మొరార్జీ దేశాయి: కూర్పుల మధ్య తేడాలు

చి భాషాదోషాల సవరణ, typos fixed: → (14) using AWB
చి +{{Authority control}}
పంక్తి 54:
=== స్వాతంత్ర్య సమరయోధుడు ===
అతను మహాత్మాగాంధీ అధ్వర్యంలో జరిగిన [[భారత స్వాతంత్ర్యోద్యమము|భారత స్వాతంత్ర్యోద్యమం]]<nowiki/>లో చేరాడు. భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన [[శాసనోల్లంఘన|శాసనోల్లంఘన ఉద్యమం]]<nowiki/>లో పాల్గొన్నాడు. స్వాతంత్ర్యోద్యమ కాలంలోఅనేక సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాడు. తన తెలివైన నాయకత్వ నైపుణ్యాలు, కఠినమైన చైతన్యం కారణంగా అతను స్వాతంత్ర్య సమరయోధులందరికీ అభిమాని అయ్యాడు. [[గుజరాత్|గుజరాత్ ప్రాంతం]]<nowiki/>లో భారత జాతీయ [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్‌ ]]కు ముఖ్యమైన నాయకుడయ్యాడు.1934, 1937 లలో ప్రాంతీయ ఎన్నికలు జరిగినప్పుడు, అతను బొంబాయి ప్రెసిడెన్సీలో వరుసగా రెవెన్యూమంత్రి, హోంమంత్రి బాధ్యతలను చేపట్టాడు.
 
 
== ప్రభుత్వంలో ==
Line 60 ⟶ 59:
=== బాంబే ముఖ్యమంత్రి, రెండు రాష్ట్రాల విభజన ===
[[దస్త్రం:Desai1937.jpg|ఎడమ|thumb|199x199px|బొంబాయి ప్రెసెడెన్సీలో హోం మంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్ - 1937 ]]
భారత దేశానికి స్వాతంత్ర్యం రాకముందు, అతను బొంబాయి సంస్థానానికి హోం మంత్రి అయ్యాడు. 1952లో బొంబాయి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. బొంబాయి రాష్ట్రం ద్వి భాషా రాష్ట్రంగా ఉండేది. బొంబాయి రాష్ట్రంలో గుజరాత్, మరాఠీ భాషలు మాట్లాడే ప్రజలు ఉండేవారు. 1956 నుండి సంయుక్త మహారాష్ట్ర సమితి పేరుతో ఒక క్రియాశీలక సంస్థ ఏర్పడి కేవలం మరాఠీ మాట్లాడే ప్రజల కోసం మహారాష్ట్ర రాష్ట్రం కోసం ఉద్యమాన్ని చేపట్టింది. ఒక దృఢమైన జాతీయవాదిగా అతను అటువంటి ఉద్యమాలను వ్యతిరేకించాడు. వాటిలో ప్రత్యేక గుజరాత్ రాష్ట్ర సాధన కోసం ఇందూలాల్ యాగ్నిక్ అధ్వర్యంలో మహాగుజరాతీ ఉద్యమం కూడా ఉంది. వివిధ భాషా, సాంస్కృతిక, మతపరమైన నేపథ్యాలతో అనేక తరాలుగా దీర్ఘకాలం స్థిరపడిన పౌరులు ఉన్నందున దేశాయ్ ముంబయి మహానగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం లేదా సార్వజనీన స్వభావం గల ప్రత్యేక అభివృద్ధి ప్రాంతంగా మార్చాలని ప్రతిపాదించాడు. గాంధీ భావాలకు వ్యతిరేకంగా ఫ్లోరా ఫౌంటైన్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేసేందుకు చేరుకున్న " సమైక్య మహారాష్ట్ర సమితి" ముంబై శాఖకు చెందిన ప్రదర్శనకారులపై కాల్పులు జరిపేందుకు పోలీసులు ఆదేశించాడు. నిరసనకారులను "సేనాపతి బాపట్" నేతృత్వం వహించాడు. దేశాయ్ ఆదేశంతో జరిగిన కాల్పుల సంఘటనలో 11 సంవత్సరాల బాలికతో సహా 105 మంది ఆందోళనకారులు మరణించారు. ఈ సంఘటన సమస్య తీవ్రతను మరింత పెంచి, భాష ఆధారంగా రెండు వేర్వేరు రాష్ట్రాలకు అంగీకరించడానికి ఫెడరల్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. మహారాష్ట్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత బొంబాయి (ప్రస్తుతం ముంబై) దాని ముఖ్యపట్టణం అయినది. ఉద్యమం జరిగిన ఫ్లోరా ఫౌంటెన్ ప్రాంతం 105 మంది ఉద్యమకారుల త్యాగాలను గుర్తిస్తూ "హతత్మా చౌక్" (మరాఠీ భాషలో "మేర్థీర్స్ స్క్వేర్") గా పేరు మార్చబడింది. తరువాత దేశాయ్ [[జవాహర్ లాల్ నెహ్రూ|జవహర్ లాల్ నెహ్రూ]] ప్రధానమంత్రిగా ఉన్న కేబినెట్ లో హొం మంత్రి బాధ్యతలను చేపట్టాడు.
 
