పిల్లలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పాలు ఎరుగని పసిబుగ్గలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్థోమత → స్తోమత (2), ) → ) using AWB
చి →‎పిల్లలే మనకు పాఠాలు: భాషాదోషాల సవరణ, typos fixed: ) → ) using AWB
పంక్తి 148:
మాటల్లోతప్పులు దొర్లితే, అంతా నవ్వుతారని తెలుసు. అయినా, ధైర్యంగా మాట్లాడతారు. మాటలన్నీ వచ్చేదాకా మాట్లాడుతూనే ఉంటారు. ఇంట్లో ఒక భాష, వీధిలో ఒక భాష, బళ్లో ఒక భాష. తొలిదశలో కాస్త తికమకపడ్డా, తొందర్లోనే అన్నీ ఒంటబట్టించుకుంటారు. పసిపిల్లలు రెండేళ్ల వయసు నుంచి పొద్దున్న నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునేలోపు సగటున గంటకో కొత్తపదం నేర్చుకుంటారని అంచనా. పదిహేనేళ్లు వచ్చేసరికి పెద్ద పదకోశమే తయారవుతుంది. ఆ తర్వాత తొంభై ఏళ్లు బతికినా వందేళ్లు బతికినా... ఆ పదకోశంలో చేరేది ఏ వేయిపదాలో రెండు వేల పదాలో!పెద్దయ్యాక కష్టపడి కొత్త భాషలు నేర్చుకున్నా, అంతంత పరిజ్ఞానమే. పసిపిల్లల్లా తమకేమీ తెలియదనుకునేవారే ఏమైనా నేర్చుకోగలరు.
 
పసివాడికి అమ్మానాన్నల మీదో గురువు మీదో ఉన్న నమ్మకం, భార్యకు భర్తమీదో భర్తకు భార్యమీదో ఉంటే కాపురాల్లో గొడవలుండవు. అనుబంధాల్లో బీటలుండవు. ఆత్మహత్యలుండవు. హత్యలుండవు. ముందు మీరంతా మార్పుచెంది పిల్లల్లాగా అవకపోతే స్వర్గంలో ప్రవేశించలేరు అంటుంది బైబిలు (మత్తయి 18.3). పురాణాల్లోని [[సనక సనందాదులు]] కూడా నిత్యబాల్యాన్ని వరంగా పొందారు. పసిపిల్లలంత స్వచ్ఛంగా ఉండేవారే మంచి నాయకులు అవుతారు. బాలల్లోని జిజ్ఞాస, నిజాయతీ, చొరవ... మనకు అనుసరణీయం. (ఈనాడు8.11.2009)
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/పిల్లలు" నుండి వెలికితీశారు