చెన్నై: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
footnotes = |
}}
'''[[చెన్నై]]''' ([[ఆంగ్లం]] : Chennai), {{ఆడియో|Madras.ogg|పలకడం}}, ([[తమిళం]] : சென்னை, చెన్నై), ([[తెలుగు]] : చెన్నపట్నం) [[భారత దేశము]]లోని [[తమిళనాడు]] రాష్ట్ర [[రాజధాని]]. ఇది భారత దేశములోని నాలుగవ పెద్ద మహానగరం. చెన్నై నగరము [[బంగాళా ఖాతము]] యొక్క తీరమున ఉంది. చెన్నై పూర్వపు పేరు '''మద్రాసు'''. ఇది [[తమిళనాడు]] రాష్ట్ర రాజధాని. 1953 వరకు ఆంధ్రకు కూడా రాజధాని. మద్రాసు రాజధానిగా వుండే ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచాడు. మద్రాసు లేని ఆంధ్ర తలలేని మొండెం అన్నాడు శ్రీరాములు. ఈ మహానగరము [[బంగాళాఖాతం]] కోరమాండల్ దక్షిణ తీరములో ఉంది. 2007 జనాభా గణాంకాల ప్రకారం చెన్నై నగర జనాభా 70.6 లక్షలు<ref name=36th_largest>{{cite web|url=http://www.world-gazetteer.com/wg.php?x=&men=gpro&lng=en&dat=32&geo=-104&srt=pnan&col=aohdq&pt=a&va=&geo=-1048954|title=World Gazetteer: Chennai agglomeration|archiveurl=http://archive.is/Dh83|archivedate=2012-12-09}}</ref> ఉండవచ్చునని అంచనా. ఈ [[ప్రపంచము]]<nowiki/>లోనే 34వ మహానగరమైన చెన్నైకి 375 సంవత్సరాల చరిత్ర ఉంది. భారత దేశములో వాణిజ్య మరియు పరిశ్రమల పరంగా చెన్నై నగరము మూడవ స్థానంలో నిలుస్తుంది. అంతే కాదు ఈ [[నగరము]]<nowiki/>లో ఉన్న [[దేవాలయాలు|దేవాలయాల]] నిర్మాణశైలి చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. శాస్త్రీయ సంగీతానికి, శాస్త్రీయ నృత్యానికి చెన్నై నగరము కేంద్రబిందువు. [[భారతదేశము]]<nowiki/>లోని వాహన నిర్మాణ (ఆటో మొబైల్) పరిశ్రమలు అన్నీ చెన్నై నగరంలో కేంద్రీకరించబడి ఉన్నాయి. అన్ని వాహననిర్మాణ పరిశ్రమలు ఉండడం వల్ల ఈ నగరాన్ని [[డెట్రాయిట్]] ఆఫ్ ఆగ్నేయా ఆసియా అని కూడా పిలుస్తారు<ref name=Detroit>{{cite web | title=Chennai has the 'potential' to become Detroit of South Asia | work=The Hindu| url=http://www.hindu.com/2005/07/18/stories/2005071803510600.htm| accessmonthday=August 6|accessyear=2005}}</ref>. ఔట్ సోర్సింగ్ కూడా చాలా మటుకు చెన్నై నగరము నుండి జరుగుతోంది. ఈ నగరము [[బంగాళా ఖాతం]] తూర్పుతీరం వెంబడి ఉండడం వల్ల ఈ నగరానికి 12 కి.మీ. బీచ్ రోడ్ ఉన్నది దీనినే [[మెరీనా బీచ్]] అని పిలుస్తారు. ఈ నగరములో క్రీడల పోటీలు కూడా నిర్వహించడానికి ప్రసిద్ధి చెందింది. ప్రసిద్ధికి చెందిన ఏ.టి.పి. [[టెన్నిస్]] పోటీలు, చెన్నై ఓపెన్ టెన్నీస్ పోటీలు నిర్వహించబడతున్నాయి.<ref>[http://www.atptennis.com/en/tournaments/profile/891.asp Tournament profile]</ref><ref>[http://sports.espn.go.com/sports/tennis/schedule Broadcast schedule in ESPN]</ref> గిండీ జాతీయ వన్యప్రాణి సంరక్షణాలయం ఈ నగర పొలిమేర్లలోనే ఉంది. వన్యప్రాణీ సంరక్షణాలయాలు మహానగరాల పొలిమేర్లలో ఉండటం ప్రపంచములోనే అరుదు. [[అమెరికా]]లో [[కొలరాడో]] రాష్ట్రములో ఉన్న [[డెన్వర్]] నగరములో కూడా వన్యప్రాణీ సంరక్షణాలయం నగర పొలిమేర్లలో ఉండడంవళ్ల చెన్నైని డెన్వర్ తో పోలుస్తారు. చెన్నైని డెన్వర్ కి సోదర నగరముగా చెబుతారు.
