఆస్ట్రేలియా]] మ్యూజియాలలో మూడు ప్రతులు ఉండగా ఒక్కటి మాత్రం స్టెర్న్‌ వద్ద ఉండిపోయింది. యాభైఐదేళ్లపాటు అది స్టెర్న్‌, అతని వారసుల దగ్గరే ఉంది. అనంతరం వారు ఆ లిస్ట్‌ను [[న్యూయార్క్|న్యూయార్క్‌]]<nowiki/>కు చెందిన ఒక వ్యాపారికి అమ్మేశారు.
"https://te.wikipedia.org/wiki/ఆస్కార్_షిండ్లర్" నుండి వెలికితీశారు