"తిరుపతి వేంకట కవులు" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
 
బ్రహ్మగురునివద్ద చేరువరకు ఆయనకు సుఖభోజనము, నిలికడుగా చదువు, కుదరలేదు. కాని కాశిలో వ్యాకరణాధ్యయనము చేసిరావలెననే వ్యామోహము వదలలేదు. మరలా చెప్పకుండా కాశికి మరలా పోయి 4 నెలలు ఉండి విద్యనభ్యసించినారు.కాని తల్లితండ్రుల గొడవవలన బ్రహ్మ గురువులు ఉత్తరము వ్రాయగా దానిని మన్నించి తిరిగివచ్చి స్థిరముగా బ్రహ్మగురునియొద్ద చదువునకు కుదిరెను.
 
[[శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి]] గారితో శ్రీ వేంకటశాస్త్రిగారికి జరిగిన తగాదా చాలా చిత్రమైనది. శ్రీపాదవారు సంస్కృతాంధ్రభాషలలో పండితులే కాక వేదము, శ్రౌతము కూడా అధ్యయనము చేసిన పుణ్యమూర్తులు. వీరు ఒక్కచేతిమీదుగా మహాభారతము, రామాయణము భాగవతము అనువదించి శతాధికగ్రంధకర్తలైన కవిసార్వభౌములు. మహామహోపాధ్యాయ బిరుదాంకితులు.వారివద్ద శ్రీ వేంకటశాస్త్రి మేఘసందేశము ఐదునెలలు శుశ్రూష చేసి కొంత చెప్పుకొనిరి. శ్రీకృష్ణ భారతముపై కొందరు ఒకమహా సభలో శ్రీవేంకటశాస్త్రిగారిని ఖండించి శ్రీపాదవారిని సమర్ధించిరి. శ్రీపాదవారికి గండపెండేరము సమర్పించు సభకువెళ్ళి శ్రీవేంకటకవి స్వయముగా గురుపాదమునకు బిరుదుటందెనలంకరించిరి. శ్రీవేంకటకవికి గండపెండేరము సమర్పించు సభలో శ్రీపాదవారుండటచే వారి అనుమతి లేనిది తానది గ్రహింపనని చెప్పగా, శ్రీపాదవారు వేంకటశాస్త్రి అందుకు తగిన వారే అను ప్రకటించిరి. వీరిరువురు మధ్య పలుసార్లు వైషమ్యములు వచ్చినను చివరకు రాజీ కుదురినట్లు 1931లో ప్రకటించినారు.
 
మదరాసు ప్రభుత్వమువారు ప్రధమాంధ్రాస్థాన కవిని నియమింప నిర్ణయించినపుడు వీరిద్దరిలో ఎవరిని నియమించుటాయని మంత్రులాలోచించిరట. తుదకు ప్రభుత్వము శ్రీవేంకట శాస్త్రినే వరించి గౌరవించినది. ఆతర్వాత కొద్దినెలలకే వారు పరమపదించగా, వేంటనే రెండవ ఆస్థాన కవిగా శ్రీపాదవారిని ప్రభుత్వము వరించినది.
 
తిరుపతిశాస్త్రి బలశాలియైనను 49సం.లే జీవింపగా బలహీనుడైన శ్రీవేంకటశాస్త్రి 80సం.లు దాదాపు సహస్రమాసములు జీవించెను. శ్రీవేంకటకవి తనకూ, తన కుటుంబమునకు ఎన్నోమారులు జబ్బులు చేయగా, ఆరోగ్య కామేశ్వరి, ఆరోగ్య భాస్కరస్తనము, మృత్యంజయ స్తనము వంటి కావ్యములు చెప్పి వ్యాధి విముక్తులైరి. వీరు మహాశివరాత్రినాడు నిర్యాణము చెందినారు.
 
 
743

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2430364" నుండి వెలికితీశారు