సమాచార ఉపగ్రహం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గూగుల్ అనువాద వ్యాసాల అభివృద్ధి ప్రాజెక్టు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి భాషాదోషాల సవరణ, typos fixed: లు → లు (2), బాగ → బాగా , భుమి → భూమి, స్తిర → స్థిర, → (8), ) → ) using AWB
పంక్తి 7:
 
== చరిత్ర ==
భూస్థిర సమాచార ఉపగ్రహ భావనను మొదటగా ఆర్థర్ సి క్లార్క్ కల్పన చేసాడు. ఈ భావనను ఆయన కాన్‌స్తాంతిన్ త్సియోల్కోవ్‌స్కీ, హెర్మన్ నూర్డంగ్‌ లునూర్డంగ్‌లు చేసిన పరిశోధనలపై, వ్యాసాలపై ఆధారపడి చేసాడు. 1945  అక్టోబరులో క్లార్క్, ''వైర్‌లెస్ వరల్డ్'' అనే బ్రిటిషు పత్రికలో "'''''ఎక్స్‌ట్రా టెరెస్ట్రియల్ రిలేస్'''''" అనే వ్యాసాన్ని ప్రచురించాడు.<ref>[https://web.archive.org/web/20071225093216/http://www.lsi.usp.br/~rbianchi/clarke/ACC.ETRelaysFull.html Extraterrestrial Relays]</ref> [[భూ స్థిర కక్ష్య|భూస్థిర కక్ష్య]] (జియోస్టేషనరీ ఆర్బిట్) <nowiki/>లో ఉపగ్రహాలను ప్రక్షేపించి, రేడియో సిగ్నళ్ళను ప్రసారం చేసే  విషయమై మౌలికాంశాలను అందులో వివరించాడు. అందుచేత క్లార్క్‌ను సమాచార ఉపగ్రహ ఆవిష్కర్తగా పేర్కొంటారు. ఆయన కల్పన చేసిన కక్ష్యను క్లార్క్ బెల్ట్ అని అంటారు.<ref>{{వెబ్ మూలము|url=http://www.engadget.com/2008/03/18/arthur-c-clarke-inventor-of-satellite-visionary-in-technology/|title=Arthur C. Clarke, inventor of satellite, visionary in technology, dead at 90|date=2008-03-18|publisher=Engadget.com|accessdate=2016-02-10}}</ref>
 
కొన్ని దశాబ్దాల తరువాత అమెరికా నౌకాదళం ''కమ్యూనికేషన్ మూన్ రిలే'' అనే ప్రాజెక్టును చేపట్టింది. దాని ధ్యేయం, చంద్రుణ్ణి అద్దంగా వాడి వైర్‌లెస్ సిగ్నళ్ళను భూమికి తిరిగి ప్రతిఫలించేలా చెయ్యడం.
పంక్తి 21:
భూస్థిర ఉపగ్రహాల కంటే కొద్దిగా ముందు వచ్చింది, సింకామ్ 2. 1963 జూలై 26 న ప్రయోగించిన సింకామ్ 2, [[భూ సమన్వయ కక్ష్య]] (జియోసింక్రొనస్ ఆర్బిట్) లోని మొట్టమొదటి సమాచార ఉపగ్రహం. ఇది భూభ్రమణ వేగంతో సమానమైన కోణీయ వేగంతో పరిభ్రమించినప్పటికీ భూ సమన్వయ కక్ష్యలో ఉండడం చేత, దీనికి ఉత్తర-దక్షిణ చలనం ఉండేది. ఈ కారణంగా దీన్ని రిసీవర్లు సరిగా అనుసరించడం కోసం ప్రత్యేక పరికరాలు వాడాల్సి వచ్చేది. దాని తర్వాత వచ్చిన సింకామ్ 3, మొట్టమొదటి భూస్థిర సమాచార ఉపగ్రహం.
 
