ఇందిరా గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 211:
 
జనవరి 30న జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ వంటి నాయకులు ఊరేగింపు జరిపి ప్రజల వద్దకు వెళ్ళారు. వారిని చాలాకాలం తరువాత చూసిన ప్రజలు జయజయ ధ్వానాలు చేసారు. మార్చి 22న ఇందిరాగాంధీ తన పదవికి రాజీనామా చేసింది.
 
ఓటమిని చవిచూసినా, రాజకీయాల నుండి రిటైర్ అవలేదు. జనతాపార్టీ విజయానికి ముఖ్యకారణం ఇందిర మీద జరిగిన దుష్ప్రచారమే. జనతా పార్టీలో వారివి విభిన్న ధ్యాయాలు, అభిప్రాయాలు. ఒకరితొ ఒకరికి పడదు. ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా ఇందిరను పదవీచ్యుతురాలిని చేయాలనే సంకల్పమే వారిని ఒకటిగా పనిచేసేటట్లు చేసింది.
 
ఇందిరపై కొన్ని కేసులలో ఇరికించి అరెస్టు చేయించారు. కానీ ఏ కేసులూ ఆమె మీద నిలువలేదు. వెంటనే ఆమెను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. ప్రజలలో ఇది జనతా పార్టీ మీద అవిశ్వాసాన్ని కలుగజేసింది. ఇందిర మిద అభిమానాన్ని పెంచింది. ఇందిర విడుదలవుతూనే ప్రజలలోకి వెళ్లింది. ప్రజల అభిమానాన్ని చూరగొన్నది.
 
ఇందిరాగాంధీ తనకు అనుకూలంగా ఉన్నవారందరిని కూడగట్టి ఇందిరా కాంగ్రెస్ గా ఏర్పాటు చేసింది. ఆ పార్టీకి ఇందిర అధ్యకురాలిగా ఎన్నికయింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర లలో ఇందిరా కాంగ్రెస్ విజయభేరి మ్రోగించి రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. నవంబరు 7, 1978 న ఇందిర మరలా పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయింది. కర్ణాటక లోని చిక్‌మగలూరు నుండి లోక్‌సభకు పోటీ చేసి విజయం సాధించింది.
 
అయితే ఇందిరను దారిలోంచి తొలగించుకోవాలనే వారు చేసే ప్రయత్నాలు ఆపలేదు. ఆమె పదవిలో ఉండగా అధికారులను పీడించినట్లు ఆరోపించి ఆమెను తీహార్ జైలులో ఉంచారు. అయినా ఆమెలోని పోరాట పటిమ తగ్గలేదు. అక్కడ ఉండే తాను విడుదల అయిన తరువాత చెయ్యవలసిన ప్రణాళికను తయారుచేసింది. విడుదల అవగానే తన ప్రణాళికను అమలు పరచింది. అప్పటి మొరార్జీ దేశాయ్ పరిపాలనలో ధరలు ఆకాశాన్నంటాయి. నేరాలు పెరిగాయి. అదను చూసి ప్రతిపక్షమైన కాంగ్రెస్ వారు అతనిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానిలో నెగ్గలేకపోయిన దేశాయ్ ప్రధాని పదవికి రాజీనామా చేసాడు.
 
ఇందిరా కాంగ్రెస్ మద్దతుతో చరణ్ సింగ్ ప్రధానిగా పదవిని చేపట్టాడు. నెలలోపే అతను తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. అతను ప్రధానిగా ప్రజల సమస్యలను గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. 23 రోజులు అతని పాలనను గమనించిన ఇందిర అతనికి తన మద్దతును ఉపసంహరించుకుంది. గత్యంతరం లేని పరిస్థితులలో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి లోక్‌సభను రద్దు చెయ్యవలసినదిగా కోరాడు.
 
ఇందిర ప్రజలలో సుడిగాలివలె తిరుగుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చెస్తానని వారికి మాట ఇచ్చింది. ఇందిరపై ప్రజలకు గల నమ్మకం మరొకసారి ఋజువయింది. లోక్‌సభ ఎన్నికలలో 529 స్థానలకు గాను 351 సీట్లు గెలుచుకుని తమ సత్తాను నిరూపించుకున్నది.
 
== ప్రధానిగా మరలా ఇందిర ==
----
 
"https://te.wikipedia.org/wiki/ఇందిరా_గాంధీ" నుండి వెలికితీశారు