సైకిల్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), కి → కి (4), కూడ → కూడా , బడినది. → బడింది., ఉన్న using AWB
చి →‎చరిత్ర: భాషాదోషాల సవరణ, typos fixed: ె → ే
పంక్తి 9:
వీధుల్లో కొత్త వాహనాన్ని ప్రదర్శించటం మూలాన అతని ఉద్యోగం ఊడటమే కాకుండా అతని పట్ల అంతటా ఉపేక్ష, తిరస్కార భావం ఏర్పడ్డాయి. 16 గంటల్లో వెళ్ళే దూరాన్ని కొత్త వాహనం సహాయంతో 4 గంటల్లోనే వెళ్ళగలిగాడు. ఈ నమూనా వాహనాలను తయారుచేయటానికి బేడన్ ప్రభుత్వం నుంచి అనుమతి కూడా పొందాడు. కానీ ఎవరూ ఇతణ్ణి గురించి పట్టించుకోలేదు. సొంత ఊరిలో కూడా ఇంతే. 1851 లో దుర్భర దారిద్ర్యంలో అతడు మరణించేసరికి ఇతడు కనిపెట్టిన వాహనాన్ని రైలు పట్టాలపై వెళ్లి మరమ్మత్తులు చేయటానికి, కార్యకలాపాలు పర్యవేక్షించటానికీ, మాత్రమే ఉపయోగిస్తుండేవారు. అయితే ఇంగ్లండ్, ఫ్రాన్స్, అమెరికా దేశాల్లో పెద్ద అంగలు వేసుకుంటూ ఈ వాహనం చాలా ముందుకు సాగిపోయింది.
 
మనిషి నడిచేటప్పుడు తన బరువును ఒక కాలి నుంచి మరో కాలికి మార్చటంలో ఎక్కువ శక్తిని వినియోగిస్తాడు. ముందుకు వెళ్ళుతున్నపుడు శరీరాన్ని ఒకే స్థితిలో స్థిరంగా ఉంచగల సాధనం నిర్మించటానికి వీలవుతుందా అని అతడు తన్ను తాను ప్రశ్నించుకొన్నాడు. ఇలాంటి వాహనాన్ని తయారుచేయాలన్న ఆలోచనే ఇదివరకు తట్టినట్టు లేదు. నిటారుగా ఉండటం అసాధ్యమని అందరూ అనుకునేవాళ్ళు. నిటారుగా ఉంచడం అనుకున్న దానికంటెదానికంటే చాలా తేలిక అని అతడు నిరూపించాడు. ఈ కారణం గానే ఈ "వింత వాహనం" ఫ్రాన్స్, ఇంగ్లండ్ దేశాల దృష్టిని ఆకర్షించింది.
 
హాబీ గుర్రాలు లేదా డాండీ గుర్రాలు అని పిలువబడే వాహనాలు పారిస్ నగర వీధుల్లోనూ, లండన్ హైడ్ పార్క్ లోనూ అసంఖ్యాకంగా తిరగటం మొదలైంది. తీరిక సమయాల్లో యువకులు, స్త్రీలు వీటిని వాడసాగారు. యువరాజు కూడా ప్రత్యేక వాహనాన్ని తయారుచేయించుకొని బహిరంగంగా దానిపై విహరించ సాగాడు. చూస్తుండగానే ఈ వాహనాల తయారీ గొప్ప పరిశ్రమగా రూపొందింది. ఇంగ్లండ్, అమెరికా పట్టణాల్లో ఈ కొత్త ఆట కోసం ప్రత్యేకంగా మందిరాలు నిర్మించారు. ప్రజలకు దీనిపట్ల మోజు విపరీతంగా పెరిగింది. దీన్ని గురించి హాస్య రచయితలు వ్యాసాలు రాశారు. కార్టూనిష్టులు బొమ్మలు గీశారు. అంత జరిగినా, సామాన్య ప్రజలకు ఉపయోగపడే కొత్త రవాణా సాధనంగా దీన్ని మలిచే ప్రయత్నం ఎవరూ చేయలేదు.
"https://te.wikipedia.org/wiki/సైకిల్" నుండి వెలికితీశారు