మదురై: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎చరిత్ర: భాషాదోషాల సవరణ, typos fixed: ె → ే using AWB
పంక్తి 79:
9వ శతాబ్ధపు ప్రారంభ దశలో తరువాత పాండ్యరాజుల క్షీణదశ ఆరంభం అయిన తరువాత ఈ నగరం చోళసామ్రాజ్యం ఆధీనంలోకి వచ్చింది. 13వ శతాబ్దం ఆరంభదశ వరకు ఈ నగరం చోళుల ఆధీనంలో ఉంది. తరువాత రెండవ పాండ్యన్ సామ్రాజ్యాన్ని స్థాపించి విస్తరించి తన సామ్రాజ్యానికి మదురై నగరాన్ని రాజధానిగా చేసి పాలించించాడు. చివరి పాండ్యరాజు అయిన కులశేఖర పాండ్యన్ మరణానంతరం మదురై నగరం ఢిల్లీ సుల్తానైన తుగ్లక్ సామ్రాజ్యంలో భాగం అయింది. 1378 లో విజయనగర రాజుల వశమైయ్యే వరకు '''మదురై సుల్తానేట్''' తుగ్లక్ సుల్తానేట్ నుండి విడిపోయి స్వతంత్ర రాజ్యంగా పాలన సాగించింది. విజయనగసామ్రాజ్యం నుండి విడివడి 1559లో మదురైనగరం మదురై నాయకర్ పాలనలో కొనసాగింది. 1776 నాయకర్ సామ్రాజ్యం అంతం అయిన తరువాత మదురై నగరం చేతులు మారుతూ '''కర్ణాటక నవాబు, ఆర్కాట్ నవాబు, యూసఫ్ ఖాన్''' మరియు '''చందా సాహెబ్‌'''ల అధీనంలో ఉంటూ వచ్చింది. 18వ శతాబ్ధపు మధ్యకాలంలో మరుదనాయకం ఆధీనంలో ఉంది. 1801లో బ్రిటిష్ ప్రభుత్వం మదురై నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత ఈ నగరం మద్రాసు ప్రెసిడెన్సీలో ఒక భాగం అయింది. పెరుగుతున్న జనాభా కారణంగా 1837 నుండి ఆలయ కోటలను పడగొట్టి నగరం ప్రజా నివాస ప్రాంతంగా చేయబడింది. ఇది అప్పటి కలెక్టర్ జాన్ బ్లాక్‌బర్న్ ఆదేశాలమేరకు జరిగింది. కందకమును ఎండబెట్టి శిథిలాలను కొత్త వీధుల నిర్మాణానికి ఉపయోగించారు. అవి ప్రస్తుతం వేలి, మారత్ మరియు పెరుమాళ్ మేస్త్రి వీధులుగా ఉన్నాయి. 1866లో ఈ నగరానికి పురపాలక అంతస్తు ఇవ్వబడింది.
 
భారతీయ స్వాతంత్ర్యోద్యమంలో మదురై ప్రధాన పాత్ర వహించింది. ఈ మదురై నగరంలోనే [[మహాత్మా గాంధీ]] పైచొక్కా ధరించనని నిర్ణయం తీసుకుని చరిత్రలో నిలిచారు . ఇక్కడ ఉన్న [[వ్యవసాయం|వ్యవసాయ]] కూలీలను చూసి గాంధీజీ అటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎన్ ఎమ్ ఆర్ సుబ్బరామన్, మొహమ్మద్ ఇస్మాయిల్ సాహెబ్, నియామతుల్లాహ్ ఇబ్రహీం సాహెబ్ మరియు మీర్‌ ఇస్మాయిల్ సాహెబ్ నాయకత్వంలో మదురై నగరంలో స్వాతంత్ర్యోద్యమం సాగింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రధానంగా వైగైనదికి ఉత్తరంగా నగరం విస్తరించింది. వీటిలో అణ్ణానగర్ మరియు కె.కెకే నగర్ వంటి నివాస ప్రాంతాలు అధికంగా ఉన్నాయి.
 
== భౌగోళికం ==
"https://te.wikipedia.org/wiki/మదురై" నుండి వెలికితీశారు