జమున (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి →‎జీవిత విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బాగ → బాగా using AWB
పంక్తి 44:
[[తెనాలి]] సమీపంలోని [[మండూరు]] గ్రామంలో 'ఖిల్జీ రాజ్య పతనం ' అనే నాటిక ప్రదర్శన కోసం ప్రత్యేకంగా జగ్గయ్య జమున ఎంపిక చేసుకుని తీసుకువెళ్ళాడు. ఇదే నాటికలో మరో ప్రముఖ నటుడు [[గుమ్మడి]] కూడా నటించాడు. నాటకాలలో ఆమె ప్రతిభ నలుమూలలకూ పాకడం వల్ల సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. [[బి.వి.రామానందం]] తీసిన [[పుట్టిల్లు]] ఆమె తొలిచిత్రం.
 
ఆ తరువాత [[అక్కినేని నాగేశ్వరరావు]], జగ్గయ్య, [[నందమూరి తారక రామారావు]] తదితర నటుల సరసన నాయికగా నటించింది. ఎన్ని పాత్రలలో నటించినా ఆమెకు బాగబాగా పేరు తెచ్చింది [[సత్యభామ]] పాత్రే. ఆ పాత్రలో ఇప్పటిటికీ ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేము అన్నట్టుగా నటించిందీమె. [[వినాయకచవితి]] చిత్రంలో మొదటి సారి సత్యభామలో జమున కనిపిస్తుంది. ఆ తర్వాత [[శ్రీకృష్ణ తులాభారం]] చిత్రంలో కూడా అదే పాత్ర వేసింది. ఈ సినిమాలో సత్యభామ ఆహార్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. [[కమలాకర కామేశ్వరరావు]] దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని పాత్రే ఆమెకు పేరు తెచ్చింది. కళపై ఉన్న మక్కువతో నాటకాల్లో బుర్రకథ బ్రహ్మ [[నాజర్‌]] దగ్గర శిక్షణ తీసుకోవటం తన నట జీవితానికి పట్టం కట్టిందన్నారు.<ref>(ఈనాడు11.11.2009)</ref>
 
సినీతారలుగా ఉండి, రాజకీయాలలో ప్రవేశించి రాణించిన కథానాయికలలో ఆమె అగ్రస్థానంలో ఉంటారు. ''దివంగత ప్రధాని [[ఇందిరా గాంధీ]] అంటే ఉన్న అభిమానం, గౌరవం నన్ను రాజకీయాలలోకి లాక్కొచ్చాయి'' అని తన రాజకీయ జీవితం గురించి చెబుతుంది జమున. ఈమె తెలుగు సినిమాలే కాక తమిళం, హిందీ సినిమాలలో కూడా నటించింది. ఆమె నటించిన [[మిస్సమ్మ]], [[ఇల్లరికం]], [[ఇలవేల్పు]], [[లేతమనసులు]], [[గుండమ్మ కథ]] చిత్రాలు విజయవంతమయ్యి రజతొత్సవం జరుపుకున్నాయి.
"https://te.wikipedia.org/wiki/జమున_(నటి)" నుండి వెలికితీశారు