ప్రతిభా రాయ్: కూర్పుల మధ్య తేడాలు

కొన్ని సవరణలు
చి +{{Authority control}}
పంక్తి 39:
== జీవిత విశేషాలు ==
ఆమె 1943 జనవరి 21 న [[ఒడిషా]] రాష్ట్రంలోని [[కటక్ జిల్లా]] లోని పూర్వపు ప్రాంతమైన జగత్సింగపూర్ నకు చెందిన బలికుడ లోని మారుమూల గ్రామమైన ఆలబాల్ లో జన్మించింది. <ref>{{cite web|url=http://indiatoday.intoday.in/story/odia-writer-pratibha-ray-named-for-jnanpith-award/1/239724.html|title=Odia writer Pratibha Ray named for Jnanpith Award : East, News – India Today|accessdate=28 December 2012|work=indiatoday.intoday.in|last=|first=|year=2012|quote=She was born to a Gandhian teacher on January 21, 1943, at Alabol village.}}</ref> [[మూర్తిదేవి పురస్కారం]] అందుకున్న మహిళలలో ఆమె ప్రథమురాలు. ఆమెకు ఈ పురస్కారం 1991లో వచ్చింది.<ref>{{cite web|url=http://www.hindu.com/lr/2007/04/01/stories/2007040100260600.htm|title=The Hindu : Literary Review / Personality : 'The sky is not the limit'|accessdate=28 December 2012|work=hindu.com|last=Balakrishnan|first=Hariharan|year=2007|quote=first woman to win the Jnanpith Moorti Devi Award.}}</ref>
 
 
 
ఆమె సమకాలీన [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో ఒక ప్రముఖ కాల్పనిక రచనల కర్త. ఆమె తన [[మాతృభాష]] [[ఒడియా భాష|ఒడియా]]<nowiki/>లో [[నవలా సాహిత్యము|నవల]]<nowiki/>లు, చిన్న కథలను రాస్తుంది. ఆమె రాసిన నవలలలో మొదటి నవల "బర్షా బసంత బైశాఖ (1974)"<ref>{{cite web|url=http://www.orissadiary.com/ShowOriyaOrbit.asp?id=38514|title=Odisha: Eminent fiction writer Dr Pratibha Ray to receive coveted Jnanpith Award, Oriya Orbit|accessdate=28 December 2012|work=orissadiary.com|last=|first=|year=2012|archiveurl=https://archive.is/20130111071719/http://www.orissadiary.com/ShowOriyaOrbit.asp?id=38514|archivedate=11 January 2013|deadurl=yes|quote=her first novel as a novice, titled "Barsha-Basanta-Baishakha" (The Rain, Spring and Summer, 1974) which immediately captured the hearts of Odia readers.|df=dmy-all}}</ref> అత్యధికంగా అమ్ముడయింది.
Line 46 ⟶ 44:
తొమ్మిదేళ్ల వయస్సులో ఆమె సాహితీ రంగంలో అడుగుపెట్టిన నాటి నుండి "సమానత్వం ఆధారంగా సామాజిక క్రమం, ప్రేమ, శాంతి, సమైక్యత" వంటి అంశాలపై శోధిస్తూ వాటిని కొనసాగిస్తూ ఉంది. సమానత్వం ఆధారంగా కుల, మత, లేదా లింగ వివక్ష లేకుండా సామాజిక అంశాలపై రాస్తూంటే, ఆమె విమర్శకులలో కొందరు ఆమెను కమ్యూనిస్టుగా, మరికొందరు స్త్రీవాదిగా చిత్రీకరించారు. కానీ ఆమె తనను తాను మానవతా వాదిగా అభివర్ణించుకుంటుంది.
 
సమాజ ఆరోగ్యకరమైన పనితీరు కోసం పురుషులు, మహిళలు విభిన్నంగా సృష్టించబడ్డారు. మహిళలకు గల ప్రత్యేకతలను వారు మరింత పెంచుకోవాలి. ఒక మానవునిగా స్త్రీ, పురుషుడు సమానమే. ఆమె తన వివాహం అయిన తరువాత కూడా రచనా ప్రస్థానాన్ని కొనసాగించింది. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఆమె మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, పి.హెచ్.డి (విద్యా మనోవిజ్ఞానశాస్త్రం) లను పూర్తిచేసింది. ఆమె ఒడిశాలోని ఆదిమ గిరిజన తెగల గూర్చి పరిశోధించి "ట్రైబలిజం, క్రిమినాలజీ ఆఫ్ మాండో హైలాండర్" అనే అంశంపై పోస్టు డాక్టరల్ పరిశోధనను చేసింది.
 
== జీవితం ==
Line 52 ⟶ 50:
 
== ఇతర సేవలు ==
 
 
ఆమెకు సంఘ సంస్కరన అంటే ఆసక్తి ఎక్కువ. ఆమె అనేక సందర్భాలలో సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడింది. అందులో ముఖ్యమైన సంఘటన [[పూరీ పట్టణం|పూరీ]] [[పూరీ జగన్నాథ దేవాలయం|జగన్నాథ దేవాలయం]]<nowiki/>లో జరిగింది. ఆమె ఆ దేవాలయంలోని పూజారులు దేవాలయ ప్రవేశంలో వర్ణ వివక్ష (కుల/మత) పాటిస్తున్నందున దానికి వ్యతిరేకంగా పోరాడింది. పూజారుల అవాంఛనీయ ప్రవర్తనకు వ్యతిరేకంగా వార్తా పత్రికలో "ద కలర్ ఆఫ్ రెలిజియన్ ఈస్ బ్లాక్" (''ధర్మార రంగ కళ'') శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు ఆమె ఆ కథనానికి వ్యతిరేకంగా పూజారులు వేసిన పరువు నష్టం కేసుపై పోరాడుతోంది. 1999 అక్టోబరులో [[ఒడిషా|ఒడీశా]]<nowiki/>లో సంభవించిన తుఫానుకు గురైన ప్రాంతాలను ఆమె సందర్శించింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అనాథల, [[వితంతువు]]<nowiki/>ల పునరావాసం కోసం కృషి చేస్తోంది.
Line 61 ⟶ 58:
 
== సభ్యత్వాలు ==
ఆమె అనేక అధ్యయన సమాజాలలో సభ్యురాలిగా ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చురల్ రిలేషన్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్, నేషనల్ బుక్ ట్రస్టు ఆఫ్ ఇండియా, సెంట్రల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ మొదలైన సంస్థలతో సంబంధం కలిగి ఉంది. ఆమె దేశ విదేశాలలో పర్యటనను చేసి వివిధ విద్యా సదస్సులలో పాల్గొంది. ఆమె రాసిన సృజనత్మక రచనలకు గాను అనేక జాతీయ, స్టేట్ పురస్కారాలు పొందింది.
 
== కొన్ని రచనలు ==
Line 146 ⟶ 143:
{{మూలాలజాబితా}}
{{జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు |state=expanded}}
 
{{Authority control}}
 
[[వర్గం:జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రతిభా_రాయ్" నుండి వెలికితీశారు