గుంటుపల్లి (కామవరపుకోట): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 107:
క్రీ.పూ. 3-2వ శతాబ్దానికి చెందిన ఈ చైత్యం అతి ప్రాచీనమైనది. గుండ్రంగా ఉన్న ఈ గుహ లోపల స్తూపము (ప్రస్తుతం ధర్మ లింగేశ్వర శివలింగంగా భావిస్తున్నది), చుట్టూరా ప్రదక్షిణా మార్గం ఉన్నాయి. ఈ గుహ పైభాగంలో వాసాలు, ద్వారానికి కమానులు (చెక్క మందిరాలకు వలే) చెక్కబడి ఉన్నాయి. ఈ గుహాలయానికి [[బీహారు]]లోని సుధామ, లోమస్‌ఋషి గుహాలయాలతో పోలికలున్నాయి.బాగా మందంగా, లావుగా స్తంభం వలె ఉండే స్థాణువునే ధర్మలింగేశ్వర స్వామి అను లింగంగా పూజిస్తున్నారు. అయితే పేరులో ధర్మ శబ్దంసాధారణంగా బౌద్ధమునే సూచిస్తుంది.అమరావతి (ధాన్యకటకం), భట్టిప్రోలు మొదలయిన బౌద్ధక్షేత్రాల్లో లభించిన ధవళ స్తంభం వంటి స్తంభంపై ఇక్కడ లభించిన శాసనం బట్టి చుస్తే ఇది జైనక్షేత్రమని పలువురి పరిశోధకుల అభిప్రాయము. ఆస్తంభం పై ఇలా వ్రాసి ఉన్నది" మహారాజస, కళింగాధిప, మహిషకాధిపస, మహామేఖవాహనస, సిరిసనదస, లేఖకస చులగోమస మణ్డపోదానమ్- ఒరిస్సా హాధిగుంఫా (హస్తిగుహ) శాసనంలో కళింగరాజు ఖారవేలుని సైన్యాలు పశ్చిమంగా కృష్ణానదివైపు వెళ్ళి ఆవమూషికులతో (తెలుగునాటివారే) పోరినట్లు ఇందు అభిప్రాయము. లిపిని బట్టి ఇది క్రీ.పూ.2వ శతాబ్దకాలమునది తెలియుచున్నది.ఇక్కడ ఉన్న స్తూపాలలో ఒకదానికి ఇటికి ఆవకవేదిక ఉన్నదట. దానిపైకి వెళ్ళెందుకు ఉన్న రాతిమట్లపై శిధిలాక్షరాలు సునద అనే ఆమె సుయజ్ఞనాధుని ఆనతన ఆ మెట్లు కట్టించెనని ఉన్నది.అలగ్జాండర్ రియా అనే పురావస్తు అధికారి ప్రప్రధంగా ఈ స్తూపాలను గుర్తించారు.చైతన్యాలయంతో పాటు పెద్ద శిలాస్తూపం కూడా ఆయన పరిసోధనే. ఈ పెద్ద శిలా స్తూపం(ధర్మలింగేశ్వర) చుట్టూ ప్రదక్షిణమార్గం కలదు.ఇది 8 అడుగుల ఎత్తులో కలదీ స్తూపము. ప్రదక్షిణ చేసినట్లుగా చుట్టు రాతిమెట్లు ఉండటం ఇక్కడ విశేషము.సాధారణంగా బౌద్ధక్షేత్రాల్లో ఆరాధనీయం స్తూపం. కాని ఇక్కడ ఆస్థానంలో ఎత్తయిన ఇటికలవేదిక (సింహాసనం) ఉండిన సూచనల్లో ఆరాధ్యమూర్తిని వేదికపైన వుంచేవారనిపిస్తుంది. ఈవేదిక ముందు భాగాన మూడు గుళ్ళలో పూజనీయులైన ఆచార్యుల రూపాలో, సాంకేతిక రూపాలో ఉండెవేమో అని అనుకొనవచ్చును! ఈ ఇటిక చైత్యం అమరావతి జగ్గయ్యపేట మొ.క్షేత్రాలలోని చైత్యాలయాలను పోలిఉన్నందున ఈ ఇటికిల చైత్యాలయాలు క్రీ.శ.2వ శతాబ్ది కాలనికి నిర్మింపబడి ఉండవచ్చును. సాతవాహనుల ఆచార్యుడు నాగార్జుని నాటిది.
 
ఈగుహాలయం ముఖద్వారం పురాతన్పురాతన బౌద్ధరామాల వలెనె గుర్రపులాడా(అర్ధచంద్రాకారం) కలిగి ఉన్నది.బీహారులోని బారాబర్ లోమశఋషి గుహాలయ ముఖద్వారం పోలికలోనే ఈముఖద్వారం నిర్మించబడినది.అయితే ఒకటే బేధం ఇక్కడ ముఖద్వారం ముందు ఉంటే అక్క వెనక ఉన్నది.అక్కడ అలంకార శిల్పం ఉన్నది ఇక్కడ లేదు.మహారాష్ట్రలోని భాజ గుహాలయ ముఖద్వారం కూడా ఇక్కడ ముఖద్వారం వలెనే ఉండును. క్రీ.పూ. 250 తర్వాతనే [[అశోకుడు]] గుహాలయ నిర్మాణకార్యక్రమాలు చేపట్టినాడు.పోలికలను బట్టి గుంటుపల్లి బారాబర్ గుంఫలు రెండును అశోకుని కాలమునటివనే చెప్పవచ్చును.అశోకుడు బౌద్ధం అవలింబించిక పూర్వమే (క్రీ.పూ.250) ఆంధ్రంలో బౌద్ధం కలదు.అతిపురాతనమైన స్తూపాలు ఎత్తు తక్కువగా ఉండి ఎక్కువ స్థూలంగా ఉండే వంటారు. ఆలెక్కను పోల్చి చూస్తే ఇక్కడి స్తూపాలు బహుపురాతనమైనవని మరికొందరి పరిశోధకుల అభిప్రాయము.
 
మన ఇక్షాకుల అనంతరం వేంగి నేలినది సాలంకాయనులు. వారి రాజధాని విజయవేంగీపురం. నేటి [[ఏలూరు]] తాలూకా వేగిదిబ్బలు. వారు బౌద్ధులుకారు. సూర్యోపాసకులు. కాని బౌద్ధవిరోధులు కారనే విషయం వారి పాలన కాలంలో గుంటుపల్లి క్షేత్రాలకు-తూర్పున బర్మాప్రాంతాలకు యాత్రికులు సుముద్రయానం చేసేవారని వైనమున్నది.ఆరేవు బంగాళాఖాతంలో కలిసిపోయినందునదని పరిశొధకుల అభిప్రాయం.అది నేటి కళింగ పట్నం.