=== హోం మంత్రిగా ===
హోం మంత్రిగా దేశాయ్, సినిమాలు, థియేటర్ ప్రొడక్షన్లలో నటిస్తున్న పాత్రల అసభ్యకర సన్నివేశాలను ("ముద్దు" సన్నివేశాలతో పాటు) చట్ట పరంగా బహిష్కరించాడు.
 
ధృఢమైన గంధేయవాదిగా దేశాయ్, ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ సోషలిస్టు విధానాలకు వ్యతిరేకంగా సామాజిక సంప్రదాయవాదిగా, అనుకూల-వ్యాపార, ఉచిత సంస్థ సంస్కరణలకు అనుకూలంగా ఉన్నాడు. కాంగ్రెస్ నాయకత్వంలో ఎదిగిన అతను, అవినీతి వ్యతిరేక అంశాలతో తీవ్ర జాతీయవాదిగా, ప్రధానమంత్రి నెహ్రూ, అతని మిత్రపక్షాలను విభేదించాడు. కాంగ్రెస్ పార్టీలో జాతీయ నాయకుడైనా ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ తోను అతని సహచరులతోను విభేదాలుండేవి. నెహ్రూ వయస్సురీత్యా ఆరోగ్యం క్షీణించడంతో ప్రధానమంత్రి పదవికి ప్రధాన పోటీదారుడయ్యాడు. 1964 లో నెహ్రూ మరణాంతరము తను ప్రధానమంత్రి రేసులో ఉన్నా నెహ్రూ అనుచరుడు [[లాల్ బహాదుర్ శాస్త్రి|లాల్ బహాదూర్ శాస్త్రి]] ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. 18 నెలల తరువాత 1966ల ప్రారంభంలో ఊహించని విధంగా లాల్ బహాదూర్ శాస్త్రి తాష్కెంట్ లో మరణించిన తదుపరి మొరార్జీ దేశాయ్ అగ్రస్థానంలో ఉన్న నాయకునిగా ప్రధాని రేసులో ఉన్నాడు. అయినప్పటికీ నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీతో నెగ్గలేక 169/351 ఓట్ల తేడాతో వెనుదిరగవల్ససి వచ్చింది. దేశాయ్ ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఉప ప్రధానమంత్రిగా సేవలనందించాడు. అతను భరత హోం మంత్రిగా 1969 వరకు కొనసాగాడు. తరువాత ఆర్థిక శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆ కాలంలో ఇందిరా గాంధీ 14 పెద్ద బ్యాంకుల జాతీయకరణ జరిగింది. ఈ కారణంగా అతను ఇందిరా గాంధీ కేబినెట్ కు రాజీనామా చేసాడు.
 
కాంగ్రెస్ పార్టీ విభజన తరువాత మోరార్జీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఆర్గనైజేషన్) పార్టీలో చేరాడు. ఇందిరా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ (రూలింగ్) అని పిలిచే ఒక నూతన విభాగాన్ని ఏర్పాటు చేసింది. ప్రత్యామ్నాయంగా, దేశాయ్, ఇందిరా గాంధీల రెండు విభాగాలు సిండికేట్ అండ్ సిండికేట్ అని వరుసగా పిలువబడ్డాయి. 1971 సార్వత్రిక ఎన్నికలలో ఇందిరా గాంధీ విభాగం కొద్ది సీట్ల తేడాతో గెలిచింది. మొరార్జీ దేశాయ్ పార్లమెంటు సభ్యునిగా లోక్‌సభకు ఎన్నికయ్యాడు. మొరార్జీ గుజరాత్ లోని నవనిర్మాణ ఉద్యమానికి మద్దతుగా 1975 మార్చి 12 న జరుగుతున్న నిరవధిక నిరాహార దీక్షకు వెళ్లాడు.<ref name="avk">{{Cite book|url=https://books.google.com/books?id=8v7Vr2iQUHkC&pg=PA120&dq=navnirman+gujarat&hl=en&sa=X&ei=CQeuUOSTBM-trAfR7oGwDQ&ved=0CDEQ6AEwATgK#v=onepage&q=navnirman%20gujarat&f=false|title=India Since Independence: Making Sense of Indian Politics|last=Krishna|first=Ananth V.|publisher=Pearson Education India|year=2011|isbn=9788131734650|page=117|accessdate=22 November 2012}}</ref>
Line 72 ⟶ 71:
 
