ఇందిరా గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 144:
 
== ప్రధానిగా రెండవసారి ==
 
ఆమె ప్రధాని పీఠాన్ని రెండవసారి అలంకరించింది. అప్పటి అధ్యక్షుడు సర్వేపల్లి రాధాకృష్నన్ గారి పదవీకాలం పూర్తి కావచ్చింది. కాంగ్రెస్ వారు మరలా అతనినే ఆ పదవిలో నిలబెట్టాలని అనుకున్నారు. కానీ ఇందిర అప్పటి ఉపాధ్యక్షుడు జాకీర్ హుస్సేన్ ను అధ్యక్షునిగా పదవికి నామినేట్ చేసింది. ప్రతిపక్షాల వారు ఛీఫ్ జస్టిస్ సుబ్బారావుగారిని నామినేట్ చేసారు. [[జాకీర్ హుస్సేన్]] ఓటమి తనకు పెద్ద దెబ్బ అవుతుందని తెలిసీ, ఆమె అందుకు సిద్ధపడింది. ఆమె అంచనాలు ఎప్పుడూ తలకిందులవ్వలేదు. [[జాకిర్ హుసేన్|జాకీర్ హుస్సేన్]] పోటీలో నెగ్గాడు.
 
ఇజ్రాయిల్, అరబ్బు దేశాలకు మధ్య తగవులు వచ్చినప్పుడు ఇందిర అరబ్బుల పట్ల తన సానుభూతిని వెలిబుచ్చడం అమెరికా తదితర అభివృద్ధి చెందిన దేశాలకు ఆగ్రహం తెప్పించింది. అయినా ఆమె వెరవలేదు. తన పద్ధతులను, ఆలోచనా పంథాను మార్చుకోలేదు. ఎవరికీభయపడని మనస్తత్వం ఆమెది. ఆరెండు దేశాల మధ్య యుద్ధం దేనికైనా దారి తీయవచ్చని, ప్రపంచ యుద్ధమే సంభవించవచ్చని, మన దేశ పరిస్థితి దృష్ట్యా మన ఆసియా ఖండంలో, శాంతి సుస్థిరత అవసరమని ఆమె ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో తెలియజేసింది.
 
1969లో జాకీర్ హుస్సేన్ మరణం ఆమెకు సవాల్‌గా మారింది. ఆమె వ్యతిరేకులు ఆమెను ఎలాగైనా గద్దె దించాలనే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డిని అధ్యక్ష పదవికి పోటీలో పెట్టారు. కానీ, ఇందిరా గాంధీ చేత నామినేట్ చేయబడ్డ వి.వి.గిరి పోటీలో నెగ్గి అధ్యక్షుడయ్యాడు.
 
మొరార్జీ నుండి ఆర్థిక శాఖను వెనక్కి తీసుకోవడమే కాక బ్యాంకులను జాతీయం చేసి ఒక్కసారిగా సంచలనం సృష్టించడం వి.వి.గిరి గెలుపుకుకారణం కావచ్చు. మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసాడు.
 
== కాంగ్రెస్ లో చీలిక ==
 
చివరికి [[1969]]లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. సోషలిస్టుల సహాయంతో అలాగే రెండేళ్ళు పరిపాలించింది.
"https://te.wikipedia.org/wiki/ఇందిరా_గాంధీ" నుండి వెలికితీశారు