వేమూరి శారదాంబ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:19వ శతాబ్దపు తెలుగు కవయిత్రులు తొలగించబడింది; వర్గం:19వ శతాబ్ద తెలుగు కవయిత్రులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి +{{Authority control}}
పంక్తి 2:
=జీవిత విశేషములు=
==బాల్యమందే అబ్బిన అపార విద్య==
1881 మే నెల 3 తారీకున ఇప్పటి [[కృష్ణాజిల్లా]]<nowiki/>లోని [[ముదినేపల్లి]] మండలములోని [[అల్లూరు]] గ్రామంలో జానకమ్మ-దాసు శ్రీరాములు దంపతులకు ఆరుగురు కుమారులతరువాత కలిగిన ఏకైక కుమార్తె సార్థక నామధేయ దాసు శారదాంబ. విజయవాడలో 19 వ శతాబ్దాంతరములో వాణీప్రస్స్ అను ప్రముఖ ప్రచురణాలయమును స్థాపించిన దాసు కేశవరావు, ప్రముఖ న్యాయవాదులైన దాసు నారాయణరావు, మాధవరావు, గోవిందరావు, [[దాసు విష్ణు రావు]], మధుసూదనరావుల సోదరీమణి. వివాహానంతరము సాహిత్యకృషివల్ల వేమూరి శారదాంబగా ప్రసిధ్ధి చెందెను. [[తండ్రి]] దాసు శ్రీరాములు (1846-1908) వృత్తిరీత్యా [[ఏలూరు]]<nowiki/>లో న్యాయవాదేగాక, జ్యోతిశాస్త్రపారంగతుడు, సంగీత సాహిత్యములలో అపారమైన పాండిత్యము కలిగియుండి 'దేవీభాగవతము'రచించి మహాకవిగా ప్రసింధ్దిచెందెను. బహుముఖ ప్రజ్ఞాశాలి, సంఘసంస్కరణాభిలాషి. ఆధునికదృష్టితో స్త్రీలకు విద్యాభ్యాసమనివార్యమని ప్రచారముచేయుటయెగాక ఆనాటి సమాజమందు అటువంటి ఉల్లంఘన వల్ల కలుగు లోకనిందలకు లెక్కచేయక తన కుమార్తెకు స్వయముగా విద్యాభ్యాసముచేసి చూపి సంఘసంస్కరణకు మార్గదర్శకుడైయ్యెను. ఏలూరులో సంగీత పాఠశాలకూడా నెలకొల్పెను. [[రాజమండ్రి|రాజమహేంద్రవరము]]<nowiki/>లోని సుప్రసిధ్ద సంఘసంస్కరణకర్త, [[కందుకూరి వీరేశలింగం పంతులు]], విజయనగరంలోని మహాకవి గురజాడ అప్పారావు గారు సమకాలీకులు. ఏక సంతాగ్రాహి అయిన శారదాంబ అతి చిన్నవయస్సులోనే పుట్టింట సంగీత విద్వాంసులైన [[కోమండూరి నరసింహాచారి]], [[ఈమని వెంకటరత్నం]] వద్ద [[సంగీతము]] నేర్చుకుని వీణావాయిద్యములో అశేష ప్రవీణ్యత సంపాదించెను. తండ్రిగారి పర్యవేక్షణలో సంగీతముతోపాటు విద్యాభ్యాసముచేసి సంస్కృతాంధ్రములో పాండిత్యము గడించెను. [[మైసూరు]], బెంగుళూరు పట్టణములందు జరిగిన సంగీత సమ్మే్ళణములలో వీణా వాయిద్య కచేరీ చే్సెను. ఆనాటి సాంప్రదాయప్రకారము 7వ ఏటనే శారదాంబ [[పెళ్ళి|వివాహం]] 1888 మే నెలలో బందరువాస్తవ్యులు వేమూరి రామచంద్రరావుతో జరిగెను. సంగీత సాహిత్య విద్య అభ్యసించుటవల్ల ఆమె వివాహము బహుప్రయత్నానంతరము జరిగినటుల తెలియుచున్నది.
 
=స్వల్పజీవితకాలం, సాహిత్యకృషి=
1888 సంవత్సరములో వివాహామైనతరువాత శారదాంబ-వేమూరి రామచంద్రరావు దంపతులకు మొదటి సంతానం కుమార్తె, దుర్గాంబ. రెండవ సంతానం, కుమారుడు పార్ధసారథి. 19వ ఏట, 1899 సంవత్సరం డిసెంబరు 26వ తేదిన ఏలూరులో రెండవ సంతానం, కుమారుడైన పార్దసారథినికని శారదాంబ పరమదించెను. వివాహనాంతరం మిట్టింటివారింట సంగీతాభ్యాసమునకు అవరోధములు కలిగినప్పటికినీ భగవత్ప్రార్థన రూపములో సాహిత్య కృషిసాగించెను. 1887 సంవత్సరములో తన 16 వ ఏట ఆమె రచించిన ప్రబంధము ‘నాగ్నజితి పరిణయం’. ఆనాటి పత్రికలు జ్ఞానోదయ పత్రిక, జనానా పత్రికలలో ఆమె రచించిన దేవీస్తుతి [[కీర్తనలు]] ప్రచురించబడినట్లు తెలియుచున్నది.
 
===మాధవశతకము===
పంక్తి 45:
=మూలాలు=
<references />
 
{{Authority control}}
 
[[వర్గం:1881 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/వేమూరి_శారదాంబ" నుండి వెలికితీశారు