ధూర్జటి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి +{{Authority control}}
పంక్తి 24:
ఇతనిని ''పెద్ద ధూర్జటి'' అని అంటారు, ఎందుకంటే ఇదే పేరుతో ఇంకో నలుగురు ధూర్జటులు ఉన్నారు.
 
ధూర్జటి 16వ శతాబ్దము ఉత్తర భాగములో 1480 నుండి 1545 వరకు జీవించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈయన ఆనాటి [[పొత్తపి సీమ]] లోని, ప్రస్తుతం [[చిత్తూరు జిల్లా]] లో ఉన్న [[శ్రీకాళహస్తి]] పట్టణ వాస్తవ్యుడు. ఈయన తల్లితండ్రులు సింగమ మరియు రామనారాయణ. ఈయన తాత పేరు జక్కయ నారాయణ. వీరి పేర్లను బట్టి ధూర్జటి జన్మత: వైష్ణవుడైనా ఆ తరువాత కాలములో గొప్ప శివభక్తుడైనాడని భావిస్తున్నారు.
 
ధూర్జటి అష్టదిగ్గజములలో ప్రధానమైనవాడు. [[భక్తి]] ప్రబంధమైన [[శ్రీకాళహస్తి మహత్యం]] మరియు శైవ శతకమైన [[శ్రీకాళహస్తీశ్వర శతకం]] ఈయన యొక్క రెండు ప్రధాన రచనలు. ఆయా రీతులలో ఇవి మహోన్నత కావ్యాలు. ధూర్జటి చెప్పినవి మరియు ధూర్జటిపై చెప్పబడినవిగా అనేక [[చాటువులు]] [[ఆంధ్రదేశము]]లో ప్రచారములో ఉన్నవి.
పంక్తి 35:
:బడయన్; నేరక పెక్కు దైవంబులకుం బప్పుల్, ప్రసాదంబులుం,
:గుడుముల్, దోసెలు, సారె సత్తు, లటుకుల్, గుగ్గిళ్ళునుం బెట్టుచుం
:జెడి యెందుం గొఱగాక పోదు రకటా శ్రీ కాళహస్తీశ్వరా!
 
 
:మును నేఁ బుట్టిన పుట్టులెన్ని గలవో ? మోహంబుచే నందుఁ జే
:సిన కర్మంబుల ప్రోవులెన్ని గలవో ? చింతించినంగాన నీ
:జననంబేయని యున్న వాడ, నిదియే చాలింపవే నిన్నుఁ గొ
:ల్చిన పుణ్యంబునకుం గృపారతుడవై శ్రీ కాళ హస్తీశ్వరా !
 
 
:సంతోషించితిఁ జాలుఁ జాలు రతిరాజద్వార సౌఖ్యంబులన్
:శాంతింబొందితిఁ జాలుఁ జాలు బహురాజద్వార సౌఖ్యంబులన్
:శాంతింబొందెదఁ జూపు బ్రహ్మపదరాజద్వార సౌఖ్యంబు ని
:శ్చింతన్ శాంతుఁడ నౌదు నీ కరుణచే శ్రీ కాళహస్తీశ్వరా!
 
 
* [[శ్రీ కాళహస్తి మహాత్మ్యము]] నుండి
Line 56 ⟶ 52:
:బ్రాఁతిమెయిన్ మెసంగితివి, భక్తుఁడు కుంటెనఁ బంపఁబోతి, మై
:పూఁత యొనర్చుకొంటి శవ భూతిఁ, గపాలమునన్ భుజించి, తీ
:రోఁతలు పెక్కులుండ నివి రోయుదువే, యిఁక భక్తవత్సలా!"
 
 
:ఓ సామీ ఇటువంటి కొండ దరిలో, నొంటింబులుల్, సింగముల్
Line 63 ⟶ 58:
:యాసం గట్టితి వేటిగడ్డ నిలు? నీవాఁకొన్నచోఁ గూడు నీ
:ళ్ళే సుట్టంబులు దెచ్చి పెట్టెదరు? నీకిందేటికే లింగమా
 
{{Authority control}}
 
[[వర్గం:తెలుగు కవులు]]
"https://te.wikipedia.org/wiki/ధూర్జటి" నుండి వెలికితీశారు