కంప్యూటరు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: telangana-education
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కంటె → కంటే , సాధారణముగా → సాధారణంగా , స్థోమత → స్తోమత ( using AWB
పంక్తి 78:
బయాస్‌లో దాచిన ఆదేశాలు అటు కఠినాంగాలకీ, ఇటు నిరవాకికీ మధ్యవర్తిలా పని చేస్తాయి. ఉదాహరణకి నిరవాకిని నడిపే మృదులాంగం నకలు ఒకటి పళ్లెం మీద ఉంటుంది. కంప్యూటర్‌ని “ఆన్” చెయ్యగానే ఈ మృదులాంగం లోని కొన్ని ముఖ్యమైన క్రమణికలు (programs) ప్రాథమిక స్థాయి కొట్లోకి రావాణా కావాలి. ఈ పని చెయ్యడానికి కావలసిన ఆదేశాలు బయాస్‌లో ఉంటాయి. మరొక ఉదాహరణ. కంప్యూటర్‌ని “ఆన్” చేసిన వెంటనే మనం కీబోర్డు మీద ఏదో టైపు చెయ్యవలసిన అవసరం వస్తుంది. అంటే అంతవరకు ప్రాణం లేకుండా పడున్న కుంచికపలకకి ప్రాణం పోసి లేవగొట్టాలి. ఇలా లేవగొట్టడానికి కావలసిన క్రమణికలని “కుంచికపలక చోదరి” (keyboard driver) అంటారు. దీనిని కూడా బయాస్ లోనే దాచి ఉంచుతారు. ఇలాగే కంప్యూటర్‌తో సంభాషించడానికి కావలసిన మృదులాంగ చోదరులు (software drivers) అన్ని కూడా బయాస్ లోనే నిక్షిప్తమై ఉంటాయి. ఇదే విధంగా పళ్లెం మీద నిక్షిప్తం అయి ఉన్న నిరవాకిలోని క్రమణికలు అవసరం వెంబడి ప్రాథమిక స్థాయి కొట్లోకి రవాణా చెయ్యడానికి కావలసిన క్రమణికలు కూడా ఈ బయాస్ లోనే దాచుకోవాలి. ఇక్కడ “గుడ్డు ముందా? పిల్ల ముందా?” వంటి ప్రశ్న పుట్టే అవకాశం ఉంది కనుక ఇప్పటికి ఈ చర్చ ఆపుతాను.
 
ఇంటికి తీసుకెళ్లవలసిన అంశం. నిరవాకి లేదా ఉపద్రష్ట లేదా ఆపరేటింగ్ సిస్టం లేని కఠినాంగం (hardware) ప్రాణం లేని కట్టె లాంటిది. రెండూ ఉంటేనే ఏ పని అయినా చెయ్యగలిగే స్థోమతస్తోమత వస్తుంది.
 
== కంప్యూటర్లు చెయ్యగలిగే పనులు ==
పంక్తి 180:
2. కుంచికపలక ఒక విద్యుత్ వాకేతం (signal) ని కంప్యూటర్ పెట్టెలో ఉన్న అనేకమైన విభాగాలలో ఒక విభాగానికి పంపుతుంది. వాకేతం అంటే వార్తకి సంకేతం. ఈ సందర్భంలో ఈ వాకేతాన్ని ఇంగ్లీషులో స్కేన్ కోడ్ (scan code) అంటారు. M కి బదులు 6 ఉన్న బొత్తాన్ని నొక్కితే మరొక వాకేతం (అంటే మరొక scan code) పుడుతుంది. అంటే మనం నొక్కే ప్రతి బొత్తానికి ఒక ఏకైక (unique) స్కేన్ కోడ్ కేటాయించబడి ఉంటుందన్న మాట. సర్వసాధారణంగా ఈ స్కేన్ కోడ్ ASCII కోడు అవుతుంది. (ఒక వాకేతాన్ని అంకెల రూపంలో మార్చి రాసినప్పుడు దానిని మనం “కోడు” అందాం.)
 
3. కంప్యుటర్ పెట్టె లోపల ఈ స్కేన్ కోడ్ ని అర్థం చేసుకో గలిగే స్థోమతస్తోమత గల గోరంత పరిమాణం గల చిన్న సిలికాన్ చితుకు (chip) ఉంటుంది. ఈ చితుకు చూడడానికి చితికిపోయిన చిల్లపెంకులా కాని, పలక ముక్కలా కాని ఉంటుంది. ఈ చితుకులో, కంటికి కనబడని పరిమాణంలో, వందలాది ట్రాన్‌సిస్టర్లు ఉంటాయి. ఈ ట్రాన్సిస్టర్ల సహాయంతో ఈ చితుకు కుంచికపలక కార్యకలాపాలని నియంత్రిస్తుంది కనుక ఈ చితుకుని “కుంచికపలక నియంత్రణి” (keyboard controller) అంటారు. ఈ చితుకు ఈ స్కేన్ కోడ్ ని చదివి, అర్థం చేసుకుని, M అనే అక్షరం ఉన్న మీట మనం నొక్కేమని నిర్ద్వందంగా నిర్ధారిస్తుంది.
 
