ఇందిరా గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 225:
 
== ప్రధానిగా మరలా ఇందిర ==
1980 జనవరిలో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన ఇందిర తన మంత్రివర్గంలో యువజన కాంగ్రెస్ సభ్యులకు చోటిచ్చింది. ఎంతమందికి మంత్రి పదవి ఇచ్చినా తనకుమారుడైన సంజయ్ గాంధీకి మాత్రం అవకాశం ఇవ్వలేదు. అతడికి ఇంకా రాజకీయానుభవం కావాలని ఆమె ఉద్దేశ్యం.
 
అప్పటికి దేశ పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. 1979 లో వచ్చిన కరువు, బంగ్లాదేశ్ నుండి వచ్చిన కాందిశీకులు అస్సాంలో నివాసమేర్పరచుకొని అక్కడే ఉండిపోవడం వంటివి దేశంలోని పరిస్థితిని తల్లక్రిందులు చేసాయి. ఇంకా కొన్ని రాష్ట్రాలు జనతాపార్టీ పాలనలో ఉండిపోవడంతో దేశ పరిస్థితిని చక్క దిద్దడానికి ఆటంకంగా మారింది. అందువల్ల 1980 ఫిబ్రవరి 13న ఆ రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది.
 
తన మంత్రివర్గంలోని మంత్రులకు అనుభవం లేకపోవడం వల్ల ఆయా రంగాల్లో అనుభవం ఉన్నవారిని, మేధావులను వారికి సహాయకులుగా ఏర్పాటు చేసింది. నెమ్మదిగా దేశ పరిస్థితిని అదుపులోకి తీసుకు రాసాగింది. ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఎదుర్కోవలసి వచ్చుంది. ఉగ్రవాదులు పంజాబ్ స్వర్ణదేవాలయం నుండి ఉద్యమాన్ని నడపాలని నిర్ణయించారు. బింద్రన్ వాలే నాయకత్వంలో జరుగుతున్న ఈ ఉద్యమాన్ని ఆపడానికి భారత సైన్యం సహాయంతో "ఆపరేషన్ బ్లూస్టార్" పేరుతో జరిపించిన పోరాటంలో బింద్రన్ వాలేతో పాటు ఇంకా చాలా మంది మరణించారు. కానీ స్వర్ణదేవాలయం దెబ్బతింది. దీనివల్ల సిక్కుల కోపానికి ఇందిర గురయ్యింది.
 
----
 
"https://te.wikipedia.org/wiki/ఇందిరా_గాంధీ" నుండి వెలికితీశారు