== నగరపు పేరు వెనుక కథ ==
ఆంధ్ర పధ్మనాయక ప్రభువైన వేంకటపతి నాయకుని కుమారుడైన దామెర్ల చెన్నప్ప నాయకుడు ఈ పట్టణాన్ని పాలించేవాడని, నగరానికి ఈ పేరు చెన్నప్ప నాయక నుండి వచ్చిందని చెబుతారు.<ref>http://www.chennai.tn.nic.in/chndistprof.htm#hist</ref> 1639 సంవత్సరంలో బ్రిటీష్ వారు [[ఈస్ట్ ఇండియా కంపెనీ]] పేరుతో [[భారత దేశం|ఇండియా]]ని ఆక్రమించుకొని వలసస్థావరముగా ఏర్పరచుకొన్నప్పుడు మద్రాసపట్నం అని అది కాలక్రమంలో మద్రాసుగా మార్పు చెందింది. మద్రాసపట్నానికి దక్షిణానికి ఉన్న చిన్న పట్టణం చెన్నపట్టణాన్ని రెండిటినీ కలిపి బ్రిటీష్ వారు మద్రాస్ గా పిలవడం ప్రారంభించారు. కానీ నగరవాసులు మాత్రము '''చెన్నపట్టణం''' లేదా '''చెన్నపురి''' అని పిలవడానికే ఇష్టపడతారు. [[1996]] ఆగష్టు మాసంలో నగరం పేరు మద్రాసు నుండి చెన్నైగా మార్చబడింది.<ref name=renamed>{{cite news | title=India's name game | author = Sashi Tharoor | work = International Herald Tribune | url=http://www.shashitharoor.com/articles/iht/name-game.php|accessdate=2005-08-09 }}</ref>. మద్రాసు పేరు పోర్చుగీసు వారి నుండి వచ్చిందనే మరో వాదన కూడా ఉంది. మద్రాస్ అనేపేరుకు మూలం [[పోర్చుగీసు]]కు చెందినది. (భారతదేశపు అనేక నగరాలకు పేర్లు ఇలానే యేర్పడ్డాయి ([[:en:Indian renaming controversy|పేరు మార్పులు]].) [[:en:Portuguese language|పోర్చుగీసు భాష]] పేరైన "మడ్రె డి డ్యూస్" (''Madre de Deus'') "మద్రాస్" పేరుకు మూలమని భావిస్తారు. ఈనగరంలోని అతి ప్రాచీన చర్చిని 1516లో నిర్మించారు. మరియు ఈ చర్చిని "నోస్సా సెన్‌హోరా డా లూజ్" (''Nossa Senhora da Luz'' ('Our Lady of Light')) కు, [[:en:Franciscan|ఫ్రాన్సీయుల]] మిషనరీకి అంకితమివ్వబడింది. కానీ "చెన్నై" అనే పదం తమిళ పదం కాదు, మద్రాస్ అనే పదము తమిళ పదం వుండవచ్చనే భావన కూడావున్నది.{{Fact|date=February 2007}} ఇంకో విశ్వాసం ప్రకారం (దీనిని నిర్ధారణ చేయలేదు) "చెన్నపట్టణం" అనే పేరు, [[చెన్న కేశవ పెరుమాళ్ దేవాలయం]] పేరున వచ్చింది.{{Fact|date=March 2007}} ఇంకో సిద్దాంతం ప్రకారం ఈ నగరపు భూమి యజమానియైన "చిన్నప్ప నాయకర్" (తరువాత ఈభూమిని ఈస్ట్ ఇండియా కంపెనీకి అమ్మేసాడు) పేరు మీద 'చెన్నై' అనే పేరొచ్చిందని భావిస్తారు.{{Fact|date=March 2007}}.
పంక్తి 180:
== వెలుపలి లింకులు ==
{{Commons category}}
{{Cite wikisource|title=చిన్ననాటి ముచ్చట్లు|author=కె. ఎన్. కేసరి|wslink=|chapter=ఆనాటి చెన్నపట్నం}}
 
{{తమిళనాడులోని జిల్లాలు}}
{{విష్ణు దేవాలయాలు}}
"https://te.wikipedia.org/wiki/చెన్నై" నుండి వెలికితీశారు