చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎జీవితం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బాగ → బాగా using AWB
పంక్తి 83:
మూర్తిరాజు చదువుతున్న రోజులలో ఒక సంఘటన జరిగింది. అడపా నారాయణకు సైకిల్ షాపు, బట్టలకొట్టు ఉండేది. ఒక రోజున నారాయణపురంలోకి విడేశీ [[ఇంగ్లీష్]] ఫ్యాషన్ అయిన బట్టలు అమ్మకానికి వచ్చాయి. అవి బాగున్నాయని నాలుగు రకాల దుస్తులు ఎంచుకొని తెచ్చుకున్నారు. ఆ బట్టలలో ఒక జత తొడుక్కుని, ఇంటి బయటకు వస్తుంటే అది తండ్రిగారి కటబడింది ఆయన తన పక్కనున్నవారితో "మా వాడు రంగుల బట్టలు కట్టుకున్నాడు." అని అంటున్నారు. అది మూర్తిరాజు విని వెంటనే ఇంట్లోకి వెళ్ళి మామూలు దుస్తులు వేసుకున్నారు. ఈయన సాధారణంగా తండ్రిగారి ఎదుట పడేవారుకాదు. తండ్రిగారు ఏమంటారో అని. ఆయన అభిమతం తెలుసుకొని అమలు జరపడం పిల్లల ఆనవాయితీగా ఉండేది. తండ్రిగారు తీరిక సమయాలలో నలుగురితో కూర్చుని మాట్లాడ్టం, అప్పుడప్పుడు భగవతం, రామాయణం వంటి పురాణాలు చదివి, అర్ఢం చెప్పడంతో కాలక్షేపం చేసేవారు. ఆయన ఎప్పుడూ సత్యమే మాట్లాడేవారు. ఎవరిని 'ఒరేయి ' అనకూడదు. మర్యాదగా మాట్లాడాలని చెప్పేవారు. మూర్తిరాజు చదువుకునే రోజులలో ఒకసారి కమ్మవారి ఇంటిలో అప్పసాని అచ్తూతరామయ్య, అప్పసాని సుబ్బారావులతో కలసి భోజనం చేసారు. ఇంది తెలిసి ఊరిలోని పెద్దలు ఈయన తండ్రిగారికి ఫిర్యాదు చేశారు. తండ్రిగారు ఈయనను మందలిస్తూ, ఇంకెప్పుడూ ఇలా చేయవద్దని అన్నారు. ఆ రోజులలో రాజులు ఎక్కడికైనా వెళ్ళి నప్పుడు [[బ్రాహ్మణులు]], [[క్షత్రియులు]] ఇళ్ళలో తప్ప ఎక్కడా భోజనం చేసేవారు కాదు. తిన్న ఆకును వారే తీసివేసేవారు. ఇప్పటి రోజులలో ఆ మర్యాదలు ఏమీలేవు. ఆనాడు పెద్దవారు ఏమి చేస్తే దాన్ని చేయడమే తప్ప "చేయను" అని పిల్లలు అనేవారు కారు.
మూర్తిరాజు తణుకులో 1934 నుండి 1939 వరకు విద్యాభ్యాసం చేసారు. 1939 మార్చి నెలలో స్కూలు ఫైనల్ పరీక్ష జరగగా, అందులో ఫెయిలయ్యారు. దానితో చదువు మాని స్వగ్రామానికి తిరిగివెళ్ళారు. ఆతర్వాత చదువు కొనసాగించడానికి ప్రయత్నించలేదు. ఈయన తండ్రిగారికి మాత్రం మూర్తిరాజు బాగా చదువుకోవాలనే అభిలాష ఉండేది. ట్యూషన్ ఏర్పాటు చేశారు. కాని, ట్యూషన్ కు వెళ్ళడంలో ఈయన అశ్రద్ధ చేసేవారు. చదవడానికి మనస్కరించేది కాదు, ఆసక్తి అంతా రాజకీయాలలో ఉండేది.
తణుకు నుండి తిరిగి వచ్చిన తర్వాత గుర్రపుస్వారీ నేర్చుకున్నారు. నేర్చుకొనక తప్పని పరిస్థితి. ఆ రోజుల్లో రోడ్లు లేవు. కాలువగట్టు దారులూ, పుంతలూ ఉండేవి. నారాయణపురం నుంచి పత్తేపురం రావటానికి మార్గం లేదు. వర్షాకాలంలో కయ్యలు బాగబాగా లోతుగా వుండేవి. గుర్రం కూడా ఎంతో కష్టపడి నడిచేది. అందుకే వర్షాకాలం పూర్తయ్యేవరుకు కుటుంబం అంతా నారాయణపురంలోనే మకాం ఉండేవారు.
మూర్తిరాజు తండ్రి చాలా శక్తిమంతులు. పట్టుదల గలవారు. ఆయన ఏది చెబితే అది జరగాలి. ఆయన చదువులకు ఉపాధ్యాయులను ఇంటికి పిలిపించి వారి చేత పిల్లలకు చెప్పించేవారు. అక్షరాలు గుండ్రంగా రాయాలని చెప్పేవారు. చుట్టుప్రక్కల ఊళ్ళలో ఎవరైనా గొడవలు పడితే ఆ తగవులు ఆయనే తీర్చేవారు. మూర్తిరాజుగారు కూడా కొంతకాలం అలాగే చేశారు.
తండ్రి బాపిరాజు చాలా పలుకుబడి గలవారు. 1936లో లోకల్ బోర్డులు వచ్చాయి. అప్పుడు జటిస్ పార్టీకి బలం ఉండేది. సర్ కూర్మా వెంకటరెడ్డినాయుడు గవర్నరు అయ్యారు. బడేటి వెంకట్రామయ్యనాయుడు, పెన్మెత్స పెద్దిరాజు జిల్లాలోని పెద్ద నాయకులు. బాపిరాజు తాలూకా బోర్డు సభ్యులుగా ఉండేవారు. బోర్డు మీటింగ్ కు వచ్చిన సభ్యులకు ప్రయాణపు ఖర్చులు ఇచ్చే పద్ధతిని మనం మానుకొందామని ఆయన మీటింగ్ లో తీర్మానం ప్రవేశపెడితే సభ్యులు అంగీకరించలేదు. ఆయన వెంటనే తన సభ్యత్వానికి రాజీనామా చేశారు.