వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి +{{Authority control}}
పంక్తి 49:
 
== సాహిత్య రచన ==
వీరి రచనలు: వేంకటేశ్వర శతకము, మునిత్రయ చరిత్రము, శ్రీ శంకర విజయము.<ref>{{cite book|title=శ్రీ శంకర విజయము|date=1952|publisher=[[వెంకట్రామా అండ్ కో|వెంకట్రామ అండ్ కో]]|location=విజయవాడ|url=https://archive.org/details/in.ernet.dli.2015.371361}}</ref> 4. శబర శంకర విలాసము 5. మదాలసా విలాసము<ref>{{cite book|title=మదాలసా విలాసము|date=1952|location=భారత డిజిటల్ లైబ్రరీ|url=https://archive.org/details/in.ernet.dli.2015.371701}}</ref> - ఇత్యాదులు. శాస్త్రి 'శంకరవిజయము' ప్రబంధకర్తగా మంచివిఖ్యాతి పొందాడు.
 
పాణంగిపల్లి జమీందారు సబ్నవీసు కృష్ణారావు పంతులుకు ఉపాధ్యాయునిగా ఉన్న దశలోనే ప్రొద్దుటూరి 'కవి' వ్యాసపు పోటీపరీక్షలో ద్వితీయ బహుమానము. ఈ పురస్కారము కారణముగా జమీందారు "కవిసింహ కంకణము" చే సూర్యనారాయణ శాస్త్రిగారిని బహూకరించెను. "జీమూతవాహనచరిత్ర" మను ఖండకావ్యము పాణంగిపల్లి ప్రభువునకు శాస్త్రిగారంకిత మిచ్చినారనుట ప్రకృతము తలచుకోవలసిన విషయము. ఇది యిటులుండగా, [[శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు]] కార్యాలయమున బండితులుగా నుండి వీరు కావించిన వాజ్మయసేవ మఱచిపోరానిది. ఈ యుద్యోగము వలన శాస్త్రిగారి మేధాసంపద మఱింత మెఱుగులు దేఱినది. ఆంధ్రప్రబందములలోని రహస్యములు వెంపరాలవారికి దెలిసినన్ని వేఱొకరికి దెలియవేమో యనిపించును. ఆయన కున్న ప్రయోగపరిజ్ఞానము నిస్సమానమైనది. ఆయనకు వేలకొలది పద్యములు నోటికి వచ్చును. ఒక ప్రయోగమునకు బది యుదాహరణ పద్యములు వెంట వెంటనే చదివి చూపగలరన్నది యతిశయముగా నన్నమాట గాదు. ఇట్టి ధారణాపాటవముగల వీరు సూర్యరాయ నిఘంటు కార్యాలయమునకు జేసిన యువకృతి కృతజ్ఞతకు బాత్రమైనది.
 
మఱి, శాస్త్రులుగారి కవితారచనలోని విశిష్టత యేమనగా, వారు ప్రయోగవైచిత్ర్యమును వలచిన రచయిత లగుటచే నడుగడుగున నూతన ప్రయోగములు కనబఱచెదరు. ఇంచుమించుగా వారి కావ్యములోని పెక్కు ఘట్టములు భట్టి కావ్యమును స్ఫురణకు దెచ్చుచుండును. పాణినీయము నామూలచూడము చుళుకించినవారు కావున వారి కవిత యిటు లుండుటలో నబ్బురమేమి? ప్రయోగదృష్టి యెంత యున్నదో శాస్త్రులు గారికి రసదృష్టియు నంతేయున్నది. ఆ హేతువున వారి కృతులు పండిత హృదయరంజకములై యున్నవి.
 
ఈతీరైన సాధుప్రౌడశయ్యలో శాస్త్రులుగారు "శంకరవిజయము" మహాప్రబంధముగా నంతరించిరి. ఆకృతి శాశ్వతముగానుండుటకు జాలియున్నది. మహాకవితా పట్టము శంకర విజయమువలన శాస్త్రులుగారికి లభించుచున్న దనుటలో విప్రతివన్ను లుండరు. వారు రచించుచున్న 'విద్యారణ్య చరిత్ర' తెలుగు కవితాశాఖకు కైనేత కాగలయది. ఆస్తిక బుద్ధి సంపన్నులు, వ్యుత్పన్నులునైన సూర్యనారాయణశాస్త్రి గారు తీసికొన్న యితివృత్తములన్నియు సుపవిత్రములై యుండుట సుప్రశంసార్హమైన విషయము.<ref>{{cite book|last1=మధునాపంతుల|first1=సత్యనారాయణశాస్త్రి|title=ఆంధ్ర రచయితలు-మొదటి భాగం|date=1950|publisher=భాగముఅద్దేపల్లి అండ్ కో|pages=547-550}}</ref>
పంక్తి 63:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{Authority control}}
 
[[వర్గం:1896 జననాలు]]