బెంగుళూరు నాగరత్నమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి భాషాదోషాల సవరణ, typos fixed: అక్టోబర్ 27, 1921 → 1921 అక్టోబర్ 27 (2), అక్టోబర్ → అక్టోబరు, ఉన్నది. → ఉంద using AWB
చి +{{Authority control}}
పంక్తి 15:
}}
 
'''[[బెంగుళూరు నాగరత్నమ్మ]]''' ([[నవంబరు 3]], [[1878]] - [[మే 19]], [[1952]]) భరత నాట్యానికి, [[కర్ణాటక సంగీతము]]నకు, అంతరించిపోతున్న భారతదేశ [[కళ]]లకు ఎనలేని సేవ చేసి అజరామరమైన కీర్తి సాధించిన మహా వనిత. ఏటికి ఎదురీది, పట్టుదలతో తాదలచిన [[కార్యము]]<nowiki/>లు సాధించి తరువాయి తరముల మహిళలకు ఆదర్శప్రాయురాలైన గొప్ప విదుషీమణి. భోగినిగా జీవితము ఆరంభించి, తరువాత రాగిణిగా మారి, పిదప విరాగిణియై, చివరకు యోగినిగా తన బ్రతుకు ముగించింది.
 
==జననము==
పంక్తి 35:
==త్యాగరాజ సేవ==
 
నాగరత్నమ్మకు ఒక కూతురుండేది. చిన్నవయసులోనే చనిపోయింది. పిల్లలపై మమకారముతో ఒక పిల్లను పెంచుకున్నది. ఆస్తిపై కన్నేసిన పిల్ల తల్లిదండ్రులు నాగరత్నమ్మకు పాలలో [[విషం|విషము]] కలిపి ఇప్పిస్తారు. భయపడిన చిన్నపిల్ల పాలగ్లాసును జారవిడిచి నిజము చెప్పేస్తుంది. ఈ విషయము నాగరత్నమ్మ మనసును కలచివేసి ఐహికవిషయాలపై విరక్తిని కలుగచేసింది. శేషజీవితము త్యాగరాజస్వామి వారి సేవలో గడపాలని నిశ్ఛయించింది. తిరువయ్యారుకి మకాము మార్చింది. [[కావేరి నది|కావేరీ నది]] ఒడ్డున త్యాగరాజస్వామి వారి [[సమాధి]] శిథిలావస్థలో ఉంది. ఆ స్థలాన్ని దాని చుట్టు ఉన్న ప్రదేశాన్ని తంజావూరు రాజుల ద్వారా, రెవిన్యూ అధికారుల ద్వారా తన వశము చేసికొని పరిశుభ్రము చేయించి, [[గుడి]], [[గోడలు]] కట్టించింది. [[చెన్నై|మదరాసు]] ఇంటిని అమ్మి రాత్రనక పగలనక వ్యయప్రయాసల కోర్చి [[దేవాలయం|దేవాలయ]] నిర్మాణాన్ని ముగించింది. 1921 అక్టోబరు 27లో పునాదిరాయిని నాటగా, 1925 జనవరి 7న గుడి కుంభాభిషేకము జరిగింది. స్థలాభావము వలన ఇంకా నేల కొని ఒక మంటపము, [[పాకశాల]] 1938లో నిర్మించింది. ఈ నిర్మాణములతో ఆమె సంపద, ఆభరణాలు హరించుకుపోయాయి. 1946లో త్యాగయ్య చిత్ర నిర్మాణసందర్భములో [[చిత్తూరు నాగయ్య]] గారు నాగరత్నమ్మను కలిశారు. ఆమె సలహాపై నాగయ్య గారు త్యాగరాజనిలయం అనే సత్రాన్ని కట్టించారు.
 
==సంగీత సేవ==
పంక్తి 62:
* శ్రీరామ్ గారి పుస్తకము: The Devadasi and the Saint: The Life and Times of Bangalore Nagarathnamma, 2008, V. Sriram, East West Press, Madras, ISBN : 9788188661701
* [http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=9770 గృహలక్ష్మి మాసపత్రిక మార్చి 1949 సంచిక]
 
{{Authority control}}
 
[[వర్గం:1878 జననాలు]]