వేటూరి ప్రభాకరశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
 
==జీవిత విశేషాలు==
ప్రభాకరశాస్త్రి, [[కృష్ణా జిల్లా]], [[మోపిదేవి]] మండలములో [[కృష్ణా నది]] తీరమున ఉన్న [[పెదకళ్ళేపల్లి]]లో శ్రీవత్స గోత్రజులైన వేటూరి సుందరశాస్త్రి, శేషమ్మలకు మూడవ సంతానముగా [[1888]], [[ఫిబ్రవరి 7]] న అనగా సర్వజిత్ మాఖ బహుళ ఏకాదశి మంగళ వారం ఉదయం జేష్టా నక్షత్రం మిథున లగ్నమున జన్మించారు. ఈయనకు నలుగురు సోదరులు, నలుగురు సోదరీమణులు. తండ్రి సుందరశాస్త్రి [[ఆయుర్వేదం|ఆయుర్వేద]] వైద్యుడు. ప్రభాకరశాస్త్రి ప్రాథమిక విద్య స్వగ్రామములోనే సాగినది, తండ్రి వద్ద, మద్దూరి రామావధాని వద్ద సంస్కృతాంధ్రములను నేర్చుకొన్నారు. ఉపనయనమైన తర్వాత ప్రభాకరశాస్త్రిని ఆయన తండ్రి శాస్త్రాలు అభ్యసించడానికి [[చల్లపల్లి]]లోని అద్దేపల్లి సోమనాథశాస్త్రి వద్ద చేర్పించాడు.
 
16 యేళ్ల వయసులో, [[చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి]] [[బందరు]] ఉన్నత [[పాఠశాల]]<nowiki/>లో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారని తెలిసి కొందరు సహాధ్యాయులతో కలిసి అక్కడ చేరాడు. బందర్లో విద్యాభ్యాసము చేస్తున్న కాలములో ఈయన [[కొండా వెంకటప్పయ్య]] మరియు వల్లూరి సూర్యనారాయణరావుల ఇంట నివసించాడు. తెలుగులో తనకు తెలిసినదంతా చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రితో ముఖతః వినోదగోష్ఠిలో విని నేర్చుకున్నదేనని ఆ తరువాత ప్రభాకరశాస్త్రి చెప్పుకున్నాడు.
పంక్తి 44:
 
ప్రభాకరశాస్త్రి, [[తెలుగు]]<nowiki/>లో అనేక కావ్యములు రచించడముతో పాటు అనువాదాలు, వివరణా గ్రంథాలు రచించాడు. ఈయన ప్రాచ్యలిఖిత పుస్తకాలయములో అనేక తెలుగు గ్రంథాలను చారిత్రకాధారములతో సవివరముగా పరిష్కరించి ప్రకటించాడు.
 
==రచనాశైలి, రచనలు <ref>[http://www.teluguthesis.com/2015/09/veturi-prabhakara-shastri-writings.html వేటూరి ప్రభాకర శాస్త్రి గ్రంథావళి] (తెలుగుపరిశోధన వెబ్ సైట్ లో)</ref> ==
పిన్నవయసు శతావధాని, తొలితెలుగు పదం ‘నాగబు’ ఆవిష్కర్త, ‘కలికి చిలుక’ను పలికించిన కథకుడు, ‘కడుపు తీపు’, ‘దివ్యదర్శనం’, ‘మూణ్ణాళ్ల మచ్చట’, ‘కపోతకథ’ వంటి ఖండకావ్యాల విరచితుడు, విమర్శకాగ్రేసరుడు, కాలగర్భంలో కలిసిపోతున్న తెలుగు సంస్కృతీ చరిత్రను దక్షిణదేశమంతటా ఈది మరీ ఒడ్డుకు చేర్చిన సాహిత్య ఘనపాఠి.