=== ఎమర్జెన్సీ కాలంలో ===
[[లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్]] నాయకత్వంలో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమం, 1977 ఎమర్జెన్సీ వ్యతిరేకతతో ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తన సీట్లను కోల్పోవలసి వచ్చింది. 1975 లో విధించబడిన అత్యవసర పరిస్థితి 1977 ఫిబ్రవరి - మార్చి నెలలలో జరిగన ఎన్నికలలో తీవ్ర ప్రభావాన్ని చూపింది. 30 సంవత్సరాలపాటు నిరంతరాయంగా సాగిన కాంగ్రెస్ పాలన అంతమయింది. కాంగ్రసేతర ప్రభుత్వం అధికారం చేపట్టింది. కాంగ్రెస్ (ఒ), భారతీయ లోక్ దళ్, [[జనసంఘ్]], సోషలిస్టు పార్టీలు "జనతాపార్టీ" పేరుతో ఒకటయ్యాయి. మొరార్జీ దేశాయ్ ఆ పార్టీ అధ్యక్షుడయ్యాడు. మాజీ మంత్రి జగజ్జీవన్ రామ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి డెమొక్రటిక్ కాంగ్రెస్ అనే కొత్త పార్టీ స్థాపించాడు. జనతాపార్టీతో ఒక అవగాహనకు వచ్చాడు. ఫిబ్రవరి 16 - మార్చి 10వ తేదీ మధ్య జరిగిన ఎన్నికలలో జనతాపార్టీ దాని మిత్రపక్షాలు మెజారిటీ సాధించాయి. [[ఇందిరాగాంధీ]]- రాయ్ బెరీలో ఒడిపోయింది. మార్చి 21వ తేదీ అత్యవసర పరిస్థితి పసంహరించుకోబడింది. మార్చి 24వ తేది మొరార్జీ దేశాయి ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
 
== భారతదేశ ప్రధానమంత్రి (1977-79) ==
Line 80 ⟶ 79:
 
=== మొదటి అణు పరీక్ష ===
1974 లో భారతదేశం మొట్టమొదటి అణు పరీక్ష జగిగినప్పటికి, భారతదేశ అణు రియాక్టర్లను "దేశంలో అణు బాంబుల కోసం ఎప్పటికీ ఉపయోగించరు, నేను సహాయం చేయగలిగితే దానిని చూస్తాను" అని దేశాయ్ తెలిపాడు. <ref name="The World: Morarji Desai: The Ascetic Activist">{{cite web|url=http://www.time.com/time/magazine/article/0,9171,947858-2,00.html|title=The World: Morarji Desai: The Ascetic Activist|accessdate=19 March 2014}}</ref> 1977 లో, యు.ఎస్ అధ్యక్షుడు కార్టర్ పాలనా యంత్రాంగం భారత్‌కు భారజలం, యురేనియం పదార్థాలను భారత దేశంలోని అణు రియాక్టర్ల కొరకు అమ్మివేయాలని ప్రతిపాదించింది కానీ అణు పదార్థాల వినియోగంలో అమెరికన్ ఆన్-సైట్ తనిఖీ అవసరం అని తెలిపింది. దీనిని దేశాయ్ వ్యతిరేకించాడు.<ref name="Nation: Jimmy's Journey: Mostly Pluses">{{cite web|url=http://www.time.com/time/magazine/article/0,9171,919248-3,00.html|title=Nation: Jimmy's Journey: Mostly Pluses|accessdate=19 March 2014}}</ref> 1974 లో ఆశ్చర్యకర అణు పరీక్ష నిర్వహించిన అనంతరం ప్రధాన అణు శక్తులు లక్ష్యంగా చేసుకున్న తరువాత దేశీయంగా, అతను భారతీయ అణు కార్యక్రమంలో కీలక పాత్ర పోషించాడు. మొరార్జీ దేశాయ్ భారతదేశ ప్రధాన గూఢచార సంస్థ "రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్" (R & AW) ను, దాని బడ్జెట్, కార్యకలాపాలను తగ్గించడం ద్వారా మూసివేసాడు. అతను 1990 లో పాకిస్థాన్ అధ్యక్షుడు గులాం ఇస్తాక్ ఖాన్ నుండి పాకిస్థాన్ అత్యున్నత పౌర పురస్కారం 'నిషాన్-ఇ-పాకిస్థాన్" పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ పాకిస్థాన్ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయునిగా గుర్తింపు పొందాడు. తరువాత, అతని విధానాలు దేశంలో సామాజిక, ఆరోగ్య,పరిపాలనా సంస్కరణలను ప్రోత్సహించాయి. పాకిస్థాన్ లో అణుపరీక్ష చేస్తున్న కహుటా నుండి పాకిస్థాన్ జనరల్ ముహమ్మద్ జియా-ఉల్-హక్ కు జరిగిన టెలీఫోన్ సంభాషణ గురించి R&AW కు తెలుసునని అతను వెల్లడించాడు. <ref name="ReferenceA">"Kaoboys of R&AW: Down Memory Lane" by [[B. Raman]]</ref>
 