అంగారక గ్రహంపై దిగిన ల్యాండర్లు, రోవర్లు, ప్రోబులూ భూమికి సమాచారాన్ని రిలే చెయ్యడం కోసం భూకక్ష్యల్లో ఉన్న అంతరిక్ష నౌకలను సమాచార ఉపగ్రహాలుగా వాడుకున్నాయి. ల్యాండర్లు తమ శక్తిని ఆదా చేసుకునే విధంగా ఈ నౌకలను తయారుచేసారు. ఈ నౌకల్లో ఉన్న అధిక శక్తిమంతమైన ట్రాన్స్‌మిట్టర్లు, యాంటెనాలూ ల్యాండర్లు పంపే సిగ్నళ్ళను బాగబాగా ఉద్దీపించి భూమికి పంపిస్తాయి. ల్యాండర్లు తమంత తాము నేరుగా అలా పంపలేవు.<ref>{{cite web|url=http://mars.jpl.nasa.gov/msl/mission/communicationwithearth/communication/|title=Communication: How the rover can communicate through Mars-orbiting spacecraft|website=Jet Propulsion Laboratory|access-date=21 January 2016}}</ref>
 
== ఉపగ్రహ కక్ష్యలు ==
Communications satellites usually have one of three primary types of [[:en:Orbit|orbit]], while other [[:en:List_of_orbits|orbital classifications]] are used to further specify orbital details.
* భూ స్థిర కక్ష్య: భూతలం నుండి 35,786 కి.మీ. ఎత్తున ఈ కక్ష్య ఉంటుంది. ఈ కక్ష్యకు ఒక విశిష్టత ఉంది: భూమ్మీదనుండి ఈ కక్ష్యలోని ఉపగ్రహాన్ని చూసే వ్యక్తికి ఉపగ్రహం ఎల్లప్పుడూ ఒకే స్థానంలో స్తిరంగాస్థిరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఉపగ్రహ కక్ష్యాకాలం భూభ్రమణ కాలంతో సమానంగా ఉండడమే దీనికి కారణం. దీనితో ఉన్న ప్రధాన ప్రయోజనం ఏంటంటే, భూమ్మీద దీన్ని అనుసరించే యాంటెన్నాలు ఒక స్థానంలో, ఒక దిశలో స్థిరంగా ఉంటాయి, ఉపగ్రహాన్ని ట్రాకింగు చెయ్యడం కోసం యాంటెన్నాల దిశను మార్చాలసిన అవసరం లేదు..
* [[భూ మధ్యస్థ కక్ష్య]]: ఈ కక్ష్యలు భూమి నుండి 2,000 -35,786 కి.మీ. దూరంలో ఉంటాయి.
* భూ నిమ్న కక్ష్య: మధ్యమ కక్ష్యలకు దిగువన ఉండే కక్ష్యలు భూ నిమ్న కక్ష్యలు. ఇవి భూతలం నుండి 160-2,000 కి.మీ. మధ్య ఎత్తులో ఉంటాయి.
మధ్యమ, నిమ్న కక్ష్యల్లో తిరిగే ఉపగ్రహాలు భూభమణ వేగంకంటే ఎక్కువ కోణీయ వేగంతో పరిభ్రమిస్తూంటాయి. అందుచేత భూస్థిర కక్ష్యలోని ఉపగ్రహాల్లా స్థిరంగా ఉండవు. భుమినుండిభూమినుండి చూసే పరిశీలకునికి అవి ఆకాశంలో ప్రయాణిస్తూ కనిపిస్తాయి. ఉపగ్రహం భూమి వెనక్కు వెళ్ళినపుడు సిగ్నలు అసలే అందదు. నిరంతర సమాచార ప్రసారాలు జరిగేందుకు గాను, ఈ కక్ష్యల్లో చాలా ఎక్కువ ఉపగ్రహాలు అవసరమౌతాయి. కనీసం ఒక్క ఉపగ్రహమైనా ఎల్లప్పుడూ కనబడుతూంటుంది. అయితే, భూమికి దగ్గరగా ఉండడం చేత సిగ్నలు శక్తి క్షీణత తక్కువగా ఉంటుంది.
 
