బండి రాజన్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జననం: భాషాదోషాల సవరణ, typos fixed: ె → ే using AWB
పంక్తి 8:
ఛాయాగ్రహణంలో రాజన్ తొక్కిన కొత్త పుంతలు తనకు దేశీయ, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది. 1987లో నగ్న చిత్రాలపై ఛాయాచిత్ర కళాకృతులను (Portfolio) సమర్పించి రాయల్ ఫోటోగ్రఫీ సొసైటీ ఫెలోషిప్ పొందాడు. A.P. State Academy Of Photography కార్యదర్శిగా ఉంటూ, భగవాన్ దాస్ తర్వాత Lens Light అనే ఛాయాగ్రాహక పత్రికకు సంపాదకత్వం వహించాడు.
డిజిటల్ ఛాయాగ్రహణానికి ముందు ఛాయాచిత్రాలు డార్క్‌రూం (చీకటి గది) లోనెలోనే స్థిర రూపం దాల్చేవి. నెగటివ్ లు వృద్ధి చేయటానికి, స్థిరపరచడానికై రాజన్ తానే రూపొందించుకొన్న [[రసాయన సూత్రం|రసాయనిక]] సూత్రం పై ద్రవణాలు కలిపి డెవలపర్ తయారు చేసి, నెగటివ్ లను స్థిరపరిచేవాడు. ఈ విధానం లో, చిత్రం లో, నలుపు, తెలుపులను ప్రస్ఫుటంగా చూపే హైడ్రోక్వినాన్ లేకుండా కేవలం మెటాల్ తోనే ఫిల్మ్ ను వృద్ధిపరచి, స్థిరపరచి, నలుపు తెలుపులో ఎన్నో కళాఖండాలు సృష్టించాడు. ఇది రాజన్ ప్రతిభకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చును. ఫొటొషాప్ లాంటి సాఫ్ట్వేర్లు లేని సమయంలో కూడా రాజన్ అద్భుతాలు చేశాడు తన కళా నైపుణ్యంతో. తన ఛాయాచిత్రాలను పలు మార్లు One man show లో ప్రదర్శించి, పలువురి ప్రశంసలందుకున్నాడు. రాజన్ తీసిన [[నగ్నత్వం|నగ్న]] చిత్రాలలో రసికత ఉంటుంది కాని అసభ్యతకు చోటు లేదు. అందుకే అవి రసజ్ఞుల ప్రశంసలు పొందాయి.
 
కొడాక్ 620 తో మొదలుపెట్టిన రాజన్, తన విద్యార్థులకు ఛాయాగ్రహణ పాఠాలలో భాగంగా బోధించటానికై, చాలా కెమేరాలు సేకరించాడు. వాటిలో ఛాయాచిత్రకారులలో హోదాకు చిహ్నమైన Hasselblad-medium-format camera కూడా ఉంది. ఫిల్మ్ కెమేరా Asahi Pentax నుంచి, ఛాయాగ్రహణం డిజిటల్ దిశగా సాగిన పయనంలో రాజన్ Canon 400D వాడే వాడు. ఛాయాగ్రహణ శాఖలలో ఒకటైన Industrial Photography లో కూడా రాజన్ తన సత్తా చూపాడు. ఈ రంగం లో, Andhra Pradesh Dairy Development Corporation, the National Mineral Development Corporation, E.C.I.L., Vizag Shipyard వంటి సంస్థలు తన ఖాతాదారుల చిట్టాలో ఉన్నాయి.నగ్న చిత్రాలకు, అసభ్య చిత్రాలకు మధ్య ఒక గీత ఉందంటాడు రాజన్. [[ఫోటోగ్రఫీ|ఛాయాగ్రహణం]] ఒక భాషైతే, అందులోని [[వ్యాకరణము|వ్యాకరణ]]<nowiki/>మే Composition, Color, Space, Form, Proper Exposure, Angle and Light అంటాడు. ఈ మెళకువ గ్రహించినవాడు మంచి ఛాయాగ్రాహకుడవుతాడని రాజన్ చెప్తాడు.
"https://te.wikipedia.org/wiki/బండి_రాజన్_బాబు" నుండి వెలికితీశారు