"కార్బన్" కూర్పుల మధ్య తేడాలు

516 bytes added ,  1 సంవత్సరం క్రితం
అద్భుతమైన మూలక౦
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్థోమత → స్తోమత (2) using AWB)
(అద్భుతమైన మూలక౦)
ఈ రసాయన మూలకాన్ని ఇంగ్లీషు అక్షరం c తో సూచిస్తారు. దీని [[అణుసంఖ్య]] 6. ఇది [[ఆవర్తన పట్టిక]] లోని 14వ గుంపు (group) లో ఉన్న [[అలోహం]]. దీని [[బాహుబలం]] (వేలన్సీ) 4. ఈ మూలకానికి ఉన్న అనేక రూపాంతరాల్లో (allotropic forms) ముఖ్యమైనవి గ్రాఫైట్‌, [[వజ్రం]], అమూర్త కర్బనం (amorphous carbon) మరియు ఫుల్లరీన్‌ (fullerine) . ఈ మూలకం ప్రకృతిలో మూడు సమజన్యు (isotope) రూపాల్లో దొరుకుతుంది. వీటిలో కర్బనం-12 (<sup>12</sup>C అని రాస్తారు), కర్బనం-13 (<sup>13</sup>C) స్థిరత్వం ఉన్నాయి. [[కర్బనం-14]] (<sup>14</sup>C) రేడియో ధార్మిక ఐసోటోపు. దీని [[అర్ధాయుష్షు]] 5700 సంవత్సరాలు.
 
ఈ విశ్వంలో విస్తారంగా లభ్యమయే మూలకాలలో (ఉదజని, రవిజని (హీలియం), ఆమ్లజని (ఆక్సీజన్) తరువాత) కర్బనం నాలుగవ స్థానంలో ఉంది. “ప్రాణానికి కార్బన్‌ కన్నా అవసరమైన మూలక౦ [element] ఏదీలేదు,” అని Nature’s Building Blocks అనే పుస్తక౦ చెప్తు౦ది.<ref>[https://www.jw.org/te/ప్రచురణలు/పత్రికలు/తేజరిల్లు-no5-2016-అక్టోబరు/కార్బన్%E2%80%8C-అద్భుతమైన-మూలక౦/ అద్భుతమైన మూలక౦]</ref> మనకి తెలుసున్న జీవులన్నీటిలోనూ కర్బనం తప్పనిసరిగా ఉంటూ ఉంది. మానవ శరీరంలో, గురుత్వంలో, కర్బనానిది - ఆమ్లజని తరువాత - రెండవ స్థానం. మన శరీరాలలోని పదార్ధంలో 18.5 శాతం కర్బనమే.
 
కర్బనానికి బాహుబలం 4 అవటం వల్ల ఒక కర్బనపు అణువు నాలుగు దిశలలో ఇతర అణువులని సంతరించుకొని విస్తరించటానికి సదుపాయం కలిగి ఉంది. ఈ సదుపాయం వల్ల కర్బనం పెద్ద పెద్ద బణువులని అల్లుకు పోగలదు. ఈ స్తోమత ఉండటం వల్లనే జీవి శరీరంలో (కనీసం ఈ భూ గ్రహం మీద) పెద్ద పెద్ద బణువులన్నీ కర్బనం మీద ఆధారపడ్డ బణువులే. ఈ రకం స్తోమత సిద్ధాంత పరంగా సిలికాన్‌ అనే మూలకానికి కూడా ఉంది కానీ, ఈ భూలోకంలో జీవి కేవలం కర్బనపు సంతతే. అందుకనే ఆంగిక రసాయనానికి అంత ఎక్కువ ప్రాముఖ్యత.
4

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2427850" నుండి వెలికితీశారు