=== భూ నిమ్న కక్ష్యలోని ఉపగ్రహాలు ===
{{Main|భూ నిమ్న కక్ష్య}}
[[File:Orbits_around_earth_scale_diagram.svg|link=https://en.wikipedia.org/wiki/File:Orbits_around_earth_scale_diagram.svg|thumb|ముదురు నీలం రంగులో భూ నిమ్న కక్ష్య ]]
భూ నిమ్న కక్ష్యలు భూతలం నుండి 2,000 కి.మీ. ఎత్తు వరకూ ఉండే వర్తుల కక్ష్యలు.<ref>{{Cite web|url=http://web.archive.org/web/20161227152355/http://www.universetoday.com/85322/low-earth-orbit/|title=Low Earth Orbit}}</ref> కక్ష్యాకాలం 90 నిముషాల వరకూ ఉంటుంది.
 
తక్కువ ఎత్తులో ఉండడం చేత ఈ కక్ష్యల్లోని ఉపగ్రహం 1,000 కి.మీ. వ్యాసార్థంగల వృత్త విస్తీర్ణంలో మాత్రమే కనిపిస్తుంది. పైగా, ఈ కక్ష్యల్లోని ఉపగ్రహాలు వేగంగా పరిభ్రమిస్తూ ఉండడం వలన, చాలా వేగంగా వీటి స్థానం మారుతూంటుంది. అందుచేత, నిరంతరాయ కనెక్టివిటీ ఉండాలంటే పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలుండాల్సిన అవసరం ఉంది.
పంక్తి 47:
 
=== భూ మధ్య కక్ష్య ===
భూతలం నుండి 2,000 నుండి 35,786 కి.మీ. మధ్య ఎత్తులో పరిభ్రమించే ఉపగ్రహాలు భూ మధ్య కక్ష్య ఉపగ్రహాలు. పనితీరులో ఇవి భూ నిమ్న కక్ష్య ఉపగ్రహాల్లాంటివే. భూ మధ్య కక్ష్య ఉపగ్రహాలు భూ నిమ్న కక్ష్య ఉపగ్రహాల కంటే ఎక్కువ సేపు కనబడతాయి -2 నుండి 8 గంటల సేపు ఇవి కనబడతాయి. ఇవి కవరు చేసే భూభాగం కూడా ఎక్కువే. ఎక్కువ సేపు కనబడడం, ఎక్కువ భూభాగాన్ని కవరు చెయ్యడం అనే ఈ రెండు కారణాల వలన, భూ మధ్య కక్ష్యలోని ఉపగ్రహాల ద్వారా ఏర్పాటు చేసే సమాచర నెట్‌వర్కు కోసం తక్కువ ఉపగ్రహాలు అవసరమౌతాయి. భూమి నుండి ఈ కక్ష్యల దూరం ఎక్కువగా ఉండడం వలన సిగ్నలు ప్రసాఅరానికి ఎక్కువ సమయం తీసుకోవడం, సిగ్నలు బలహీనంగా ఉండడం దీని ప్రతికూలతలు. అయితే భూస్థిర ఉపగ్రహాలతో పోలిస్తే ఈ ప్రతికూలత పెద్ద ఎక్కువేమీ కాదు.
 
భూ మధ్య కక్ష్య లోని ఉపగ్రహాలు సాధారణంగా 16,000 కి.మీ. ఎత్తున ఉంటాయి. వీటి పరిభ్రమణ సమయం 2 నుండి 112 గంటలు ఉంటంది.
పంక్తి 62:
 