4. అప్పుడు ఆ “స్కేన్ కోడ్”ని ఒక అరలో తాత్కాలికంగా దాచుతుంది. ఇలా తాత్కాలికంగా దాచుకుందికి వాడే అరలని ఇంగ్లీషులో “బప్ఫర్” (buffer) అంటారు. ఈ బప్ఫర్ అనే మాట అనేక రంగాల్లో వస్తూ ఉంటుంది. రెండు పెద్ద రాజ్యాల మధ్య ఉండే బడుగు దేశాలని “బప్ఫర్” అనొచ్చు. భారతదేశం, చైనాల మధ్య ఉన్న నేపాలు, భూటాను బప్ఫర్ రాజ్యాలు. అలాగే మందు తీక్షణతని అదుపులో పెట్టడానికి వాడే ఘటక ద్రవ్యాలని బప్ఫర్ అంటారు. చిన్నప్పుడు తరగతిలో కూర్చుని విన్న పాఠాన్ని చిత్తు పుస్తకంలో రాసుకుని ఇంటికొచ్చి “మంచి పుస్తకం”లో తిరగ రాసుకునే పద్ధతిలో చిత్తు పుస్తకం బప్ఫర్ లాంటిది. కనుక ఈ సందర్భంలో బప్ఫర్ అంటే “చిత్తు కొట్టు” లేదా “చిత్తు పలక.” మనం వాడుతూన్న ఉదాహరణలో M అనే అక్షరాన్ని నొక్కేము కనుక, M యొక్క ASCII కోడు D5 కనుక, చిత్తు పలక మీద D5, అనగా 1101 0101, నమోదు అవుతుంది. (ఇక్కడ కీబోర్డ్ కంట్రోలర్ లో ఒక పెద్ద జాబితా ఉన్నట్లు ఊహించుకొండి. ఆ జాబితాలో, ఒకొక్క బొత్తాం నుండి ఒకొక్క తీగ చొప్పున వచ్చి ఆ జాబితాకి తగిలించినట్లు ఊహించుకొండి. ఈ తీగ ఒక పక్క, దానికి ఎదురుగా మనం నొక్కిన బొత్తానికి సంబంధించిన అక్షరాంకం (alphanumeric) యొక్క ASCII కోడు ఉన్నట్లు ఊహించుకొండి. అప్పుడు జాబితాలో ఏ అడ్డు వరసలో M ఉందో చూసుకుని దానికి ఎదురుగా ఉన్న అష్టా (byte) మనకి కావలసిన ASCII కోడు అనుకోవచ్చు.)
పంక్తి 196:
10. దృశ్యకపు కొట్లో ఏది ఉంటే దానిని సెకండుకి 100 సార్లు చొప్పున ఉపద్రష్ట మనకి చూపిస్తుంది.
 
ఒక్క చిన్న పని చెయ్యడానికి ఇంత హడావిడా? పైపెచ్చు ఇదంతా త్రుటి కాలంలో జరిగిపోయినట్లు మనకి భ్రమ కలుగుతుంది. కలనకలశం మన జ్ఞానేంద్రియాల కంటెకంటే ఎన్నో రెట్లు జోరుగా పని చెయ్యడమే ఈ భ్రమకి కారణం.
 
పైన రాసినది కేవలం ఒక నఖచిత్రం అని మరచ పోకండి. ఈ ఒక్క పని చెయ్యడానికి లోపల జరిగే తతంగం కూలంకషంగా వర్ణించాలంటే ఎన్నో కాగితాలు ఖరాబు చెయ్యాలి. ఇలాంటి పనులు సెకండుకి వెయ్యికి పైబడి కలశం చేస్తూ ఉంటుంది.
పంక్తి 218:
ఈ విభాగము బయట ప్రపంచము నుండి సమాచారము సేకరించుటకు, మరియు ఫలితములను బయట ప్రపంచమునకు తెలుపుటకు ఒక సాధనముగా ఉపయోగపడును. ఒక మామూలు వ్యక్తిగత కంప్యూటరులో సమాచారమును ప్రవేశపెట్టుటకు కీబోర్డు మరియు మౌసులను, బహిర్గపరుచుటకు కంప్యూటరు మానిటరు, ప్రింటరు మొదలగు వాటిని ఉపయోగిస్తాము. ఇవి కాక ఇంకా ఎన్నో సాధనములను కంప్యుటరుకు బయట ప్రపంచమునకు మధ్య మార్పిడికి ఉపయోగిస్తారు.
 
సాధారణముగాసాధారణంగా ఇటువంటి కంప్యూటరు యొక్క పనిచేయు విధానము చాలా సూటిగా ఉంటుంది. కౌంటరు యొక్క లెక్క పెరిగిన ప్రతీసారి ఒక క్రొత్త ఆదేశమును, దానికి సంబంధించిన డేటాను మెమరీ నుండి చదివి దానిని నిర్వర్తించడము, తిరిగి ఫలితములను మెమరీలో బద్రపరచటం, మళ్ళీ తరువాతి ఆదేశమును స్వీకరించటం. ఈ విధముగా హాల్ట్ (ఆగుము) అను ఆదేశము వచ్చు వరకు జరుగుతూనే ఉంటుంది.
 
పెద్ద పెద్ద కంప్యూటర్లలో ఈ నమూనాలో కొంచం తేడా ఉండును. వాటిలో ఒక సిపియు బదులుగా అనేక మయిన సిపియులు ఉండును. సూపరు కంప్యూటర్లలో ఈ నిర్మాణము మరింత తేడాగా ఉండును. వాటిలో కొన్ని వేల సిపియులు ఉండును, అట్టి నిర్మాణములు ప్రత్యేకమయిన కార్యములకు మాత్రమే ఉపయోగించుతారు.
"https://te.wikipedia.org/wiki/కంప్యూటరు" నుండి వెలికితీశారు