ఇందిరా గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 204:
 
== ఇందిర ఓటమి ==
సంజయ్ గాంధీ ఐదు సూత్రాల పథకాన్ని ప్రారంభించాడు. కుటుంబ నియంత్రణ, వరకట్నం, కులాల మీద ఆయన దృష్టి సారించాడు. ఇందిర ఆయనపై విశ్వాసాన్ని పెంచుకుని, అవసరమైన వేళల రాజకీయ్హ విషయాలపై తగు సూచనలు చెయ్యవచ్చని అభిప్రాయపడింది. సంజయ్ గాంధీ చర్యల వల్ల కొంతమంది ఇందిరాగాంధీ అనుచరులు కొన్ని విషయాలలో బాధపడిన సందర్భాలున్నాయి. వారిలోకొందరు సంజయ్ గాంధీ గురించి ఇందిరకు చూచాయగా తెలియజేసారు. కానీ, ఆమె కొట్టి పారేసింది. మరి కొందరు ఆమెకు చెప్తే తాము ఆమె అభిమానానికి దూరమవుతామని భయపడి మిన్నకున్నారు.
 
సంజయ్ గాంధీ పరిపాలనలో జోక్యం చేసుకోవడం, ఎమర్జెన్సీ గురించి సరియైన పత్రికా ప్రచారం లేకపోవడం వంటివి ప్రజలలో ఇందిరమీద అభిమానాన్ని తగ్గించాఇ. 1977లో జరిగిన ఎన్నికలలో ఇందిరాగాంధీ ఓడిపోయింది.
 
సన్నిహితులు ఆమెను ఎన్నోసార్లు ఎమర్జెన్సీ వల్ల కొన్ని దుష్పలితాలు ఎదురవుతున్నాయని, ప్రజలలొ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడుతోందని, ఎమర్జెన్సీ ఎత్తెయ్యమని హెచ్చరించారు. ఆమె వినలేదు. ఎమర్జెన్సీ ఎత్తివెయ్యకుండానే గృహ నిర్భంధంలో ఉన్న నాయకులంతా విడుదల చెయ్యబడ్డారు. 1977 మార్చి 19న ఎన్నికలు నిర్వహించబడతాయని ప్రకటించింది. ఎమర్జెన్సీ ఇంకా అమలులో ఉన్నందున పోలింగు సమయంలో అవినీతికి ఆస్కారం ఉండదు. తమకు అనుకూల చర్యలు చేపట్టేందుకు ఆమె వ్యతిరేకులకు సరియైన వ్యవధి లేకపోయింది.
 
జనవరి 30న జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ వంటి నాయకులు ఊరేగింపు జరిపి ప్రజల వద్దకు వెళ్ళారు. వారిని చాలాకాలం తరువాత చూసిన ప్రజలు జయజయ ధ్వానాలు చేసారు. మార్చి 22న ఇందిరాగాంధీ తన పదవికి రాజీనామా చేసింది.
----
 
"https://te.wikipedia.org/wiki/ఇందిరా_గాంధీ" నుండి వెలికితీశారు