==== ఉదాహరణలు ====
* 1964 ఆగస్టు 19 న మొట్టమొదటి భూ స్థిర ఉపగ్రహం సిన్‌కామ్‌ 3 ను ప్రయోగించారు. 1964 లో టోక్యోలో జరిగిన ఒలింపిక్ క్రీడలను పసిఫిక్ అవతలికి ప్రసారం చెయ్యడంతో దీని పని మొదలైంది. ఆ తరువాత కొద్దిరోజులకే 1965 ఏప్రిల్ 6 న ఇంటెల్‌సాట్ 1 అనే భూ స్థిర ఉపగ్రహాన్ని ప్రయోగించారు. దీన్ని అట్లాంటిక్ మహా సముద్రం మీదుగా ప్రసారాల కోసం ఉపయోగించారు.
* భారతదేశపు సమాచార వ్యవస్థ ఇన్‌సాట్, భూస్థిర కక్ష్యలోని సమాచార వ్యవస్థకు ఒక ఉదాహరణ. 1983 ఆగస్టులో ప్రయోగించిన ఇన్‌సాట్ 1బి ఉపగ్రహంతో ఇన్‌సాట్ వ్యవస్థ ఆపరేషన్ మొదలైంది. ఈ వ్యవస్థలో భాగంగా ఇప్పటివరకు 25 కు పైగా ఉపగ్రహాలను ప్రయోగించగా, ప్రస్తుతం వాటిలో 14 ఆపరేషన్‌లో ఉన్నాయి.
సమాచార ఉపగ్రహాలను తయారుచేసే సంస్థల్లో ప్రధానమైనవి: బోయింగ్ సాటిలైట్ డెవలప్‌మెంట్ సెంటరు, స్పేస్ సిస్టమ్స్/లోరల్, ఇస్రో, ఆర్బిటాల్ స్పేస్ సైన్సెస్, లాక్‌హీడ్ మార్టిన్, నార్త్‌రాప్ గ్రుమ్మన్, ఏస్ట్రియమ్.
పంక్తి 71:
[[మోల్నియా కక్ష్య|మోల్నియా కక్ష్యలు]], ఉన్నత అక్షాంశాల వద్ద అధిక ఎలివేషన్‌ను కలిగి ఉంటాయి. మోల్నియా ఉపగ్రహాలు తమ పరిభ్రమణ సమయంలో ఎక్కువ భాగం, ఉన్నత అక్షాంశాలపై విహరించేలా కక్ష్యను ఎంచుకుంటారు. ఆ సమయంలో భూమిపై దాని ముద్ర నిదానంగా కదులుతూ ఉంటుంది. మూడు మోల్నియా ఉపగ్రహాలతో ఈ ప్రాంతాలను నిరంతరాయంగా కవరేజీ చెయ్యవచ్చు.
 
1965 ఏప్రిల్ 23 న మోల్నియా కక్ష్యలోకి మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. దీని ద్వారా మాస్కోలోని టీవీ స్టేషన్ నుండి సిగ్నళ్ళను సైబీరియాకు, తూర్పు రష్యాలోని ప్రాంతాలకూ ప్రసారం చేసారు. 1967 లో రష్యా మోల్నియా ఉపగ్రహాలతో కూడిన సమాచార వ్యవస్థ, ''ఆర్బిటా'' ను తయారుచేసిది.
 
=== [[ధ్రువ కక్ష్య]] ===
పంక్తి 81:
* స్టేషన్ కీపింగ్ వ్యవస్థ: ఉపగ్రహాన్ని సరైన స్థాఅనంలో ఉంచేందుకు అవసరమైన సదుపాయాలు ఇందులో ఉంటాయి.
* విద్యుత్ ఉపవ్యవస్థ: దీనిలో సౌర ఘటాలు, బ్యాటరీలు ఉంటాయి.
* కమాండ్, కంట్రోలు వ్యవస్థ: భూమిపై ఉన్న నియంత్రణ కేంద్రాలతో ఉపగ్రహ సంపర్కాన్ని నిర్వహిస్తాయి. ఈ నియంత్రణ కేంద్రాలు ఉపగ్రహ పనితనాన్ని పరిశీలిస్తూ దాన్ని నియంత్రితస్తూ ఉంటాయి.
ఉపగ్రహ బ్యాండ్‌విడ్త్ సామర్థ్యం అందులో ఉన్న ట్రాన్స్‌పాండర్ల సంఖ్యను బట్టి ఉంటుంది. టీవీ, మౌఖిక, అంతర్జాల, రేడియో వంటి సేవల ప్రసారానికి ఒక్కొక్కదానికీ ఒక్కో బ్యాండ్‌విడ్త్ ఉండాలి.
 
"https://te.wikipedia.org/wiki/సమాచార_ఉపగ్రహం" నుండి వెలికితీశారు