=== R&AW ను నాశనం చేయడం ===
Line 92 ⟶ 91:
 
== సంఘ సేవ ==
మొరార్జీ దేశాయ్ గాంధేయవాది, సంఘసేవకుడు,సంఘ సంస్కర్త. అతను గుజరాత్ విద్యాపీఠ్ కు ఛాన్సలర్ గా ఉన్నాడు. అతను ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోకూడా ఈ విద్యాపీఠ్ ను అక్టోబరు మాసంలో సందర్శించాడు. అతను సాధారణ జీవితం గడిపాడు. ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్నప్పుడు కూడా పోస్ట్ కార్టులను తానే వ్రాసేవాడు. కైరా జిల్లాలో రైతులతో సమావేశాలను నిర్వహించడానికి సర్దార్ పటేల్ అతనిని నియమించాడు. ఇవి చివరకు అమూల్ కో-ఆపరేటివ్ ఉద్యమం స్థాపనకు దొహదపడ్డాయి.
 
== వ్యక్తిగత జీవితం కుటుంబం ==
మొరార్జీ దేశాయ్ 1911 లో తన 15వ యేట గుజ్రాబెన్ ను వివాహమాడాడు. <ref>{{cite book|url=https://books.google.com/books?id=2dgqNH6uKUsC&pg=PT39|title=Movers and Shakers Prime Minister of India|first1=Scharada|date=2009|publisher=Westland|page=Morarji Desai Section Page 1|accessdate=26 August 2014|last1=Dubey}}</ref> గుజరాన్ ఆమె భర్త ప్రధానమంత్రి కావాలని చూసింది కానీ అంతకు పూర్వమే మరణించింది. వారికి కాంతి దేశాయ్ అనే కుమారుడు ఉన్నాడు. జగదీప్, భరత్ దేశాయ్ అనబడే మనుమలు ఉన్నారు. జగదీష్ దేశాయ్ కుమారుడు మధుకేశ్వర్ దేశాయ్ <ref>{{cite news|url=http://www.dnaindia.com/india/report_morarji-s-3g-scion-to-enter-politics_1370053|title=Morarji's 3G scion to enter politics|author=Khanna, Summit|date=11 April 2010|work=[[Daily News and Analysis]] (DNA)|accessdate=4 February 2012|location=Ahmedabad|agency=DNA}}</ref> పై తన తాత వారసత్వం పునరుద్ధరించే బాధ్యత పడింది.<ref>{{cite news|url=http://lite.epaper.timesofindia.com/mobile.aspx?article=yes&pageid=5&edlabel=TOIA&mydateHid=11-04-2010&pubname=&edname=&articleid=Ar00502&format=&publabel=TOI|title=Great-grandson to revive Morarjis legacy in state|author=Yagnik, Bharat|date=11 April 2010|newspaper=[[The Times of India]]|accessdate=4 February 2012|agency=[[Times News Network|TNN]]}}{{cite news|url=http://lite.epaper.timesofindia.com/mobile.aspx?article=yes&pageid=5&edlabel=TOIA&mydateHid=11-04-2010&pubname=&edname=&articleid=Ar00502&format=&publabel=TOI|title=Morarji's great grandson to revive legacy}}</ref> మధుకేశ్వర దేశాయ్ ప్రస్తుతం భారతీయ్ జనతా యువమోర్చాకు ఉపాధ్యక్షునిగా ఉన్నాడు. <ref>{{cite news|url=http://articles.economictimes.indiatimes.com/2013-05-30/news/39629167_1_youth-wing-bharatiya-janata-yuva-morcha-bjp-fold|title=Morarji Desai's great grandson Madhukeshwar joins BJP's youth wing as vice-president|date=30 May 2013|newspaper=The Economic Times}}</ref> భరత్ దేశాయ్ కుమారుడు విశాల్ దేశాయ్ రచయిత, సినిమా నిర్మాత.<ref>{{cite news|url=http://www.afternoondc.in/interview/a-lightly-carried-legacy/article_23612|title=A lightly carried legacy|newspaper=The Afternoon}}</ref>
 
== మూత్ర చికిత్స న్యాయవాది ==
Line 139 ⟶ 138:
{{భారత ప్రధానమంత్రులు}}
{{భారతరత్న గ్రహీతలు}}{{Authority control}}
{{Authority control}}
 
[[వర్గం:భారతరత్న గ్రహీతలు]]
[[వర్గం:6వ లోక్‌సభ సభ్యులు]]
"https://te.wikipedia.org/wiki/మొరార్జీ_దేశాయి" నుండి వెలికితీశారు